అంతా సింగపూర్ మయం, జనం ఎటుపోతే ఏమిటి..

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా సింగపూర్ జపంలో మునిగిపోయింది. జనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొనే పరిస్థితిలో లేదు. నిత్యావసర ధరలు మండిపోతుంటే నీరో చక్రవర్తి మాదిరిగా చంద్రబాబు సింగపూర్ లావాదేవీల్లో మునిగి తేలుతున్నారు. 

రెండు మూడు నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. వివిధ మార్కెట్ లలో ధరవరలు ఇలా ఉన్నాయి.
కందిపప్పు..180
మినపప్పు... 165
పెసర పప్పు.. 140
చింతపండు... 130
ఎండుమిర్చి.. 140
పల్లీలు... 135

నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమని మండిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ధరల స్థిరీకరణ కు తీసుకోవాల్సిన చర్యలు పట్టించుకోవటం లేదు. ఈ రెండు నెలల కాలంలోనే దాదాపు 40 శాతం మేర రేట్లు పెరిగాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు నెలలుగా సింగపూర్, శంకుస్థాపన తప్ప చంద్రబాబు నోట మరో మాట రావటం లేదు.

ఉల్లి ధర చూస్తే తెలుస్తుంది
ఉల్లిపాయల ధరలు 2 నెలల నుంచి 40 రూపాయిల పైనే పలుకుతోంది. కానీ కర్నూలు లో ఉల్లి కొనుగోలు కేంద్రంలో కిలోకి 12 నుంచి 15 రూపాయిలు మాత్రమే రైతుకి దక్కుతోంది. దీన్ని బట్టి దళారీల మాయా జాలం ఎంతటిదో అర్థం అవుతుంది. ఒక్క కిలో మీద దళారీలు రూ. 25 దాకా నొక్కేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మరి ఇంతకన్నా దారుణం ఉంటుందా.
Back to Top