కాపు ఉద్యమానికి ముద్రగడ మంగళం


కాపు ఉద్యమం చివరి ఘట్టానికి వచ్చిందట.. ఈ మాట అన్నది ఎవరో కాదు... కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ అంశంలో ఆ వర్గాన్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబును వెనకేసుకొచ్చిన ముద్రగడ ఇప్పుడు ఉద్యమం చివరాకరికి వచ్చింది అంటున్నారు. దీని అర్థం కాపు ఉద్యమాన్ని ముద్రగడ ఇక విరమించినట్లేనా? బాబు ప్యాకేజీ రాజకీయం బాగా పని చేసిందా? కాపు రిజర్వేషన్ అంశాన్ని ముద్రగడ ఇక మూలన పెట్టనున్నారా? జె.డి లక్ష్మి నారాయణ రాయబారం ఫలితాన్ని చూపిస్తోందా? ముద్రగడ మాటలు వింటుంటే అలాగే అనిపిస్తుంది. కాపుల రిజర్వేషన్ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడి, నిజాయితీగా మాట్లాడిన జగన్ పై విరుచుకుపడ్డ ముద్రగడ, ఇప్పుడు కాపు ఉద్యమం విషయంపై  చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. 

2017 చివర్లో మంత్రి అచ్చెన్నాయుడు కాపు రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా, చర్చలకు తావులేకుండా, సాధ్యాసాధ్యాల గురించి వివరణ లేకుండా ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన దాన్ని కేంద్రం ఆమోదించకపోతే ప్రయోజనం ఉండదు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్తున్నాడు. ఐ టి ఐ దీంతో 55 శాతానికి రిజర్వేషన్లు చేరడం ఈ బిల్లు సాధ్యాసాధ్యాలపై నమ్మకాన్ని చెరిపేస్తోంది. ఏ పి క్యాబినెట్ చేసిన బిల్లు కూడా విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ వర్తింపు చేసింది. రాజకీయ పదవులకు ఈ రిజర్వేషన్లు వర్తించవని లో స్పష్టంగా చెప్పింది. రాజకీయంగా కాపులను ఎదగకుండా చేసే కుట్రలు ఇది ఒక భాగం. 

ఇలాంటి మోసాన్ని సహించి, కాపులపై కపట ప్రేమ చూపిన చంద్రబాబు వైపే ముద్రగడ మొగ్గుచూపడం వెనుక చాలా రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ముద్రగడ కుటుంబాన్ని దారుణంగా అవమానించి,  హౌస్ అరెస్ట్ చేసినా కూడా, చంద్రబాబుపైనే నాకు నమ్మకం ఉంది అన్నారు ముద్రగడ. ఈ మాటల వెనుక జేడీ లక్ష్మీనారాయణ మధ్యవర్తిత్వం ఉంది. టిడిపి షాడో గా పనిచేస్తున్న మాజీ దర్యాప్తు అధికారి జేడీ లక్ష్మీనారాయణ, ముద్రగడ ను కలిసి భోజనం చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఇలాంటి స్టేట్మెంట్ రావడం విడ్డూరమే. దీని వెనుక ప్యాకేజీ రాజకీయం ఉందన్నది అందరికీ తెలిసిన విషయం. 

కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉన్నందున దానిపై హామీ ఇవ్వలేను అని స్పష్టంగా చెప్పారు వైయస్ జగన్. కానీ కాపులకు పెద్ద పీట వేస్తూ కాపు కార్పొరేషన్ కు చంద్రబాబు ఇచ్చిన నిధులకు రెట్టింపు ఇస్తానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కానీ బాబు కాపులను మభ్యపెడుతూ, బిల్లు తాము చేసేశామని, మిగతాదంతా కేంద్రం చేతుల్లో ఉందంటూ తప్పించుకో చూస్తున్నారని జగన్ విమర్శించారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ముద్రగడ మాటలు కాపులను మరోసారి మోసం చేసే చంద్రబాబు ఎత్తుగడలో భాగంగా అనిపిస్తున్నాయి. ఇప్పటికే కాపులు వైయస్ జగన్ నిజాయితీకి ఫిదా అయ్యారు. కాపు కార్పొరేషన్ కు రెట్టింపు నిధులు, రాజకీయాల్లో వారికి ప్రాధాన్యత వంటి విషయాల్లో జగన్ మాటను కాపులు 100% నమ్ముతున్నారు. మాట తప్పని వ్యక్తిత్వం ఉన్న జగన్ను నమ్మకుండా, మోసం చేసిన బాబును నమ్ముతాను అన్నప్పుడే ముద్రగడ పై కాపులు ఆగ్రహం పెల్లుబికింది. ఇక ఉద్యమాన్ని చివరికి తెచ్చాను అనడంలో ముద్రగడ ఉద్దేశం బాబుకు సాయం చేయడమే అనడంలో సందేహం లేదు ఉన్నారు ఆ సామాజిక వర్గ ప్రజలు.
 
Back to Top