ఈ పురస్కారం సంస్కారమేనా??


 అంతర్జాతీయ వ్యవసాయ
విధాన నాయకత్వ పురస్కారం చంద్రబాబుకు ఇస్తున్నార్ట.

ఇందుకు ఈయన్ను ఎంపిక
చేసింది స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ.

ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయరంగ
అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపు, గ్రామీణ ప్రాంతాల శ్రేయస్సు కోసం చేసిన కృషికి ఈ పురస్కారం
అందిస్తున్నారని వార్తా సమాచార సారాంశం...

ఇందులో ఏ ఒక్క విషయంలోనైనా
చంద్రబాబుకు సంబంధం ఉందని తెలుగు ప్రజలు, తెలుగు రైతులు భావించగలరా?

అసలు ఈ స్వామినాథన్
కమిటీ రైతుల గురించి ఇచ్చిన నివేదికలోని ఒక్క అంశాన్నైనా చంద్రబాబు ఎపిలో ఇంప్లిమెంట్
చేసారా? అంటే లేదు.

పెట్టుబడికి 50 శాతం జోడించి కనీస మద్దతు
ధర ప్రకటించాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సు. అది బాబు ఎపిలో అమలు చేసారా?

రైతులకు ఆరోగ్యపరమైన
బీమా అందించాలని చెప్పింది. రాష్ట్రంలో అన్నదాతకు ఆరోగ్య బీమా ఉందా? బాబు ప్రభుత్వం అది
కల్పించిందా?

మద్దతు ధర నిర్ణయంలో
రైతు ప్రతినిధులకు భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పింది. అసలు రైతు ప్రతినిధులంటూ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారా?

అసలు వ్యవసాయమే దండగ
అన్న ముఖ్యమంత్రికి వ్యవసాయరంగంలో పాలసీ లీడర్ షిప్ అవార్డు ఇస్తారా?

ఆహారపంటలు వద్దు, వాణిజ్యపంటలు వేయండి
అనే చంద్రబాబు రైతు బాంధవుడా?

గత పాలనాల కాలంలో రైతులను
పోలీసు తుపాకులతో కాల్చి చంపిన రాక్షసుడు నేడు వ్యవసాయానికి మద్దతుదారుడయ్యాడా?

వ్యవసాయంలో ఏముంది? మీ పొలాలు ఇచ్చి రాజధానికి
రండి, వ్యాపారం నేర్పిస్తా అన్న పక్కా వ్యాపారవేత్త వ్యవసాయ పురస్కారానికి అర్హుడెలా
అవుతాడు?

ఖరీఫ్ సాగు గత నాలుగేళ్లలో
గణనీయంగా పడిపోయి 40 లక్షల ఎకరాల నుంచి 34 లక్షల ఎకరాలకు చేరుకుంది. అంటే సాగు విస్తీర్ణం
దాదాపు 5 శాతం తగ్గిపోయింది.

స్వామినాథన్ కమిటీ సిఫార్సులను
కనీసం ఖాతరు చేయని రైతు వ్యతిరేకి చంద్రబాబుకు వ్యసాయ రంగం గురించి మాట్లాడేందుకు అంతర్జాతీయ
వేదికల నుంచి పిలుపులు, జాతీయ పురస్కారాలు. భళా భళా...ఇదెలా ఉందంటే పెద్దపులికి శాకాహార శార్దూల బిరుదిచ్చి
సత్కరించినట్టుగా ఉంది. కర్షక వ్యతిరేకి అయిన చంద్రబాబుకు ఈ పురస్కారం ఇస్తున్నవాళ్లకు
ఎలాగూ లేదని అర్థమైంది...  పుచ్చుకునేవాళ్లకైనా
తమకా అర్హత ఉందా అని ఆలోచించే సంస్కారం ఉంటుందా?

Back to Top