చంద్రబాబు పేరు చెబితేనే హడల్

() చంద్రబాబు పర్యటనలతో సామాన్యులు కుదేలు

() పర్యటనలకు బలవంతంగా తీసుకెళుతున్న నాయకులు

() లీడర్లకు మాత్రం కాసుల పంట

విజయవాడ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
జన సమీకరణ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హడావుడిలో టీడీపీ నేతలు మాత్రం
కాసులు రాబట్టుకొంటున్నారు.

వరుసగా టూర్లు

ఓటుకి కోట్లు కుంభకోణం లో దొరికిపోయినప్పటి నుంచి చంద్రబాబు హైదరాబాద్ లో
పెద్దగా ఉండటం లేదు. విజయవాడలో సమీక్షలు పెట్టడం లేదంటే జిల్లాల్లో పర్యటించటం
పనిగా పెట్టుకొన్నారు. దీంతో దాదాపుగా వారంలో 3,4 రోజులు ఏదో ఒక జిల్లాలో పర్యటన
నడుస్తోంది. పర్యటనలు చంద్రబాబు కోసం పెడుతున్నప్పటికీ జనానికి అవస్థలు తప్పటం
లేదు. పింఛన్ దారుల్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని జన సమీకరణ చేస్తున్నారు.  సీఎం సభకు రాకపోతే పింఛన్ లు, రేషన్ కార్డులు
తీసివేస్తామంటూ జన్మభూమి కమిటీల ముసుగులోని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. దీంతో
సామాన్యులు హడలి పోతున్నారు. మరో వైపు జన సమీకరణ కోసం ప్రైవేటు స్కూల్స్ నుంచి
బస్సులు లాక్కొంటున్నారు. బస్సులు పంపించాక అవి వచ్చే దాకా పిల్లల్ని ఇంటికి పంపించటానికి
ఉండటం లేదు. కొన్ని చోట్ల అయితే ఏకంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చేస్తున్నారు.

నేతలకు సందడే సందడి

చంద్రబాబు పర్యటన టీడీపీ నేతలకు మాత్రం కాసుల్ని రాలుస్తోంది. ఎక్కడ పర్యటన
ఉన్నా కొద్ది రోజుల ముందు మాత్రమే ఖరారు అవుతోంది. దీంతో సభకు సంబంధించిన
ఏర్పాట్లను నామినేషన్ పద్దతిలో అప్పగించేస్తున్నారు. దీనికి ఎంత ఖర్చు అనేది
లెక్కా పత్రం కూడా ఉండటం లేదు. దీంతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారు.
వేదిక ఏర్పాటు, లైటింగ్, మైక్ ల నిర్వహణ, డెకరేషన్, ఏసీలు, కూలర్ల తరలింపు, వాటర్
సరఫరా, ఆహార వసతి వంటి పనులన్నీ తెలుగు తమ్ముళ్లకు దక్కుతున్నాయి.

నలిగిపోతున్న అధికారులు

చంద్రబాబు పర్యటనలు రెవిన్యూ అధికారులకు విసుగు తెప్పిస్తోంది. పరిపాలనకు
సంబంధించిన పనుల మీద ద్రస్టి పెట్టలేకపోతున్నారు. బాబు పర్యటన పేరుతో ప్రతీ సారి
5,6 రోజులు ఏర్పాట్ల కు తర్వాత 1,2 రోజుల సమీక్షలకు సరిపోతోంది. నెల తిరిగే సరికి
మళ్లీ పర్యటన వచ్చి పడుతోంది. దీంతో రెవిన్యూ అధికారులు అసహనం చెందుతున్నారు.

 

Back to Top