<br/>తుఫానును టెక్నాలజీతో ఎదిరించాడట. సముద్రాన్ని కంట్రోల్ చేసేద్దామనుకున్నాడట. గాలుల్ని మేనేజ్ చేస్తాడట. టోటల్ గా ప్రకృతి విపత్తులనే టెలికాన్ఫరెన్స్ తో సరిదిద్దేస్తాడట. ఇదీ చంద్రబాబు గాలివాటు మాటలు. తిత్లీ తుఫాను రాకను ముందుగానే ప్రిడిక్ట్ చేసాను, అరడజను టెలీ కాన్ఫరెన్సులుపెట్టాను...ఇదీ తుఫాను సహాయక చర్యల గురించి చంద్రబాబు చెప్పే సమాధానం. నిజంగా తుఫాను గురించి ముందుగానే తెలిసినప్పుడు అవసరమైన సమాగ్రిని ఎందుకు తయారుగా ఉంచలేదు? కనీసం తాగు నీటిని కూడా ముందస్తుగా ఎందుకు సిద్ధం చేయలేదు? టాంకర్లతో తాగేందుకు పనికిరాని బురదనీటిని సప్లై చేయడమేనా ముందుస్తు జాగ్రత్త అంటే. చివరికి బాధితులకు అందించాల్సిన సరుకులను కూడా దొడ్డిదోవన దోచుకున్న తెలుగు తమ్ముళ్ల కక్కుర్తి గురించి ఏమని చెప్పగలం. వారం రోజుల్లో నార్మల్ కి తెచ్చాం అంటూ పచ్చి అబద్ధాలు కళ్లార్పకుండా చెబుతున్నాడు చంద్రబాబు. తుఫాను బాధితుల పరామర్శకు వచ్చి అన్నీ అందాయా అంటూ ఎసి బస్సులోంచి ఆరా తీసినప్పుడే ప్రజలంతా లేదు అంటూ బాబుకు సమాధానమిచ్చారు. గతంలో హుద్ హుద్ సాయమే అందలేదు, ఇక ఈ విపత్తు సాయం ఎప్పటికిస్తారంటూ చినబాబును కడిగేశారు. వారం తర్వాత కూడా కంరెటు పునరుద్ధరించలేదని ఉత్తరాంధ్రపై పాలకుల ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉందంటూ యువత ఎదురు తిరిగి ప్రశ్నించారు. అలా అడిగిన వారిని పోలీసులతో అరెస్టు చేయించి, బెదిరింపులకు పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజల వ్యతిరేకతను, ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని జాతి మీడియా ఎక్కడా బైటపడకుండా జాగ్రత్త పడింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ఉంటాయని భయపడి అధికారులు రావడానికే వెనకాడుతున్నాంరంటూ బిబిసి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్య్వూలో నిస్సిగ్గుగా చెబుతున్నాడు చంద్రబాబు. అత్యవసర సమయాల్లో పని చేయాల్సిన అధికారులే ప్రభుత్వ ఆజ్ఞను కూడా బేఖాతరు చేస్తారని తన పరిపాలనా అసమర్థతను స్వయంగా బైటపెట్టుకున్నాడు. ఉద్దానం కిడ్నీ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా బాబు మాటల్లో స్పష్టంగా అర్థం అవుతోంది. ఆ జిల్లాకు అధికారులు ఈమాత్రం చేయడమే పెద్ద విషయం అంటున్నాడు బాబు. బాధితులకు ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులను కూడా చంద్రబాబు పెద్ద ఘనకార్యాలు చేసినట్టే చెప్పుకోవడం విడ్డూరం. ఓ ముఖ్యమంత్రి పలాసకు వచ్చి కాంప్ వేయడం చరిత్ర అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు. అత్యవసర సమయాల్లో అధికారులు నాయకులు పరిస్థితిని సమీక్షించడానికి రావడం కూడా బాబుగారి దృష్టిలో అతి గొప్ప విషయమట. ప్రజలకు ప్రభుత్వం చేయాల్సిన విధులను చంద్రబాబు తన సొంత ఖర్చుతో సామాజిక సేవ చేసినట్టుగా బిల్డప్పులిస్తున్నాడు. సచివాలయం అంతా వచ్చింది, మత్రులు వచ్చారు, బైకులపై తిరిగారు అంటూ చెప్పిన ముఖ్యమంత్రి, తనను తన కొడుకును ప్రజలు నిలదీశారని, అందుకు తాను వారిని బుల్డోజర్లతో తొక్కిస్తానని చెప్పిన మాటలను మాత్రం మరుగునే ఉంచారు. తుఫాను సహాయం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న బిబిసి ప్రతినిధి ప్రశ్నకు చంద్రబాబు సమాధానం మరింత వికృతంగా ఉంది. సంక్షోభం వచ్చినప్పుడు తట్టుకోవడం చేతకానప్పుడు, విపత్తులకు ప్రిపేర్ కానప్పుడు ప్రజలు ఇలా అసంతృప్తితో ఉంటారని ముఖ్యమంత్రి సిద్ధాంతీకరించారు. <br/>అసలు గ్రామాల్లో ప్రజలకు తుఫాను హెచ్చరికలే లేవని, ముందస్తుగా సమాచారం ఇస్తే ఇంత ఆస్తినష్టం జరిగేది కాదని, ప్రభుత్వ సాయం కోసం పడిగాపులు పడాల్సిన ఖర్మ పట్టేది కాదని ఎన్నో మండలాల్లోని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయంపై కూడా చంద్రబాబు తన చేతకాని తనాన్ని అధికారులపైనే రుద్దాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయమని తాను ఆదేశాలు ఇచ్చినా అధికారులు చేయడం లేదని, ఎన్ని టెలీకాన్ఫరెన్సులు పెట్టినా వారు పని చేయలేదంటూ తప్పంతా అధికారులపై తోసేసి చేతులు దులిపేసుకున్నాడు. తిత్లీ తుఫాను బాధితులకు తక్షణ సాయం అందలేదంటూ శ్రీకాకుళం ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే ప్రకృతిని మేనేజ్ చేసాం, అన్నీ అందించేసాం, వారంలోపలే అంతా నార్మల్ చేసేసాం అంటూ పట్టపగలు పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబును అందరూ ఒకే మాట అడుగుతున్నారు...నీకు సిగ్గంటూ ఉందా చంద్రబాబబూ...!!!ReplyReply allForward