‘ఈడీ టాప్‌ టెన్‌’ లిస్టు అంతా ఫేక్‌


– ఆధారాల్లేని తప్పుడు కథనంతో వైయ‌స్‌ జగన్‌పై విష ప్రచారం 
– ఈడీ అధికారికంగా ప్రకటించిందని ఎక్కడా చెప్పలేదు
– ముందు ఇంగ్టీష్‌ పత్రికలో రాయించి.. 
  ఆ కథనం ఆధారంగా అంటూ బొంకుతున్న అనుకూల మీడియా
–  వైయ‌స్ జగన్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర 

మేం బురద జల్లుతాం.. నువ్వు తుడుచుకో.., ఎనిమిదేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్నది ఇదే. కోర్టు కేసులు, ఈడీ చార్జు షీట్‌లు చూపించి ఆనాడు పచ్చ పత్రికల్లో అసత్య కథనాలతో పబ్బం గడుపుకున్న చంద్రబాబు ఇప్పటికీ అదే పంథాను ఫాలో అవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఏదైనా కార్యక్రమం మొదలెడుతుంటే వణుకు.. వీలైనంత వరకు ఆపాలని ప్రయత్నం.. లేదంటే విష ప్రచారం చేయడం బాబుకు అలవాటే. 

ప్యారడైజ్‌ పత్రాలు, పనామా పేపర్లు అంటూ మొన్నటి వరకు హడావుడి చేసిన చంద్రబాబు మరో పెయిడ్‌ కథనంతో  విపక్ష నేతపై  విషం కక్కాడు.  శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారని తెలిసి, ముందు రోజు ఒక ఇంగ్లీషు పేపర్లో ఈడీ టాప్‌ టెన్‌ లిస్టంటూ, ఓ కథనం ప్రచురించారు. ఈ రోజు ఆ కథనం ఆధారంగా  పచ్చ పత్రికలు బ్యానర్‌ వార్తలు రాసేసాయి. దాన్ని పట్టుకుని ఏమీ తెలియని నంగనాచిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడంటూ బాబా రేంజ్‌లో సుద్ధులు చెబుతాడు. దాన్ని పట్టుకుని తెలుగు తమ్ముళ్లు అల్లుకుపోతారు. ఇదీ వరుస. ఎనిమిదేళ్లుగా చూస్తున్నదే. ఈరోజు వచ్చిన కథనానికి రేపు ఫాలో అప్‌ ఉండదు. అంతా వన్‌డే పబ్లిసిటీ. సరే ఈరోజు వచ్చిన కథనానికి ఏవైనా ఆధారాలున్నాయా అంటే.. సమస్య లేదు. వారి దగ్గర ఉండదు. మొన్ననే ప్యారడైజ్‌ పత్రాల పేరుతో ఫూల్స్ ప్యారడైజ్ నుంచి విషం చిమ్మారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు పాదయాత్రలో జనం మధ్యనుంచి సవాల్‌ విసిరారు. నాపై ఆరోపణలు నిరూపిస్తే.. విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టానని ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. దానికి పచ్చ పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నుంచి గానీ సమాధానం లేదు. పైగా బురదజల్లేసి... నిరూపించుకోవాల్సింది జగనే అని బుకాయింపు. ఇదీ చంద్రబాబు వ్యవహారం. 

నంద్యాల ఎన్నికల్లోనూ అంతే..

మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇలాంటి కుట్రే పన్నాడు.  బీజేపీతో కలిసి జట్టు కట్టబోతున్నాడని ఒక టీవీలో పెయిడ్‌ కథనాన్ని ప్రచారం చేయించాడు. దాన్ని ఆధారంగా  విష ప్రచారం మొదలెట్టాడు. ఇప్పుడూ అదే జరిగింది. పచ్చపత్రికల్లో ప్రచురితమైన బ్యానర్‌ కథనాలను కూలంకషంగా చదివితే.. ఇది ఎంత అసంబద్ధంగా ఉందో, ఎంతకామెడీగా ఉందో, జగన్‌ మీద బురదజల్లడమే లక్ష్యంగా దీన్ని ఎలా వండివార్చారో సామాన్యులకు సైతం ఇట్టే అర్థం అవుతుంది. అలాగే ఇప్పుడు ఈడీ జాబితా అంటూ ఓ కథనం . కానీ ఆ జాబితాను ఈడీ విడుదల చేసింది.. అని ధైర్యంగా చెప్పలేకపోయారు. ఎందుకంటే.. ఈడీ అధికారికంగా అలాంటిదేమీ చేయలేదు. వీళ్లే రాశారు.. అలాగనీ చెప్పుకోలేరు. అందుకని ఒక ఆంగ్ల పత్రికను ఉటంకించారు. ఆ ఆంగ్లపత్రిక పేరు కూడా రాయలేదు. రాస్తే దాని టాలెంట్‌ ఏమిటో వీళ్ల పాఠకులకు అర్థం అయిపోతుంది కదా! 

ఏం సాధించాలని ...

ఇలాంటి కథనాల వలన  బాబుకు కలిగే తక్షణ ప్రయోజనం ఏంటంటే.. జగన్‌ పాదయాత్రను అభాసుపాలు చేయడం. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాలనుకుంటున్న వారిని ఆపడమే. అధికార పార్టీ నుంచి ఒక్కరైనా ప్రతిపక్ష పార్టీలోకి చేరితే బాబు పరువు గంగలో కలిసిపోయినట్టే.న అదీ ఆయన భయం. పైగా పాదయాత్రలో చంద్రబాబు నాలుగేళ్ల పాలనను జగన్‌ తూర్పార పడుతున్నారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కిందీ.. ఎలా మోసాలు చేస్తున్నదీ వివరిస్తున్నారు. మహిళలు కూడా భారీగా తరలి వచ్చి చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. బాబు పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోంది.  కుటిల నీతితో దీనిని ఎదుర్కునే క్రమంలో భాగమే ఇలాంటి తప్పుడు కథనం. 

Back to Top