పేద ముఖ్య‌మంత్రి ఖ‌ర్చు రూ. 6 వేల కోట్లు


– పేద రాష్ట్రానికి దుబారా ముఖ్యమంత్రి
– నాలుగేళ్లలో రూ. లక్షా 20 వేల కోట్లు అప్పు
– ప్రజా సంక్షేమం మరిచి ఆడంబరాలు, విలాసాలు 


నాలుగేళ్లుగా పదే పదే మనది పేద రాష్ట్రమని చెప్పే చంద్రబాబు.. ఇప్పటికే ఆంధ్రాని అప్పులపాలు చేశాడు. 1956 నుంచి 2014 వరకు ఏపీకి చెందిన 13 జిల్లాల అప్పు రూ. 96 వేల కోట్లుంటే చంద్రబాబు పాలనలో అప్పు లక్షా 20 వేల కోట్లకు (నవంబర్‌ 2017నాటికి) చేరుకుంది. అంటే దాదాపు 125 శాతం అప్పులు పెరిగాయి. ఇదంతా కేవలం మూడున్నరేళ్లలో చేసిన అప్పులే కావడం విశేషం. అప్పులున్నప్పుడు ఎంత పొదుపుగా ఖర్చులు పెట్టుకోవాలి. ప్రతి పైసాను అపురూపంగా చూసుకోవాలి. కానీ  మన బాబు అలా చూస్తున్నారా? తన ఇంటి సొమ్మునైతే ఆయన ఇలాగే ఇష్టమొచ్చినట్టు దుబారా చేసేవారా? పత్రిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లెక్క ప్రకారం ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు అక్షరాలా ఆరువేల కోట్లు దుబారా చేశారా? ఏంటి ఈ లెక్క వింటుంటే కళ్లు బైర్లు కమ్మాయా? చంద్రబాబు లెక్కను లెక్క చేయక కుమ్మడిస్తుంటే... మనిషి స్పృహ తప్పి పడిపోక ఏమవుతాడు? రాష్ట్రాభివృద్ధికి మోడీ సర్కార్‌ ఏమీ ఇవ్వలేదని, రాజధానికి కేవలం రూ.1500 కోట్లే ఇచ్చిందని చంద్రబాబు విమర్శిస్తుంటారు. అయితే కేవలం చంద్రబాబు సొంత ఖర్చులే రూ. 6 వేల కోట్లకు చేరుకోవడం విశేషం. ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు రూ.8.76లక్షలు ఖర్చు చేసి దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. 18గంటల్లోనే ఆ మొత్తం ఖర్చు పెట్టడం చూసి దేశం యావత్తు నివ్వెరపోయింది. బెంగళూర్‌ మి్రరర్‌ పత్రిక దీనిపై ఆర్‌టీఐ చట్టం ద్వారా వివరాలు సేకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

బాబు దుబారా ఖర్చుల వివరాల పట్టిక ఇదే...
– ధర్మపోరాట దీక్షలకు జిల్లాకు రూ.4 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.52 కోట్లు
– ప్రత్యేక విమానాల ఖర్చు– రూ.100 కోట్లు
– లేక్యూ గెస్ట్‌హౌస్‌ కోసం– 9.50 కోట్లు
– పర్నిచర్‌ కోసం– 10 కోట్లు
– ఫాంహౌస్‌ కోసం– 4.50 కోట్లు
– హైదరాబాద్‌లో ఎల్‌ బ్లాక్‌ మరమ్మతులకు –రూ.14.30 కోట్లు
– హైదరాబాద్‌ సీఎం క్యాంపు  కార్యాలయ మరమ్మతులకు– రూ6.90 కోట్లు
– అమరావతిలో ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌ కోసం– రూ.42 కోట్లు
– ప్రత్యేక బస్సు కోసం– 5.50 కోట్లు
– రాజధాని శంకుస్థాపన కోసం ప్రధాని ఖర్చు –రూ.250 కోట్లు
– రాజధానికి మూడుసార్లు టెంకాయ కొట్టేందుకు రూ.100 కోట్లు
– హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణానికి– రూ.150 కోట్లు
– రాజధాని నిర్మాణంలో కన్సల్టెన్సీల కోసం– రూ.300 కోట్లు
– తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి రూ.1100 కోట్లు
– హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం ఉండేందుకు హయ్యత్‌ హోటల్‌ బాడుగ–రూ.30 కోట్లు
– కృష్ణా, గోదావరి పుష్కరాలకు రూ.3200 కోట్లు
– హ్యాపీ సండేస్‌ పేరుతో ఖర్చు– రూ.10 కోట్లు
– హ్యాపీ సిటీస్‌ ఖర్చు– రూ.61 కోట్లు
– జన్మభూమి నిర్వాహణ ఖర్చు– రూ.125 కోట్లు
– నవ నిర్మాణ దీక్షల ఖర్చు– 80 కోట్లు
– విదేశీ విమానాల ఖర్చు– 120 కోట్లు
– పోలవరానికి వెళ్లేందుకు బస్సు ఖర్చు–రూ.23 కోట్లు
– భాగస్వామ్య సదస్సుల ఖర్చు–రూ. 150 కోట్లు
– మొత్తం కలిపితే చంద్రబాబు దుబారా రూ.6 వేల కోట్లు 

తాజా ఫోటోలు

Back to Top