హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం ప్రభుత్వం మరో సారి చెలరేగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించింది. మొదటి రోజు సమావేశాల సందర్బంగా ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు కొత్త సంప్రదాయానికి తెర దీసింది. అధికార దర్పాన్ని చూపించింది.<br/>మొదటి రోజు సంతాప తీర్మానాల మీద మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతున్నప్పుడల్లా మైక్ అందనీయకుండా ప్రభుత్వం ప్రయత్నించింది. అవకాశం దొరక పుచ్చుకొని మాట్లాడుతుంటే కూడా మైక్ కట్ అయిపోయేది. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల బాద్యత తీసుకొన్న ప్రైవేటు ఛానెల్ .. ఈ ప్రసారాల విషయంలో స్వామి భక్తిని ప్రస్తావించింది. ఒకానొక దశలో వైఎస్ జగన్ నేరుగానే ఈ వ్యాఖ్య చేశారు. పచ్చ చొక్కా వేసుకోలేదు తప్పితే అన్ని పనులు తెలుగుదేశం కోసమే ఈ చానల్ చేస్తోందని ఆయన అన్నారు.<br/>సంతాప తీర్మానం సమయంలో సభా నాయకుడి తర్వాత ప్రతిపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం. కానీ, పుష్కరాల తొక్కిసలాట లో చనిపోయిన వారికి సంతాపం తెలియచేసేందుకు వైఎస్ జగన్ మాట్లాడుతుంటే అడ్డు ఏర్పడింది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, ఇతర సభ్యులు మాట్లాడుతుండగా మైక్ అందింది కానీ, వైఎస్ జగన్ కు మాత్రం మైక్ అందలేదు. ఈలోగానే తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం అమరులైన వారికి సంతాపం తెలియ పరిచే సందర్భంలోనూ అదే జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ అయింది. తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు.<br/>ఈ విధంగా ప్రతిపక్ష నేత మాట్లాడకుండానే తీర్మానాలు ఆమోదించటం, పదే పదే మైక్ కట్ చేయించటం, ప్రత్యక్ష ప్రసారాల హక్కులు తీసుకొన్న ఛానెల్ తో కుట్ర చేయించి మైక్ లు కట్ చేయించటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్రల్ని అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తే, దాన్ని సభ నిర్వహణ మీద చేసినట్లుగా చిత్రించటంపైనా విమర్శలు చెలరేగుతున్నాయి. <br/>