కైమా కైమా నిజ‌మే బాబూ?


- ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ హ‌త్యా రాజ‌కీయాలు 
- నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో 15 మంది ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల హ‌తం
- హంత‌కుల‌కు ముఖ్య‌మంత్రే అండ 

అమ‌రావ‌తి:  విశాఖ ఎయిర్ పోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన నేప‌థ్యంలో అధికార పార్టీ నేత‌ల  అస‌లు రంగు బ‌య‌ప‌ట‌ప‌డుతోంది. ఇప్పటికే వైయ‌స్‌ జగన్‌ హత్యకు తాము ప్లాన్‌చేస్తే.. భారీస్థాయిలో ఉంటుందని మంత్రి సోమినేని చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని తన మనసులో మాటను బయటపెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే వైయ‌స్‌ జగన్‌ ఎప్పుడో కైమా కైమా అయిపోయేవారంటూ నాని తీవ్ర వికృత వ్యాఖ్యలు చేశారు. ఇన్నివేల కిలోమీటర్ల పాదయాత్రలో జగన్‌ ఎప్పుడో అయిపోయేవారని తన వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. వైయ‌స్‌ జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే ఘ‌ట‌న‌పై సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగితే ప‌రామ‌ర్శించాల్సిన ముఖ్య‌మంత్రి మీడియా స‌మావేశంలో అవ‌హేళ‌న‌గా, వాడు, వీడు అంటూ ఓ బ‌జారు మ‌నిషిలా బ‌రి తెగించి మాట్లాడారు.  పైకి మాత్రం తానేదో గొప్ప మానవాతావాదిలా.. అభివృద్ధి కాముకుడిలా ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు తెరవెనుక హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. బౌద్ధ మతం ప్రేరణతో అమరావతిలో శాంతి సౌభాగ్యాలను వెల్లివిరిసేలా చూస్తానని వైయస్‌ఆర్‌సీపీ నాయకుల హత్యలను ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబు సూచనలతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు రానున్న ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులను లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. క్రూరమృగాలకంటే హీనంగా మారి మనుషులను చంపేస్థాయికి దిగజారారు పచ్చరౌడీలు.  2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా పార్టీ నాయకులు బలపడేందుకు వీలుగా ఇసుమ మాఫియాను ప్రోత్సహిస్తున్నాడు చంద్రబాబు. ఇదెంత దారుణంగా తయారైందంటే ఇసుకను మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తహసీల్దార్‌ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టి ఈడ్చి కొట్టడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేను మందలించాల్సిన చంద్రబాబు మాత్రం తహసీల్దార్‌ను పిలిచి మందలించడం అధికారులపై అదీ మహిళలపై ఆయనకున్న చిన్నచూపును తెలియేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 300 మంది హత్యకు గురయ్యారు.

ప్లాన్ ప్ర‌కారం మార్డ‌ర్‌
టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఇప్పటికే 15 మంది వైయస్‌ఆర్‌సీపీ నాయకులను పొట్టన బెట్టుకున్నారు.   కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డిని పొట్టనబెట్టుకున్నారు. నారాయణరెడ్డి హత్య జరిగిన విధానాన్ని పరిశీలిస్తే పక్కా స్కెచ్‌తో చేసిన హత్యగా తెలుస్తుంది. కేఈ సోదరుల అండదండలతోనే నారాయణరెడ్డిని ప్లాన్‌ ప్రకారం అతి కిరాతకంగా చంపివేశారని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక పోలీసుల సహకారం ఉందనే అనుమానాలను నారాయణరెడ్డి కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు.   

విచార‌ణ‌కు ఆదేశించే స‌త్తా టీడీపీకి ఉందా?
టీడీపీకి నిజంగా హత్యా రాజకీయాలపై మాట్లాడాలని చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో జర్నలిస్టు పింగళి దశరథరాం, ఐఎఎస్ అధికారి రాఘవేంద్రరావు హత్యలు మొదలుకొని 1988లో జరిగిన రంగా హత్య వరకు అన్ని కేసులను తిరగదోడి విచారణకు ఆదేశించే సత్తా టీడీపీ ప్రభుత్వానికి ఉందా ?. విజయవాడ నగర టీడీపీ నేత కాట్రగడ్డ బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం ఎవరు చేశారో.. వారు ఏ పార్టీ వారో, దానికి ఎవరు డబ్బు సమకూర్చారో అందరికీ తెలుసు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో టీడీపీ వ్యక్తులు దోషులు కాదా?.  ఇది బాబు గారి నేరాల గుట్ట‌..పాపాల చిట్టా..


నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో టీడీపీ హ‌త్య‌లు ఇదిగో.. 
(2015 ఏప్రిల్‌ 29) అనంతపురం : రాప్తాడులో  వైయస్‌ఆర్‌సీపీ నేత ప్రసాద్‌ రెడ్డి  (ఎమ్మార్వో) కార్యాలయంలో హత్య
(2015 అక్టొబర్‌ 14)ఆళ్లగడ్డ : చింతకుంటలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రాఘవ రెడ్డి హత్య.
(2015 మే 15) కర్నూలు :వైయస్‌ఆర్‌సీపీ  ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ వసంత రావు హత్య.
 (2014 ఏప్రిల్‌ 14) గుంటూరు : తెనాలిలో వైయస్‌ఆర్‌సీపీ యూత్‌ వింగ్‌ లీడర్‌ మెడిశెట్టి క్రిష్ణ హత్య
(2014 సెప్టెంబర్‌ 11) గుంటూరు : చినగార్ల పాడులో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త గొవింద రెడ్డి హత్య
(2015 మార్చ్‌ 31) అనంతపురం : కిష్టిపాడులో వైయస్‌ఆర్‌సీపీ  నేత (సహకార  బ్యాంక్‌ ప్రెసిడెంట్‌) విజయ భాస్కర్‌ రెడ్డి హత్య
(2014 డిసెంబర్‌ 30) నెల్లూర్‌: వైయస్‌ఆర్‌సీపీ  నేత అల్లం నరేంద్ర హత్య
(2014 నవంబర్‌ 27) కర్నూలు : పలుకూరులో వైయస్‌ఆర్‌సీపీ నేత ప్రభాకర్‌ నాయుడు హత్య
(2014 అక్టొబర్‌ 28) విజయవాడ : నందిగామలో వైయస్‌ఆర్‌సీపీ నేత బొగ్గవరపు వాసు హత్య
గుంటూరు: పల్నాడు వైయస్‌ఆర్‌సీపీ నేత కుమారుడు సాంబయ్య హత్య
(2016 డిసెంబర్‌ 9) పులివెందుల : వేంపల్లి మండలం ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి హత్య
(2017 మే 6) కర్నూలు : ఆళ్ళగడ్డ నియొజకవర్గం గోవిందపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ  నేత ఇందూరి ప్రభాకర్‌ రెడ్డి ఆయన బావమరిది దారుణ హత్య
(2017 మే 21) కర్నూలు : పత్తికొండ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు దారుణ హత్య 

Back to Top