గుంటూరులో రాజ‌న్న క్యాంటీన్ ప్రారంభం

గుంటూరు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి(రాజ‌న్న‌) పేరుతో మ‌రో క్యాంటీన్ ప్రారంభ‌మైంది. పేద‌ల ఆక‌లి తీర్చాల‌న్న భావ‌న‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు సొంత నిధుల‌తో రూ.5ల‌కే భోజ‌నం ప‌థ‌కాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఇవాళ గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా ఆధ్వ‌ర్యంలో రాజ‌న్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.

మొద‌ట వైయ‌స్ఆర్‌సీపీ మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజ‌న్న క్యాంటీన్ ఏర్పాటు చేయ‌గా ఆ త‌రువాత హిందూపురం, న‌గ‌రి, రైల్వే కోడూరులో రాజ‌న్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద‌ల‌కు రూ.5ల‌కే భోజ‌నం వ‌స‌తి క‌ల్పిస్తు పేద‌ల ఆక‌లి తీర్చుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప రాజధాని గ్రామాల్లో అనుకున్న ప్రాంతాల్లో ఇంత వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదు.   వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల స‌హ‌కారంతో ఏర్పాటు చేస్తున్న రాజ‌న్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లి తీర్చ‌డంపై రాష్ట్ర ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top