ఏ గూటి పక్షి ఆ గూటి పాటే పాడుతుందట. చంద్రబాబు కోటరీలోని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మరి బాబు లాంటి పాట కాక కొత్త పాట ఎలా పాడుతాడు. తమ అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి కుటిల రాజకీయాలు చేసాడో, కుంటుంబంలో ఎలా చిచ్చులు పెట్టాడో, అధికారం కోసం సొంత వాళ్లనే ఎలా వెన్నుపోటు పొడిచాడో తెలిసిన రాజేంద్రప్రసాదు ప్రతి కుటుంబాన్నీ అలాగే చూస్తున్నాడు. చంద్రబాబు వాళ్ల సొంత మామకే వెన్ను పోటు పొడిచి ఆయన చావుకు కారమైనట్టే ఇతర రాజకీయ కుటుంబీకులూ అదే పని చేస్తారని పాపం అపోహ పడుతున్నాడు. అందులో ఆయన తప్పేం లేదు. ఎలాంటి వాతవరణంలో ఉంటే అలాంటి బుద్ధులు పొడసూపుతాయి. పచ్చకామెర్ల కళ్లతో ఉంటే లోకమంతా పచ్చగా కనిపించడం మామూలే కదా!బాబు అలా ఉన్నాడని అందరూ అలాగే ఉంటారా???నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ కు కుడిభుజంగా ఉన్న పెద్దల్లుడు దగ్గుబాటిని దూరం చేసింది చంద్రబాబు. ఎన్టీఆర్ రెండో పెళ్లి వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకులకు తండ్రికి మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు. లక్ష్మీపార్వతి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ప్రచారం చేసి పార్టీలో విబేధాలు సృష్టించింది చంద్రబాబు. చైతన్యరథం నడిపి తండ్రికి సారధిగా ఉన్న కొడుకు చేతే అవిశ్వాసం పెట్టించి ఎన్టీఆర్ ను అవమానాల పాలు చేసింది చంద్రబాబు. పార్టీలో ముసలం పుట్టించి దొంగచాటుగా కుర్చీలాగేసి, ఎన్టీఆర్ ను మానసికంగా కృంగదీసి ఆయన మరణానికి కారణమయ్యింది చంద్రబాబు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నందమూరి కుటుంబాన్ని కన్నెత్తి చూడనిది చంద్రబాబు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాక మళ్లీ రాజకీయ అవసరం కోసం ఆ కుటుంబంతో సంబంధాలు పెట్టుకున్నది చంద్రబాబు. హరికృష్ణ పార్టీలో ఎదుగుతాడని భయపడి పొమ్మనకుండా పొగబెట్టింది చంద్రబాబు. ఎన్నికల ప్రచారానికి జూనియర్ ను వాడుకుని చివరకు అతడి సినిమాలు ఆడకుండా అడ్డుకుని ఏడిపించింది చంద్రబాబు. ఎక్కడ వారసత్వంతో బాలకృష్ణ ముందుకొస్తాడో అని వియ్యంకుణ్ణి చేసుకుని ఓ మూల కూర్చోబెట్టింది చంద్రబాబు. అధికారం కోసం కుటుంబాన్ని కాష్టంలో కాల్చే నీతిలేని చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడినించి వస్తాయి. అధికారం కోసం అమ్మ కొడుకును చంపేస్తుందనే అనుకుంటాడు. సిఎమ్ సీటు కోసం చెల్లి అన్నపై హత్యాప్రయత్నం చేస్తుందని నమ్ముతుంటాడు. కుటుంబం విలువలు ప్రేమలు త్యాగాలు అనే మాటలకు టిడిపి నీడలో బ్రతికే ఎవ్వరికీ అర్థం తెలిసే అవకాశమే లేదు. అధికారం కోసం ఎవ్వరినైనా ఏదైనా చేసేయాలనే కుటిల రాజకీయ నీతిమాత్రమే పాటించే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడి సిద్ధాంతాలు వారందరినీ అలా తయారు చేసాయి. వైఎస్ జగన్ పై ఆయన తల్లి, చెల్లి కలిసి కుట్ర చేసి హత్య చేయించడానికి ప్రయత్నించారని ఈ ఎమ్మెల్సీగారు దర్యాప్తు చేసి నివేదిక ఇస్తున్నారు. అసలు పోలీసులే ముట్టుకోకుండా ఎలాంటి విచారణా లేకుండా జగన్ అభిమానే జగన్ పై హత్యా యత్నం చేసాడని తేల్చి పడేసారు. ఇక ముఖ్యమంత్రి ఇతర మంత్రులూ కలిసి ఆ దాడిని జగనే చేయించుకున్నాడనీ నిర్థారించేసారు. ఇక ఎమ్మెల్సీల వంతు వచ్చింది. వీరి విచారణలో జగన్ కుటుంబ సభ్యులే ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నించినట్టు తెలియవచ్చింది. ఇదండీ ఎపిలో ఓ దారుణమైన నేరం జరిగితే విచారణ జరిగే తీరు. పోలీసులు, దర్యాప్తు సంస్థలకంటే ముందే ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడిపే పాలకుడు, ఆయన పార్టీకే చెందిన నాయకులు కలిసి ప్రతపక్ష నాయకుడు జగన్ పై జరిగిన దాడిని ఉన్నచోటు నుంచి కదలకుండా దర్యాప్తు చేసి ఇస్తున్న రిపోర్టు.