నరం లేని నాలుకతో నక్కా...


రాష్ట్రంలో ఓ ప్రధాన రాజకీయ పార్టీ అధినేత. ప్రతిపక్ష నాయకుడు. ఎన్నోఏళ్లుగా ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడుతూ, ఏడాది కాలంగా పూర్తిగా ప్రజల్లోనే ఉండి ఎంతో ఆదరణ చూరొగొన్న నేత...వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిపై పట్టపగలే అదీ పకడ్బందీగా ఉండే సెక్యూరిటీ ఉండే ఎయిర్పోర్టు ఆవరణలో కత్తితో దాడి జరిగింది. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నాయకులు ఈ ఘటన పై స్పందిస్తున్నారు. వైఎస్ జగన్ పై దాడిని ఖండిస్తున్నారు. కానీ ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏలుతున్న టిడిపి మాత్రం కనీస జ్ఞానం లేకుండా, మానవతా దృక్పథమైనా చూపకుండా గాయపడ్డ జగన్ పైనే ఎదురుదాడికి పూనుకుంది. ప్రతిపక్ష నేతపై జరిగన దాడికి ప్రభుత్వ అసమర్థతే కారణం అని, దీనివెనుక కుట్ర ఉందని ఆక్రోశిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదనకు సమాధానం చెప్పకపోగా అసలు ప్రతిపక్ష నేత రక్షణ బాధ్యతే మాది కాదంటూ అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు దేశం నేతలు. మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియా తో మాట్లాడిన మాటల్లో ప్రతిపక్ష నేతపై సానుభూతి లేకపోగా దాడి విషయంలో విపరీతమైన అలక్ష్యం బైటపడింది. ఎయిర్పోర్టు బయట వరకు మాత్రమే రాష్ట్ర రక్షణ వ్యవస్థ బాధ్యత అని విమానాశ్రయంలో జరిగే ఘటనలకు తాము బాధ్యులం కామని మంత్రి నక్కా చెప్పడం నిజంగా సిగ్గు చేటు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు కూడా కనీస విచక్షణా జ్ఞానం లేకుండా మాట్లాడటాన్ని, జగనపై జరిగిన దాడికి ప్రభుత్వ పూచీ లేదంటూ తప్పించుకోవడాన్ని వైఎస్ జగన్ అభిమానులు, తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎయిర్పోర్ట్ లోకి చెకిన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ నక్కా చెప్పడం వెనుక ఖచ్చితంగా టిడిపి కుట్ర ఒకటి దాగుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. కేంద్ర బలగాలకే కానీ రాష్ట్ర పోలీసులకు బాధ్యత ఉండదు అని తేల్చి చెబుతున్న ఆనంద్ బాబు దాడికి కారణమైన వ్యక్తి పనిచేస్తున్న ఎయర్పోర్ట్ లోని రెస్టారెంట్ యజమాని తమ పార్టీ వ్యక్తే అని, అతడికి ఆ లైసెన్సు ఇప్పించడంలో సహకరించింది తెలుగు తమ్ముళ్లే అని బహిరంగంగా చెప్పడం లేదు. నీచమైన హత్యా రాజకీయాల చరిత్ర టిడిపికి, చంద్రబాబుకు లేదని పచ్చిగా అబద్ధమాడేస్తున్న నక్కా ఆనంద్ బాబు అసలు గతం మరిచిపోయినట్టున్నారు. అసలు నీచమైన వెన్నుపోటు రాజకీయమే చంద్రబాబు అసలు చరిత్ర అని, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను చంపిన హత్యా రాజకీయ నేర చరిత్ర బాబు సొంతమని ఆయన మరచినా రాష్ట్రం మరువదు. దాడులను చంద్రబాబు ఎప్పుడూ ప్రోత్సహించలేదని వీళ్లకే ఈ అలవాట్లు ఉన్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఉద్దేశించి మంత్రి మాట్లాడిన మాటలు ఆ పార్టీ నేతల అహంకారాన్ని సూచిసస్తున్నాయి. అసెంబ్లీలో పచ్చి బూతులు మాట్లాడిన వాళ్లెవరో, పాతేస్తా, నరికేస్తా అంటూ హింసాత్మకంగా ప్రవర్తించెందవరో అందరికీ తెలుసు. అలాంటి నీతి నియమాలు లేని టిడిపి నేతలు తాము చేసిన తప్పులను ఎదుటివారికి ఆపాదించి ఆరోపణలు చేయడం ఆ పార్టీ సిగ్గులేని మనస్తత్వానికి నిదర్శనం. 
రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకుడు గాయపడి ఆస్పత్రి పాలై ఉంటే వారిపై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేయడం తప్పించి, దాడిలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించడం, దాడికి గల కారణాలను కనుగొని ప్రజలకు తెలియపరచడం అనే నైతిక బాధ్యతను కూడా గాలికొదిలేసారు. మానవతా విలువలు కానీ, సహాయతా ధర్మం కానీ లేని పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశమే అని నక్కా ఆనంద్ బాబు మాటలు మరోసారి రుజువు చేసాయి. 
మంత్రే విచారణాధికారిగా మారి కేసు తీరును వర్ణించే వ్యవస్థను ఈ ప్రభుత్వంలోనే చూడగలం. దాడి చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అభిమాని అని, అసలీ దాడి వెనుక ఏముందో అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు మంత్రి. ఆ వ్యక్తి జగన్ అభిమానా? చంద్రబాబు నియమించిన కిరాయి హంతకుడా అన్నది దర్యాప్తు చేసే పోలీసులు తేల్చాలి. కానీ మంత్రి గారు మాత్రం తనకు అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నారు. గుమ్మాడికాయ దొంగ పేరెత్తితే భుజాలు తడుముకున్నట్టు ముందుగానే నెపాన్ని తమపై నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనకు బాధ్యులను వదిలేసి బాధితులపై ఆరోపణలు చేస్తూ, అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడిన నక్కా ఆనంద్ బాబు వైఎస్ జగన్ కు క్షమాపణలు చెప్పాలని అంటున్నారు  ఆ పార్టీ నేతలు. నరంలేని నాలుకతో నక్కా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top