క‌ల‌లో కాంగ్రెస్..భ్ర‌మ‌ల్లో బాబు



రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భూస్థాపితమై పోయినా కాంగ్రెస్ ఇంకా కళ్లు తెరుచుకోలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వల్ల రాష్ట్రానికి ఏం లాభం అని అడుగుతున్నాడో అమాయకపు కాంగ్రెస్ నేత. జగన్ పాదయాత్రవల్ల రాష్ట్రానికి హోదా వస్తుందా, రైల్వేజోన్ వస్తుందా అని పప్పులకే పెద్దపప్పులా అడుగుతున్నాడు. ఏ జగన్ పోరాటం వల్ల, ఉద్యమం వల్ల చంద్రబాబు ప్యాకేజీ పంచను వదిలి హోదా కి జై అన్నాడో, ఏ జగన్ పాదయాత్ర తో భయపడి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటున్నాడో తెలుగు ప్రజలందరికీ తెలుసు. 
పాదయాత్ర పేరు చెబితే వణుకు
అసలు పాదయాత్ర పేరు చెబితేనే కాంగ్రెస్ గుండెళ్లో బుల్లెట్ రైళ్లు పరుగెడతాయిలా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తానన్నప్పుడు కూడా సొంత పార్టీ నేతలే ఆయన్ను నిరుత్సాహపరచాలని ప్రయత్నించారు. పాదయాత్రతో ఏమొస్తుంది, నీరసం, ఆయసం తప్ప అని హేళన చేసారు. ఈ వయసులో అంత కష్టం ఎందుకు? ఏ బస్సుయాత్రో చేద్దాం అని ఉచిత సలహాలు ఇచ్చారు. పూర్తి చేయలేకపోతే నవ్వులపాలౌతాం అని ఇంకొందరు బెదిరించారు. ఆరోగ్యం పాడౌతుందని, ఫలితం పెద్దగా ఉండదని, ప్రజలు లెక్కచేయరని ఇలా తలో మాటా అన్నారు నాటి కాంగ్రెస్ లీడర్లు. కానీ ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కనుకే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పిపీలకాల మాట పట్టించుకోలేదు. విమర్శలను ఖాతరు చేయలేదు. ప్రజా ప్రస్థానం చేసి తీరుతాను అని అడుగు ముందుకు వేసారు. ఆయన అడుగు ఓ చరిత్రకు నాంది పలికాయి. సంక్షేమ స్వప్నాలకు పునాదులయ్యాయి. పాలకుడు ఎలా ఉండాలో, నాయకుడు ఎలా కావాలో తరతరాలకు చెప్పుకునే పాఠాలయ్యాయి. ఆ పాదయాత్రే ఎపిలో కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు కారణం అయ్యింది. కాంగ్రెస్ వల్ల రాజశేఖర్ రెడ్డి పేరు తెచ్చుకోలేదు, రాజశేఖర్ రెడ్డి వల్లే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కీర్తిని సంపాదించుకోగలిగింది. కానీ కాంగ్రెస్ ఆ గతాన్నే మర్చిపోయింది. పాదయాత్ర తో ఏం వస్తుంది అంటూ పిచ్చి కూతలు కూసే కాంగ్రెస్ నేతలను చూసి తెలుగు ప్రజలు ఛీ కొడుతున్నారు. ఏ పాదయాత్ర ఆ పార్టీ ఉనికిని నిలబెట్టిందో, ఏ నాయకుడి సంకల్పం నేటికీ వారసత్వంగా సాగుతోందో దాన్నే అవహేళన చేసిన కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో పట్టిన గతే మళ్లీ రాబోయే ఎన్నికల్లోనూ పడుతుందంటున్నారు.
దురహంకారానికి ఓటుతో జవాబు
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముందు, తర్వాత కూడా కాంగ్రెస్ తన మార్కు సీల్డు కవర్ సీఎమ్ పద్ధతినే ఫాలో అయ్యింది. ఆ సిద్ధాంతాన్ని చెరిపేసి స్వయం ప్రతిపత్తి ఉన్న నాయకుడిగా నిలిచి అధిష్టానానికి నిద్ర లేకుండా చేసారు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో అధిష్టానం, హైకమాండ్ అన్నమాటలకు తావు లేకపోవడంతో అధికార దురహంకారం విలవిల్లాడింది. ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేసింది. వైఎస్ కుటుంబాన్ని ఒంటరిని చేసి, కుట్రలతో జగన్ ను జైలుపాలు చేసింది. వైఎస్సార్ కు ద్రోహం చేసిన కాంగ్రెస్ ను చిత్తు చేసి ఉండచుట్టి ఉత్తరాదికి విసిరేసారు తెలుగు ప్రజలు. చరిత్ర పునరావృతం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రభంజనమైంది. మబ్బులు తొలగిని సూర్యుడిలా మృత్యుంజయుడై తిరిగి నడుస్తున్నాడు వైఎస్ జగన్. ఆ పదఘట్టాలకు కాంగ్రెస్ కూసాలు కదులుతున్నాయి. కొత్తగా చేసుకున్న పొత్తుల సత్తువలు కూడా బీటలు వారుతున్నాయి. అందుకే ఆ అక్కసు తీర్చుకునేందుకే తమ అసమర్థత బైటేసుకునేందుకే పాదయాత్రతో రాష్ట్రానికి ఏం వస్తుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజాసంకల్ప పాదయాత్రతో రాష్ట్రానికి చైతన్యం వచ్చింది. ప్రజల్లో కదలిక వచ్చింది. తమ కష్టాలు తీరే రోజులు వస్తున్నాయని నమ్మకం వచ్చింది. జగన్ తో రాజన్నరాజ్యం రానుందనే ధైర్యం వచ్చింది. వైఎస్సార్ పాదయాత్ర కాంగ్రెస్ కు జవజీవాలిచ్చింది. వైఎస్ జగన్ పాదయాత్ర కాంగ్రెస్ టిడిపిల వెన్నులో వణుకు పుట్టించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఎత్తులు వేస్తూ భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ సమరంలో విజేతలెవరో ముందుగానే తెలిసిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే ..వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌ట్ట‌నుంది. ఇది నిజం..ఇదే జ‌నం మ‌దిలో మెదిలే స‌త్యం.

 
Back to Top