రాజధాని .. ముచ్చటగా మూడు ముక్కలు

రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.
ఆంధ్రలో దోచుకొన్నది సింగపూర్ లో దాచుకొనే స్కీమ్ లో భాగంగానే అక్కడ కంపెనీలకు
రాజధాని నిర్మాణాన్ని అప్పగించారనే మాట బలంగా వినిపిస్తోంది. మాస్టర్ ప్లాన్
ద్వారా బయట పడిన అక్రమాలు చూస్తుంటే ఈ విషయాలు తేట తెల్లం అవుతున్నాయి.

1. అమరావతి రాజధాని నిర్మాణం
పూర్తిగా సింగపూర్ ప్రభుత్వమే చేపడుతోందని పచ్చ మీడియాలో మోతెక్కించారు. తర్వాత ఈ
ఏడాది ఏప్రిల్ 22న జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీన్ని సాంకేతికంగా మార్చి
చూపించారు. సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థల్నే మాస్టర్ డెవలపర్స్ గా ఎంపిక చేస్తూ మాస్టర్
ప్లాన్ లో బయట పెట్టారు. అసెండాస్, సెమ్బ్ కార్ప్ అనే సంస్థలకు రాజధాని నిర్మాణ
బాధ్యతల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వమే చేపడుతోందని, తర్వాత
ప్రభుత్వ రంగ సంస్థలు అని, చివరకు ప్రైవేటు సంస్థల చేతులకు రాజధానిని
అప్పగించేశారు.

2. రాజధాని నిర్మాణానికి
బాధ్యత ఎవరిది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం
మధ్య సంయుక్త అభివ్రద్ధి ఒప్పందం కుదుర్చుకొంటామని అదే ఏప్రిల్ 22న జరిగిన క్యాబినెట్
సమావేశంలో నిర్ణయించారు. కానీ, ఇప్పుడు అక్కడ, ఇక్కడ కూడా ప్రభుత్వాల ప్రతిపాదన
లేనేలేదు. అటు నుంచి అసెండాస్, సెమ్బ్ కార్ప్ .. ఇటు నుంచి ఏపీ సీఆర్డీఏ మధ్య
సంయుక్త ఒప్పందం కుదుర్చుకొనేందుకు రంగం సిద్ధం అయింది.

3. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో
మౌళిక వసతులు అభివ్రద్ది పరచాల్సిన బాధ్యత మాస్టర్ డెవలపర్ దే. కానీ,
ఇప్పుడుమాత్రం అదేమీ కుదరదు మౌళిక వసతులు అన్నీ ప్రభుత్వమే భరించాలని చెబుతున్నారు.
అంతేగాకుండా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్న భూముల మీద పూర్తి హక్కులు ఆయా
సంస్థలకే అప్పగించటంతో పాటు స్టాంప్ డ్యూటీ, ఇతర పన్ను మినహాయింపులు కోరుతున్నాయి.
అదే సమయంలో రాజధాని దగ్గర సేవా పన్నును వసూలు చేసుకొనే సౌకర్యం ఈ ప్రైవేటు
కంపెనీలకు ప్రభుత్వం అప్పగించేస్తోంది.  పైగా రాజధాని నిర్మాణంలో ఇతరత్రా భారాలకు బాద్యత
వహించడానికి అంగీకరించబోమని చెప్పడంతో పాటు కొంత భూమిని ఫ్రీ హోల్డ్ గా ఇవ్వాలని
ప్రైవేటు సంస్థలు కోరుతున్నాయి.

దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి అని
స్పష్టంగా అర్థం అయిపోతోంది. పచ్చ మీడియాలో ప్రచారం ఒకలా, ప్రభుత్వం లో మంత్రివర్గం
తీర్మానంలో మరొకలా.. చివరకు ఆచరణలోకి వచ్చేటప్పటికి మరొక విధంగా పనులు అమలు
చేస్తున్నారు.  

తాజా వీడియోలు

Back to Top