ఎద్దు మూలిగిన వ్యవసాయం... రైతు ఏడ్చిన రాజ్యం బాగు పడినట్టు చరిత్రలోనే లేదు అనేది సామెత. రాష్ర్టంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఫొటో చూస్తే మానవత్వం ఉన్న ఏ మనిషైనా స్పందిస్తాడు. రైతన్న దుస్థితిని చూసి అయ్యో పాపం అని చలించని హృదయం ఉండదు. సర్వాధికారాలు ఉన్న ముఖ్యమంత్రయితే పరుగున వచ్చి సమస్యకు పరిష్కారం చేసి చూపించాలి. తన హయాంలో రైతుకు జరుగుతున్న అవమానం చూసి ముఖ్యమంత్రి సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కసీనం స్పందించాలన్న స్ప్రహ లేకుండా పోయింది.ఇక్కడే మరో సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. రైతును, వ్యవసాయాన్ని తృణ సమానంగా భావించే చంద్రబాబు వ్యవసాయం గురించి ఐక్యరాజ్య సమితిలో ఉపన్యాసాలు దంచడం.
మా భూములు మాకియ్యండయ్యా అని రైతులు.. పోలీసుల కాళ్లు పట్టుకోవడం దురదృష్టకరం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని సెజ్ బాధిత రైతులు తమ భూములను తమకు వెనక్కి ఇవ్వాలని వేడుకోవడం ఎవరినైనా కన్నీళ్లు పెట్టించేదే. పరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకీ దుస్థితి దాపురించింది. భూ సేకరణలో జరుగుతున్న అవకతవకలు, పరిహారం చెల్లింపుల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే నలుగురికీ అన్నం పెట్టే రైతన్నకీ దుస్థితి దాపురించింది.
ఎల్లో మీడియాను వెంటేసుకుని..మొన్ననే సేంద్రియ వ్యవసాయంపై ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేయడానికి ఐక్యరాజ్యసమితికి వెళ్లిన చంద్రబాబు పరిపాలనలో ఇలాంటి దుస్థితి ఉన్నా.. ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. పోలీసుల తూటాలకు బషీర్‌బాగ్‌లో రైతులు అసువులు బాసినా.., వ్యవసాయం దండగ అని సాక్షాత్తూ చంద్రబాబు వ్యాఖ్యానించినా ఐక్యరాజ్య సమితిలో బాబు ప్రసంగించడానికి ఏ అర్హత ఉందని ప్రశ్నించదు. రైతులు, వ్యవసాయం మీద అంత శ్రద్ద ఉన్న మనిషి గడిచిన నాలుగేళ్లలో ఎన్ని తాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు.. ఎన్ని ఎకరాలు సాగులోకి తెచ్చారో లెక్కలు బయటకు తీయరు. గ్రామాల్లో కరాళ నృత్యం చేస్తున్న కరువుతో ఉపాధి కోసం పక్క రాష్ర్టాలకు వలస బాటు పడుతున్నరైతుల గోడు పట్టించుకోరు. వానల్లేక భూగర్భ జలాలు అండుగంటి పోతున్న నెర్రెలుబారిన నేలలు.. చంద్రబాబు పాద ధూళి సోకి గంగమ్మ ఉబికి వచ్చినట్టు ఫోజు కొడుతుంది ఎల్లో మీడియా. రెయిన్ గన్‌లతో అనంతపురంలో కరువును తరిమేశానని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబును చూపించిన ఎల్లో మీడియా.. వారం రోజులకే రెయిన్ గన్‌ల బాగోతం బయటపడినప్పుడు మాత్రం అచ్చెయ్యడానికి మనస్కరించలేదు. మెరుగైన సమాజం కోసం పాటుపడే ఎలక్ర్ట్రానిక్ మీడియా కూడా కనీసం ఒక్క నిమిషం కేటాయించలేకపోయింది. పాదయాత్రలో ఉండగా ఇదే విషయమై వైయస్ జగన్ బాధిత రైతుతో మాట్లాడించి అప్పట్లో ఈ సమస్యను వెలుగులోకి తెచ్చాడు. సమాజ నిర్మాణంలో కీలకంగా ఉండి అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన మీడియా.. చంద్రబాబు వంతపాడటం ప్రజలకు ద్రోహం చేయడమే.