పోరాట పథం తెచ్చిన విజయం

నేతల వారసులు ఎక్కడున్నారు.. అని ప్రశ్నించుకుంటే సమాధానం చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో, సహాయ మంత్రిగానో, ఏదో ఒక బాధ్యతను మోస్తూనో గడిపేస్తున్న వారు చాలా మందే కనిపిస్తారు. అలా కాదనుకుని సొంత ఇమేజ్‌ను పెంపొందించుకోవాలనుకునే వారిని కాంగ్రెస్ పార్టీ సహించదు కాక, సహించదు. ఏదో ఒక పేరుతో వేధిస్తూనే ఉంటుంది. తిప్పలు పెడుతూనే ఉంటుంది. వీటన్నింటికీ రాబోయే ఎన్నికలలో సమాధానం లభిస్తుంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి నల్లకాలువలో మూడేళ్ళ క్రితం ఇచ్చిన మాటకు కట్టుబడి చేపట్టిన ఓదార్పు యాత్రను కాంగ్రెస్ అధిష్ఠానం సహించలేకపోయింది. కొంత కాలం వేచి చూసినప్పటికీ, అందుకు వ్యతిరేక సమాధానమే వచ్చేసరికి ఆయన తన మాటను ఆచరణలో పెట్టారు. ఫలితంగా తొలుత పార్టీ నుంచి బయటకొచ్చారు.

తదుపరి, ఆయనను తన దారిలోకి తెచ్చుకోవాలని ఆ పార్టీ చేయని యత్నం లేదు. సీబీఐ కేసులు, చివరిగా అరెస్టు, బెయిలు రాకుండా అడ్డుకోవడం... ఇవేవీ ఆయనను తన బాట నుంచి పక్కకు తప్పించలేకపోయాయి. ప్రజానీకం సైతం ఆయన వెంటే నడిచింది. అందుకు ఉప ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. ఇదంతా జగన్మోహనరెడ్డి దృఢ దీక్ష, పట్టుదల, పోరాట తత్త్వాలను ప్రజలకు చాటిచెప్పాయి. ఆయన వెన్నంటి ఉండాలనే ఆలోచనను వారిలో పాదుగొల్పాయి.

ఒక్కసారి గతాన్ని తలచుకుంటే... కాంగ్రెసు నీడలో పెద్దవారయిన వారి వారసులు ఎక్కడున్నారో అవగతమవుతుంది. దేశ ప్రధానిగా పనిచేసిన తొలి తెలుగు నేత పీవీ నరసింహారావు తనయుడు రంగారావు కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరో తనయుడు రాజేశ్వరరావుకు ఒకసారి రాజ్యసభ సభ్యునిగా అవకాశం లభించింది. తనకు అదే చాలనుకున్నారనుకునే కంటే అంతకు మించి అవసరం లేదని అధిష్ఠానం భావించిందనుకోవటం నిజం. కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు సూర్యప్రకాశరెడ్డి ఎంపీగానూ, కోడలు సుజాత ఎమ్మెల్యేగానూ గెలుపొంది నెట్టుకొచ్చారు.

తెలంగాణలో బలమైన నాయకుడిగా ఎదిగిన మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఆయన తనయుడు మర్రి శశిధర రెడ్డికి ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టి, కేంద్ర విపత్తు నివారణ సంఘం సభ్యునిగా నియమించి పక్కన బెట్టింది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి మార్పు వాదన మొదలు కాగానే.. ఆయన పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందనే వార్తలు వినిపించాయి. కానీ, మొదటి దశలోనే ఆయన పేరును పక్కన పెట్టాయనీ అంటున్నారు. దీనికి కారణమేమిటా అని ఆరా తీస్తే రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను ఆకర్షించలేరన్న సంగతి బయటపడింది.

కాసు బ్రహ్మానందరెడ్డి బంధువు కృష్ణారెడ్డి ప్రస్తుత కేబినెట్లో మంత్రి. జలగం వెంగళరావు తనయులు ప్రసాదరావు, వెంకటరావు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ ప్రస్తుత అసెంబ్లీ స్పీకరుగా ఉన్నారు. మండలి వెంకట కృష్ణారావు వారసుడు బుద్ధప్రసాద్ గతంలో మంత్రిగా పనిచేశారు.

టన్నింటినీ గమనించే కాబోలు మాజీ ముఖ్యమంత్రీ, ప్రస్తుత తమిళనాడు గవర్నరూ అయిన రోశయ్య తన కుటుంబం మొత్తాన్నీ రాజకీయాలకు దూరంగా ఉంచారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు నుంచి ముఖ్యమంత్రి పదవిని గుంజుకునే వరకూ ఆయన తనయులు హరికృష్ణనూ, తన తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావునూ చేరదీసి, తదుపరి దూరంగా పెట్టారు. హరికృష్ణకు ఎంపీ పదవి ఇచ్చారు. వెంకటేశ్వరావు పార్టీని వీడేలా పరిస్థితులు సృష్టించారు.

ఎదిరించిన వారినీ, తమకు ఆటంకాలు కల్సిస్తాడనీ భావించిన వారిపై కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరిని పాటిస్తూ వస్తోంది. అధిష్టానంతో పోరాడే శక్తి లేక లభించిందే చాలుననే వైఖరితో 99శాతం మంది నెట్టుకొచ్చేస్తున్నారు. వైయస్ జగన్మోహనరెడ్డి వీరందరికీ భిన్నంగా ఆలోచించారు. అధిష్ఠానం యోచనకు ఏ మాత్రం ఆమోదం తెలిపినా రెండో శ్రేణి నాయకుల కోవలో చేరిపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తన పంథాను ఎన్నుకున్నారు. నాయకత్వానికి సవాలు విసిరారు. పోరాట పటిమతో విజయాలు సాధిస్తున్నారు.

ఆ ఫలితంగానే ప్రజలు జగన్‌ను ఆరాధిస్తున్నారు. ప్రజలలో ఆయన పట్ల పెరిగిన ఆదరణే ఎన్డీటీవీ సర్వేలో ప్రతిబింబించింది. రాజకీయ పార్టీలలో గుబులు పుట్టిస్తోంది.

ద్రబాబూ నోటికీ తాళం వేసింది. ఆయనను వంద రోజుల యాత్రకు పరుగులు తీయిస్తోంది. ఇది చూసి కాంగ్రెస్ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే..

Back to Top