తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే టాపిక్. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు వేళ్ల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప‌్పదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం వెనుక బాబు వ్యూహం ఏమిటని కూపీ తీస్తున్నారు. ఈ సందర్భంలో తెలిసిన కొన్ని వాస్తవాలు ఇలా ఉన్నాయి.నందమూరి పేరు తుడిచిపెట్టే కుట్రఎన్నికలప్పుడు నందమూరి తారక రామారావు గారి పేరును అన్న ఎన్టీఆర్ అంటూ స్మరించే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి సాధ్యమైనంత దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలా ఆ కుటుంబానికి సంబంధించిన అందరినీ చీకట్లోకి నెట్టేశాడు. అనూహ్యంగా అధికారానికి దూరమవడంతో మళ్లీ నందమూరి వంశం పేరు వాడక తప్పని పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబీకులను తనకు నచ్చినట్టు చెప్పుచేతల్లో ఉంచుకునే ఎత్తుగడలతో చంద్రబాబు తన జిత్తులన్నీ చూపించాడు. బాలకృష్ణ కుమార్తెతో కొడుకు వివాహం జరిపించి బావను వియ్యంకుడిని చేసుకున్నాడు. ఆ విధంగా టీడీపీకి వారసుడిగా నారా లోకేష్ పేరు తప్ప మరొకరి పేరు లేకుండా చేసాడు. ఇక హరికృష్ణ వైపు నుంచి బలంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పార్టీ ప్రచారానికి మాత్రమే పరిమితం చేసాడు. ఈ విధంగా నందమూరి కుటుంబం నుంచి గట్టి పోటీ ఇచ్చే నాయకుడే లేకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. కళ్యాణ రామ్ కాదన్నందుకేతెలంగాణా 2018 ఎన్నికల నేపథ్యంలోనూ బాబు తన కుతంత్రాలను మరోసారి ప్రయోగించాడు. హరికృష్ణ తనయుడు సినీ హీరో, నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ను తెలంగాణాలో పోటీ చేయమని కోరగా అతను నిరాకరించాడు. జూనియర్ ప్రచారానికి కూడా రానని తెగేసి చెప్పేసాడు. దాంతో బాబు చూపు హరికృష్ణ కుమార్తె సుహాసినివైపు మళ్లింది. సుహాసిని మావగారు గతంలో టీడీపీ ఎంపిగా ఉమ్మడి రాష్ట్రంలో తన ఉనికి చాటుకున్న వ్యక్తే. ఆ విధంగా సుహాసిని రాజకీయరంగ ప్రవేశాన్ని తప్పనిసరి చేసారు. నిజమైన సర్వే ఫలితాలు, సుహాసిని వంటి కొత్త వారికి అనుకూల ఉండదన్న వాస్తవాలు చంద్రబాబుకు తెలియక కాదు. ఒకే కుటుంబానికి చెందిన తోడబుట్టిన వారి మధ్యే చిచ్చుపెట్టి, భవిష్యత్తులో పోటీకి రాకుండా నిలువరించడమే బాబు వ్యూహం. అందరూ అనుకున్నట్టుగానే కూకట్ పల్లిలో సుహాసినికి భారీ ఓటమి ఎదురైంది. మాటైనా మాట్లాడటం రాని, రాజకీయ అనుభవం లేని మహిళలను బలవంతంగా ఎన్నికల బరిలోకి లాగి బలిపశువును చేసారని ఆ పార్టీలోని ఎన్టీఆర్ అభిమానులే మధనపడుతున్న దుస్థితి. నారాకు దూరమైన జూనియర్ బ్రదర్స్జూనియర్, కళ్యాణ రామ్ లు ఇరువురూ తెలంగాణాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికే కాదు, సోదరి సుహాసిని ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయారు. గెలవాలని ఆశిస్తున్నాం అంటూ ప్రకటన తప్ప వారివైపు నుంచి మద్దతు మాత్రం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారం తర్వాత చంద్రబాబు అవమానించిన తీరు వారికి కనువిప్పు కలిగించి ఉండొచ్చు. తరచు తారక్ సినిమాలకు థియేటర్లు లేకుండా చేయడం, సమస్యలు సృష్టించడం లాంటివి నందమూరి అభిమానులకూ ఆగ్రహం కలిగించాయి. గత కొన్నాళ్లుగా నారా వల్ల నష్టపోతున్న నందమూరి కుటుంబం అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి హరికృష్ణలాగే కొడుకులూ చంద్రబాబు రాజకీయ ఎదుగుదలకు నిచ్చెనలై ఉపయోగపడుతున్నారంటూ విస్తృతంగా వస్తున్న విమర్శలకు పులిస్టాప్ పెట్టేందుకే జూనియర్ బ్రదర్స్ తెలంగాణా ఎన్నికలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అంటే నందమూరి నిజమైన వారసులు నారా కుట్రల పట్ల నిరసన చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. తమ తండ్రి, బాబాయి, మావయ్యలు చంద్రబాబు దగ్గర మోసపోయినట్టుగా తాము కాకూడదని ఎన్టీఆర్ మూడోతరం వారసులు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్, తారక్ ఇద్దరూ ఒకే మాటపై ఉండటం ఇందుకు తార్కాణం. ఏదేమైనా ఏళ్ల తరబడి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీపై గుత్తాధిపత్యం చేస్తున్న చంద్రబాబు నందమూరి వారసులకు ఆ పార్టీలో సముచిత స్థానం ఇస్తాడనుకోవడం ఉత్తిమాట. కాకపోతే వాడుకుని వదిలేసే చంద్రబాబు నైజాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే కనీసం ఈతరమైనా నందమూరి పేరును రాజకీయాల్లో గట్టిగా వినిపించగలదేమో అని ఆశపడుతున్నారు అభిమానులు.