'చేతి'వాటం చంద్రబాబు

చంద్రబాబు
చిరాకు పీక్ స్టేజ్ లకు వెళ్లిపోతోంది.
వియ్యంకుడు బాలయ్య చెతే దురుసు రోగం అంటుకుందో, హస్తంతో కలిసాక చేయి వాటం పెరిగిందో తెలియదు కానీ తమ గోడు చెప్పుకోవాలని వచ్చిన
వారిపై చేయి చేసుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. తమకు న్యాయం
చేయాలంటూ ముఖ్యమంత్రిని కలిసిన అగ్రిగోల్డు బాధితుల పట్ల చంద్రబాబు అనుచితంగా ప్రవర్తించాడు.
కనీసం వారి బాధనైనా వినిపించుకోకుండా వారిపైనే ఎదురు విసుక్కున్నాడు.
ఓ బాధితుడిపై చేయికూడా చేసుకున్నాడు. సార్ ఇంకెన్నేళ్లు
ఎదురు చూడాలి అంటూ ప్రశ్నిస్తున్న బాధితుడి చెంప చెళ్లు మనిపించాడు. మా డబ్బులు మాకిప్పించండి అని బతిమాలితే ఎవడేం చేస్తాడు, కోర్టులు చూసుకుంటాయి అని దురహంకారంతో సమాధానమిచ్చాడు. అగ్రిగోల్డు బాధితులే కాదు, ఫాతిమా కాలేజీ విద్యార్థులు
న్యాయం చేయమని కోరినా, మత్స్యకారులు తమకిచ్చిన హామీల సంగతి అడిగినా,
క్షురకులు తమ సమస్యలు చెప్పుకున్నా చంద్రబాబు ఇలాగే విదిలించాడు.
బెదిరించాడు.  

నాలుగేళ్లకు
పైగా అగ్రిగోల్డు బాధితులు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎదురు చూస్తున్నారు. అగ్రిగోల్డు యజమానులను
అదుపులోకి తీసుకోవడం, బెయిల్ మీద వారిని విడిచిపెట్టడం కూడా జరిగిపోయింది
కానీ ఇంతవరకూ బాధితులకు వారి డిపాజిట్లు మాత్రం అందలేదు. కొన్నాళ్ల
కిందట అగ్రిగోల్డు ఆస్తుల వేలం జరగబోతోందని, డిపాజిటర్ల వివరాలను
రాష్ట్రవ్యాప్తంగా కమిటీలను వేసి మరీ సేకరించారు. కానీ ఇంతవరకూ
ఎలాంటి చర్యలూ జరగలేదు. ఇన్నేళ్ల తర్వాత అగ్రిగోల్డు ఆస్తుల విలువను
తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక ప్రభుత్వ
పెద్దల హస్తం ఉందని, చవగ్గా అగ్రిగోల్డు ఆస్తులను సొంత చేసుకునే
వ్యూహం నడుస్తోందని కొందరు రాజకీయవేత్తలే చెబుతున్నారు. చంద్రబాబు
కోటరీ వ్యక్తులే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని కూడా అంటున్నారు. అప్పులు ఉన్నాయని, ఆస్తుల విలువ తక్కువగా ఉందని చూపుతూ
కారు చౌకగా పచ్చనేతలు అగ్రి ఆస్తులను సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇదే జరిగితే బాధితులకు పరిహారం సంగం అందడం కూడా అనుమానమే. దీనిపై ఆగ్రహించిన బాధితులు అగ్రి గోల్డు కు చెందిన హాయ్ లాండ్ ను ముట్టడించారు.
వారిని బలవంతంగా ఆపి అరెస్టులు చేసిన చంద్రబాబు, ఇదేమని, మాకు న్యాయం ఏదని అడగవచ్చిన బాధితులతో అమానుషంగా
ప్రవర్తించాడు.

ప్రజల
కోసమే పని చేస్తున్నా అని కబుర్లు చెప్పే చంద్రబాబు బాధితుల పట్ల చూపించే కాఠిన్యం, కర్కశత్వం చూస్తే బాబు
మాటలన్నీ బూటకాలని, చంద్రబాబు అసలు స్వరూపం రాక్షసత్వం అని ఎవ్వరికైనా
అర్థం అవుతుంది. బాబు అధికారం, అహంకారం
అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయని అందుకే బాబు ఇలాంటి సంధి కాలపు ప్రవర్తన చేస్తున్నాడని
ప్రజలు భావిస్తున్నారు.

 

Back to Top