మాట తప్పలేదు...పట్టువీడలేదు



అనుకున్నదే జరిగింది.  మాటిస్తే తప్పమన్న వైయస్సార్‌సీపీ..ప్రత్యేకహోదా పోరులో పార్లమెంటు సాక్షిగా గట్టిగా నిలిచింది. రాజీనామా లేఖలిచ్చి జనం మనసులు గెలిచింది.
నాలుగేళ్లుగా ఒకటే మాట..ఒకటే దీక్షగా ప్రత్యేక హోదాపై వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. ఆందోళనలు చేశారు. రాస్తారోకోలు చేశారు. దీ క్షలూ చేశారు.

జగన్‌ వెంట జనమూ కదిలారు. ఆ పో రాటస్ఫూర్తికి జేజేలు పలికారు. ఇంత జరుగుతున్నా..
ఆంధ్రుల హక్కయిన ప్రత్యేక హోదా కోసం విపక్షనేత అలుపెరుగని పోరాటం చేస్తున్నా, అ«ధికార పక్షానికి చీమకుట్టినట్టుగా కూడా లేకపోయింది.
రాష్ట్రప్రయోజనాల కోసం..ప్రజలకోసం ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టాల్సిన బాబుగారు మొద్దుబాబయిపోయాడు. చాక్లెట్‌ ఇస్తే చాలు ఎగిరి గంతులేసే పిల్లాడిలా మారిపోయారు. ప్రత్యేక ప్యాకేజీ అనగానే లొట్టలేశారు. చాక్లెట్టో, బిస్కట్టో ఇస్తే ఎవరివెంటయినా పడిపోయే పిచ్చిపిల్లాడిలా సారుగారు,.. బుట్టలో పడిపోయారు. అమాయకంగా పడ్డారో, బోలెడు చాక్లెట్టు జేబులో వేసుకోవచ్చన్న దురాశతో పడ్డారో కానీ, రాష్ట్రానికి, రాష్ట్రప్రజలకు తీవ్ర అన్యాయం మాత్రం చేశారు. మేధావులు, ప్రజలు, విపక్షపార్టీ... హోదా ప్రాధాన్యతను వివరించి చెప్పినా చెవినేసుకోని బాబు, కల్లబొల్లికబుర్లతో నాలుగేళ్లకాలాన్ని కరిగించేశారు. 

ప్రత్యేకహోదా పోరుకోసం ఉద్యమించినవారిపై కేసులు పె ట్టించారు. అరెస్టులు చేయించారు.  నిజంగా ఇది చాలా సిగ్గుచేటైన విషయం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే కాదు, తెలుగుప్రజల ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు చల్లారు. యువత భవిష్యత్తును చీకటిమయం చేసే దిశలో వడివడిగా అడుగులు వేశారు. ఆయనగారి ఊతపదం ’ఆ విధంగా ముందుకు’ వ్యతిరేకంగా ’ఆ విధంగా వెనక్కు నడిచారు. ఢిల్లీలో తెలుగువాడితనాన్ని తగ్గించడంలో...జీ హుజూర్‌తరహా రాజకీయం నడపడంలో బాబుగారు చేస్తూ వచ్చిన విన్యాసాలు..తెలుగువారికి తలవంపులుగా మారాయి.

విపక్షమంటూ లేకుంటô  మన పాలకులు ప్రత్యేకహోదాకు ఎప్పుడో సమాధికట్టేసేవారు. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమనుకుని ముందుకు సాగుతున్న విపక్షనేత, ప్రత్యేకహోదా సాధించుకోకపోతే రాష్ట్రమనుగడకు తీవ్రనష్టం జరుగుతుందని స్పష్టంగా చెబుతూ ఆ హక్కును సజీవంగా తెలుగువారి మనసులో నిలిపాడు. ఆలోచనల్లో నింపారు. ఇప్పుడు ఆంధ్రరాష్ట్రం గుండెగొంతుక చప్పుడు ప్రత్యేకహోదా.....
పార్లమెంటులో అవిశ్వాసతీర్మానం పెట్టడంలో వెనుకంజ వేయని వైయస్సార్‌సీపీ ఎంపీలు, చివరాఖరు అస్త్రంగా రాజీనామాలు సమర్పించారు. తెలుగువాడి తెగువను ఢిల్లీ సాక్షిగా ...పార్లమెంటు ముంగిట చాటారు. ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమంటూ ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ఏపీ భవన్‌ దగ్గర అమరణనిరాహారదీక్షకు తెగించారు. 

ఇది తెలుగుప్రజలందరూ స్పందించాల్సిన సమయం.  ప్రత్యేకహోదా కోసం పట్టువదలకుండా పోరాడుతున్న వైయస్సార్‌సీపీ పార్టీకి మద్దతుగా నిలవాల్సిన సమయం. ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదాను సాధించితీరుతామన్న సంకల్పదీక్షను చేపట్టాల్సిన సందర్భం.
తెలుగుబిడ్డా....ఆం్ర«ధప్రదేశ్‌ ప్రత్యేకహోదాకోసం నేను సైతం ...అని ఉద్యమించాల్సిన సమయ,సందర్భాలు ఇంతకన్నా వుండవు...జయహో...
 
Back to Top