<br/>రాష్ట్రంలో ఐటీ దాడులు ఎక్కడ జరిగినా అవన్నీ టి డి పీ కే చెందిన ప్రధాన నేతలవి అవుతున్నాయి. ఇది మా మీద కక్ష సాధింపు చర్య అంటున్నారు చంద్రబాబు. కానీ ఎక్కడ అవినీతి మేటలు వేసిందో, ఎక్కడ నల్లధనం కాలవలై ప్రవహిస్తోందో, ఎక్కడ అక్రమార్కుల గుట్టు గోప్యంగా దాచి ఉందో అక్కడ ఐటి, ఈడి దాడులు జరుగుతున్నాయి.మంత్రి నారాయణ ఇంట్లో, విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరిగాయి. ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాపార సంస్థల్లో ఈ డి దాడులు జరిపింది. కుప్పల కొద్దీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. గుట్టలు గుట్టలుగా కంపెనీల పేపర్లు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు 120 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీల ముసుగులో అక్రమ లావాదేవీలు సాగిస్తున్న తెలుగుదేశం నేతలకు ఈ దాడులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అందుకే దర్యాప్తు సంస్థల పేరు వినగానే టీడీపీ అధినేత తో సహా ప్రతి ఒక్కరూ గజగజా వణుకుతూ ఉన్నారు. రాష్ట్రం పై ఐటీ దాడులా, కేంద్రం కక్షసాధింపు చర్యలా అంటూ గుండెలు బాదుకుంటున్నారు. మొన్న చంద్రబాబు గారు ఐటీ అధికారులకు సెక్యూరిటీ ఇవ్వం అని అంటే, ఇవాళ సుజనా చౌదరి ఐటి రైడ్స్ పై సిబిడిటి చైర్మన్ కు ఫిర్యాదు చేస్తాం అంటున్నారు. అసలు పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సుజనా చౌదరి కి మంత్రి పదవి కట్టబెట్టడమే అప్పట్లో సంచలనం అయింది. మారిషస్ బ్యాంకుల్లో, దేశంలోని ఇతర బ్యాంకుల్లోనూ కోట్లాది రూపాయలు అప్పు చేసి తిరిగి కట్టకుండా తప్పించుకుంటున్నారని సుజనా చౌదరి పై ఆ బ్యాంకులు కేసులు కూడా పెట్టాయి. హాజరు కావాలంటూ సుజనా కు నోటీసులు కూడా అందాయి. ఇన్ని జరిగినా బాబు సుజనా చౌదరి పై ఈగ వాలనివ్వలేదు.మునుపు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా కక్షసాధింపు తోనే ఈ డి దాడులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపి టిడిపి చేసిన కక్షసాధింపే జగన్ పై ఈడీ కేసులు. అప్పటి డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబు చెప్పినట్టల్లా వింటూ జగన్ పై ఎన్నో ఆరోపణలు గుప్పించారు. నేడు ఆ కేసుల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని కోర్టులే తేల్చి చెబుతున్నాయి. వైయస్ ద్వారా లబ్ధి పొందిన చాలామంది జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారంటూ నాటి ప్రభుత్వం పై, అధికారులపై వేసిన చార్జిషీట్ల న్ని ఒక్కొక్కటిగా కొట్టివేస్తున్నారు. తనపై ఆర్థిక నేరాల ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఎంతో సంయమనంతో వ్యవహరించారు. అటు న్యాయస్థానాల్లో ను, ఇటు ప్రజల మధ్య తన నిజాయితీని నిరూపించుకున్నారు. నిరూపించుకునే దాకా వేచి చూశారు. అన్యాయంగా ఏడాది పైన జైల్లో ఉంచినా, కుంగిపోకుండా న్యాయం పై, ధర్మంపై నమ్మకం ఉంచి పోరాడారు. కానీ నేడు దాడుల నేపథ్యంలో చంద్రబాబుతో సహా అందరూ ఇవి కుట్రలు, కుతంత్రాలు, ఐటీ దాడులు జరగకూడదు, ఆపేయాలి అంటూ గోల పెడుతున్నారు. నిజంగా ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే బాబు అండ్ కో కు అంత బెదురు ఎందుకు? ఐటీ, ఈడీ లంటే అంత భయమెందుకు? అవినీతి వేళ్లూనుకుపోయిన వ్యవస్థ కనుకే చంద్రబాబుకు ఐటీ దాడులు అంటే అంత భయం. ఏ తీగను కదిపితే తన డొంక అంతా కదులుతుందో అని వణికిపోతున్నాడు. ఆ బెదురును కప్పిపుచ్చు కోలేక నానా తంటాలు పడుతున్నాడు. ఆరోపణలు చేసినా, అడుగడుగునా అవమానాలతో, అడ్డంకులతో బాధపెట్టినా... ఒక్క రోజు కూడా వైయస్ జగన్ ఇలా కిందా మీదా అయిపోలేదు. పైన దేవుడున్నాడు... కింద న్యాయం ఉంది... అని చిరునవ్వుతో తనకెదురైన సవాళ్లను అధిగమించి... తానేమిటో నిరూపించుకున్నాడు. లక్ష కోట్ల అవినీతి, డొల్ల కంపెనీలు, క్విడ్ప్రోకో అంటూ చంద్రబాబు కాంగ్రెస్ నేతలు కలిసి చేసిన అబద్ధపు ప్రచారం నుంచి కడిగిన ముత్యంలా బయటికొస్తున్నాడు. ఎవరైతే వైయస్ జగన్ను విమర్శించారో, ఆర్థిక నేరగాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడారు నేడు వాళ్లంతా ఒక్కసారి ఐటీ దాడులు జరుగగానే కలవర పడిపోతున్నారు. కక్ష సాధిస్తున్నారు అంటూ కంగారు పడిపోతున్నారు. ఇది అవినీతిపరుడు కి నీతి ఉన్న నాయకుడికి తేడా...