నిప్పుకి చెద భయం

అదేంటి..? నిప్పుకి చెద పట్టదంటారు కదా పెద్దలు..అంటారా! ఆ మాట నిజమే. కానీ నిప్పు అని చెప్పుకుని తిరిగేవాళ్లకు భయం తప్పదు కదా! అందుకే దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని అని చెప్పుకుంటూ, తానొక నిప్పునంటూ నిత్యం పొగలు కక్కే చంద్రబాబుకి ఇప్పుడు మా చెడ్డ  భయం.. కాదు కాదు.. చెద భయం పట్టుకుంది. 
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేశాం సార్ అనడానికి తోక మీడియా ఉంది. తిమ్మిని బమ్మిని చేసి చెప్పడానికి సొంత గొట్టాలున్నాయి. నోటికొచ్చినట్టు పేలడానికి తమ్ముళ్లుతున్నారు. తప్పును ఒప్పుగా పదే పదే ప్రచారం చేసి ఒప్పు అనిపించే ప్రయత్నం చేయడానికి కావాల్సినంత విష సామాగ్రి ఉంది. అవకాశాన్ని బట్టి తిప్పడానికి ఆయనకే కావాల్సినన్ని నాలుకలున్నాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో ప్రపంచస్థాయి డిగ్రీలున్నాయి. ఇన్ని ఉండగా... ఇంత దిక్కుమాలిన బలగం పుష్కలంగా తులతూగుతుండగా బాబుకు భయమెందుకబ్బా..! అని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది.
అధికారం అడ్డుపెట్టుకుని అన్నీ కంట్రోల్ చేస్తున్నా.. ఒక్కటిమాత్రం తన చేతిలో లేకుండా పోతుందని తెగ బాధపడిపోతున్నాడు బాబు. బాబునే భయపెట్టిందంటే అది మామూలు విషయం కాదంటారా..!! నిజమే అది ప్రజలగొంతుగా వినిపిస్తున్న సోషల్ మీడియా. ఇక్కడే బాబుగారి అసలురూపం బయటపడుతుందట. సామాన్య ప్రజలనుంచి, విద్యార్థులు, ఉద్యోగులు, మేథావులు ఇలా అన్ని వర్గాల వారు ఇప్పుడు తమ అభిప్రాయాలకు సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారు. అదే వేదికగా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, మాట మార్చితే నాలుక బయటకు లాగి మరీ వాత పెట్టేలా బదులిస్తున్నారు. తన పచ్చ బలగంతో ఎంత విషం చిమ్ముతున్నా... పప్పుగారు, నిప్పుగారు అసలు రూపాల్ని కప్పలేకపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రజలద్వారా నిజాలు బయటకెళిపోతున్నాయి, అందరికీ తెలిసిపోతున్నాయంటూ నిప్పు తెగ భయపడుతున్నాడు.. డమ్మీ గొప్పలు చెప్పుకునే తనకు చెదపట్టక తప్పదని తెగ పొగలు కక్కుతున్నాడు. ఇదే విషయాన్ని బహిరంగంగానే బయటపెట్టాడు చంద్రబాబు. ఏం చేసినా సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నామని, దానివల్ల ప్రపంచంలోనే గొప్పవాడిగా చెప్పుకుని తిరిగే తన ఇమేజి డ్యామేజి అయిపోతుందని వాపోయాడు. 
అంతేకదా మరి... 
డమ్మీ నిప్పుకి చెదపట్టకుండా ఉంటుందా?!
ఎంత ఉడికితే మాత్రం పప్పు నిప్పవుతుందా?

Back to Top