అవినీతి చక్రవర్తి గురించి ఐఎఎస్ ల మాట

పాలనా వ్యవస్థకు మూలస్తంభాలు అధికారులు. రాష్ట్ర పరిపాలనలో కీలక భాగస్వాములైన వీరి నోటివెంటే ముఖ్యమంత్రి అవినీతి చిట్టా బయటపడుతుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు.  చంద్రబాబు పాలనకు సాక్షంగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ అజేయ్ కల్లాం ప్రజల ముందు, ప్రెస్ ముందూ బహిరంగంగా చెప్పిన వాస్తవాలను అవినీతి చక్రవర్తి పుస్తకంలో సవివరంగా పొందుపరిచడం జరిగింది. మేలుకొలుపు పేరుతో ఆయన రాసిన పుస్తకంలో బాబు స్వార్థానికి రాష్ట్రం ఎలా బలైందో, వ్యవస్థలెలా నాశనం అయ్యాయో, అవినీతి ఎలా వేయి తలలు వేసిందో నిజాయితీగా వివరించారు ఈ ఐఎఎస్. 
బాబు హయాంలో అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టాయి
రాజధాని ఎంపిక మొదలు, సంక్షేమ పథకాల అమలు వరకూ చంద్రబాబు, అతని బినామీలు, అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు కార్యకర్తల వరకూ అంతా కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని ఎలా దోచుకుతిన్నారో చెప్పుకొచ్చారు ఆజేయ్ కల్లాం.   సాగునీటి నిధుల్లో 40శాతం దుర్వినియోగం అవుతున్నాయి. 50,000 కోట్లు విడుదల చేస్తే 20,000 కోట్లు స్వాహా అయ్యాయి. తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగుకు 11 వేలు ఖర్చు చేసారు. అది కాస్త వర్షం వస్తే నీళ్లు కారుతోంది. 4000 విలువ చేసే ఫోనుకు 7,500 ధర నిర్ణయించి 5లక్షల ఫోన్లు కొన్నారు. ఐటీ పేరు చెప్పి కోట్ల విలువైన భూములు చౌకగా కంపెనీలకు ధారాదత్తం చేసారు. ఉపాధి హామీకింద కేంద్రం ఇచ్చే నిధులు మొత్తం దుర్వినియోగం అయ్యాయి. 100 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మించడం పోయి 60,000 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించడం ఎందుకు? నాన్ బడ్జెట్ అంటూ మరో 60,000 కోట్ల అప్పు దేనికోసం? ఇదంతా ఏపీని లూఠీ చేయడం కాదా?
ప్రచార పిచ్చి
ఒక్క మీడియా సంస్థకే ప్రభుత్వం 700 కోట్లు చెల్లించింది. ఇలా ముఖ్యమంత్రిని పొగిడే కొన్ని మీడియా సంస్థలకు ప్రచారం కోసం ముట్టే డబ్బులో ప్రతి పైసా ప్రజలదే. ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ పథకాల కోసం వినియోగించాల్సిన సొమ్ములు ఇలా ప్రచారాలకు తగలేయడం బాబు అహంకారానికి నిదర్శనం. ధర్మపోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షలు, నిరాహారదీక్షలు అంటూ ఈవెంట్ల తరహాలో భారీగా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 
ఆర్భాటపు ఖర్చులు
ముఖ్యమంత్రి ఒక్క పూట పర్యటన ఖర్చు 25 లక్షలు. ముఖ్యమంత్రి మొదలు ఆయన వెనుక మందిమార్బలం, అధికారులు, నాయకులు పైనుంచి కింది స్థాయి వరకూ అందరూ జల్సాలకు, దర్జాలకూ అలవాటుపడ్డారు. ప్రత్యేక విమానాలు, విందులు, స్పెషల్ ఛాపర్లు, విదేశాలకు గుంపులుగా వెళ్లడం, లగ్జరీ పొలిటీషియన్ గా చంద్రబాబును దేశమంతా గుర్తించింది. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖర్చులు రెండితలవ్వడం విచిత్రం. ఇదీ చంద్రబాబు చెబుతున్న నలభై ఏళ్ల పాలనానుభవం తెచ్చిన దుస్థితి. లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తినపడింది. ఉద్యోగులుగా ప్రభుత్వంలో పనిచేసినా, ఈ వ్యవహారాలను ఎదిరించి, వద్దని వారించినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేసేందుకే కంకణం కట్టుకున్నాడు. అడ్డుకునేందుకు అధికారులకు అధికారాలు లేవు. సలహాలు ఇచ్చే స్వయం ప్రతిపత్తి తప్ప. ఇదీ రాష్ట్రంలో ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారి ప్రభుత్వం, చంద్రబాబు పాలనపై చెప్పిన నిజాలు. ఇలాంటి మరెన్నో నిప్పులాంటి నిజాలను అవినీతి చక్రవర్తి పుస్తకం ద్వారా ప్రజలముందు ఉంచుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి భూతంలాంటి బాబును తరిమి కొట్టేందుకు ప్రజల చేతిలో ఆయుధమై నిలుస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top