షర్మిల మాటలే తూటాలు!



తంబాపురం

25 అక్టోబర్ 2012 : మరో ప్రజాప్రస్థానం సాగిస్తోన్న షర్మిల తన పదునైన మాటలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సూటిగా, ఘాటుగా ఉండే వ్యాఖ్యలతో ఆమె అటు ప్రజావ్యతిరేక విధానలు అవలంబిస్తోన్న ప్రభుత్వాన్నీ, ఇటు దానికి కొమ్ము కాస్తున్న తెలుగుదేశం పార్టీని ఎండగడుతున్నారు. ఆమె ఎత్తి పొడుపులు, వ్యంగ్యాస్తాలు, పంచ్ జనంలోకి ఇట్టే దూసుకుపోతున్నాయి. నేను రాజన్న పాదాన్ని, జగనన్న వదిలిన బాణాన్ని...వంటి మాటలు పార్టీకి కొత్తఊపుతెస్తున్నాయి. బుల్లెట్ల వంటి మాటలు ఆమె చప్పట్ల వర్షం కురిపిస్తున్నాయి. షర్మిల ప్రసంగాల్లోని పంచ్ చూస్తే తల పండిన రాజకీయ నాయకులను తలపించక మానదు. ఎం వి మైసూరారెడ్డి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చి షర్మిలను ప్రశంసించారు.
షర్మిల మాటల తూటాలు కొన్ని...
-ఆరు కంటే ఎక్కువ సిలిండర్లు అవసరం లేనివారికి సిలిండర్లు ఇస్తారట. ఈ అంకెల గారడీ చూడండి. ఎవరికైనా డాక్టరెట్ ఇవ్వాలనుకుంటే ఈ అంకెల గారడీకిగాను ఆ డాక్టరెట్‌ను ప్రభుత్వానికివ్వవచ్చు.
-నిలదీయాల్సిన ప్రధానప్రతిపక్షం చోద్యం చూస్తోంది. ఇప్పుడు పాదయాత్రలంటూ కొత్తనాటకం మొదలుపెట్టారు.
ఈ నాటకాలు కట్టిపెట్టి ప్రభుత్వాన్ని ఎందుకు దించేయరు?
-చంద్రబాబు హయాంలో వైయస్ ఆందోళన చేసినప్పుడు కాల్పులలో రైతులు చనిపోయారు. అప్పుడు రైతులను కాకుండా చంద్రబాబు పరామర్శించింది ఎవరినో తెలుసా? రైతులను కాదు,  కాల్చిన పోలీసులను. అంతటి ఘనుడు చంద్రబాబు.
-రైతురుణాల రద్దు కోసం ఆనాడు చంద్రబాబు కేంద్రానికి ఒక్క ఉత్తరం కూడా రాయలేదు.
చంద్రబాబు హయాంలో నాలుగువేల మందిదాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాపం బాబుగారిది కాదా?
-ఆరోగ్యశ్రీ నుండి ప్రభుత్వం అనేక ప్రధాన వ్యాధులను తొలగించింది. కాంగ్రెస్ వాళ్లు మాత్రం కార్పొరేట్ హాస్పిటల్స్‌కు లేకుపోతే విదేశాలకు కూడా వెళతారు. మీరు మాత్రం ప్రభుత్వాసుపత్రులకే పోవాలట!
-ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ పథకానికి ప్రభుత్వం కత్తెరలు పెడుతోంది. సగమిస్తామనీ, పావు ఇస్తామనీ...ఏం భిక్షమేస్తున్నారా?
-కరెంటు లేక పొలాలకు నీళ్లు లేవు, తాగడానికీ నీళ్లు రావు.
-చదువుకుందామంటే కరెంటు లేదు, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ కూడా లేదు.
-వ్యవసాయం దండగ అని చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో రాసుకుంటే, రాజశేఖర్ రెడ్డి మాత్రం తాను రైతు పక్షపాతిని అని ధైర్యం చెప్పకున్నారు.
-చంద్రబాబు రాజన్న పాదయాత్రను కాపీ చేస్తున్నారు. నాడు వైయస్ పాదయాత్ర చేస్తుంటే ఆ వాగ్దానాలన్నీ నెరవేరడానికి హిమాలయాలకు పోయి తపస్సు చేసుకొమ్మన్నాడు. మరి ఇప్పుడు వైయస్ పథకాలనే అమలు చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు.
-చంద్రబాబు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు.
-చంద్రబాబుకు మాట మీద నిలబడే తత్వం ఆనాడూ లేదు, ఈనాడూ లేదు.
-ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదనీ, అలా ఇస్తే సోమరిపోతులౌతారట. చంద్రబాబు మన మనసులో మాట పుస్తకంలో రాసుకున్న మాటలు.
-చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై కేసులు లేకుండా గొప్పగా మేనేజ్ చేసుకుంటారు.
-ఇందిరమ్మబాట అంటూ కిరణ్ కుమార్ రెడ్డి, పాదయాత్ర అంటూ చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు.
-ఈ ప్రభుత్వానికి సలహాదారు ఎవరో తెలుసా? అది చంద్రబాబునాయుడుగారు!
-దేవుడనేవాడున్నాడన్నది ఎంత నిజమో, ఆ దేవుడు మంచివాళ్ల పక్షాన ఉంటాడనేది కూడా అంతే నిజం. ఆ దేవుడే జగనన్నను బయటకు తీసుకువస్తాడు. ఆ -రోజు రాజన్న రామరాజ్యం దిశగా మనందరం అడుగులు వేస్తాం.రాజన్న కలలను ఆయన కొడుకుగా జగనన్న నిజం చేస్తాడు.
-పదవిలో ఉన్నా, పదవిలో లేకున్నా రైతుల గురించి ఆలోచించింది ఒక్క రాజశేఖర్ రెడ్డిగారు మాత్రమే.
-నాతో కదం తొక్కినవారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా.
-వైయస్ 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు సేవ చేశారు. ఏ పథకం రూపొందించినా ఇందిరమ్మ అనీ రాజీవ్ అనే పేర్లే పెట్టేవారు. కానీ ఆయన చనిపోయాక కాంగ్రెస్ పార్టీ దానికి ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా! ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో దోషిగా చేర్చడం.
-వైయస్ బ్రతికుంటే ఆయనను కూడా కాంగ్రెస్‌ వాళ్లు జైల్లో పెట్టేవారేమో!
-ఎగసిపడే కెరటాన్ని ఎవరూ ఆపలేరు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు.
-సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్,టిడిపిలకు మీరంతా బుద్ధి చెబుతారని నా నమ్మకం.

తాజా వీడియోలు

Back to Top