అవే అబద్దాలు.. అదే మోసాలు..!

() అవసరం ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు

() అవసరం తీరాక అబద్దాలు చెప్పి తప్పించుకొంటారు

() అసెంబ్లీ సాక్షిగా బయట పడుతున్న మోసాలు

హైదరాబాద్) చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అబద్దాలకు ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ సాక్షిగా నిలుస్తోంది. అధికారం కోసం ఆడిన డ్రామాలు ఒక్కొక్కటిగా నిగ్గు
తేలుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని నిన్న మంత్రి
నారాయణ బుకాయిస్తే, ఈ రోజు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ.. రైతులందరికీ
రుణాలు మాఫీ చేస్తానని చెప్పలేదంటూ బుకాయించారు.

ఉద్యోగాలపై మోసం

ఎన్నికలకు ముందు ప్రతీ ఇంటికీ ఉద్యోగం ఇస్తామని తెలుగుదేశం నాయకులు
నమ్మబలికారు. ఇదేవిషయాన్ని టీడీపీ మ్యానిఫెస్టో లో పెట్టారు. ప్రతీ ఇంటికీ
కరపత్రాలు పంచారు. తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొనేందుకు ఇదే చిట్కా
ప్రయోగించారు. రాజధాని వస్తే, భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు
కుమ్మరిస్తామని నమ్మబలికారు. దీంతో నమ్మిన రైతులు తమ భూములు ఇచ్చారు. అంతే గాకుండా
హైదరాబాద్, బెంగళూరుల్లో చిన్న చితకా ఉద్యోగాలు చేసుకొంటున్న పిల్లల్ని పిలిపించి
సీఆర్డీఏ కు అప్పగించారు. తీరా చూస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థుల్ని బయటకు
పంపించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే ...అబ్బబ్బే, తామెక్కడా
ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదంటూ మంత్రి నారాయణ బుకాయించారు.

రుణమాఫీ మీద అదే అబద్దాలు

ఎన్నికలకు ముందు ప్రధాన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే రైతులకు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని
నమ్మబలికారు. బంగారం రుణాలన్నీ మాఫీ చేసి, బంగారాన్ని పూర్తిగా విడిపిస్తామని హామీ
ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఏ వర్గాలకు రుణమాఫీ
చేయలేదు. సరి కదా, తామెక్కడ పూర్తిగా రుణమాఫీ అన్నామంటూ తెలుగుదేశం విప్ కూనం
రవికుమార్ బుకాయించేందుకు ప్రయత్నించారు. అబద్దాల్లో మంత్రి నారాయణ ను రవికుమార్
మించిపోయిన తీరు అసెంబ్లీలో అందరినీ ఆశ్చర్యపరిచింది.

రుజువు చేస్తే రాజీనామా చేస్తారా

తెలుగుదేశం నాయకుల అబద్దాల మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
బేషరతుగా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పిన విషయాన్ని రుజువు చేస్తానని వైఎస్
జగన్ చెప్పారు. అదే జరిగితే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్
విసిరారు. దీనికి ప్రభుత్వ పక్షం నుంచి సమాధానం వస్తే ఒట్టు.

 

Back to Top