చంద్రబాబు గ్యాంగ్ కు వ‌స‌తులు, భ‌క్తులకు మాత్రం తిప్ప‌లు

రాజ‌మండ్రి : పుష్క‌రాల పేరు
చెప్పి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న
అరాచ‌కాలు అన్నీ ఇన్నీ
కావు. మీడియా ద్వారా పేరు కొట్టేసేందుకు ఏర్పాట్లు
చేసుకొన్నారు. ఇందుకోసం రాజ‌మండ్రిలోనే పూర్తిగా
మ‌కాం చేస్తాన‌ని
ఆర్భాటంగా ప్ర‌క‌టించుకొన్నారు.
అక్క‌డ నుంచే పాల‌న కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు.
దీంతో మంత్రులు, ఉన్న‌తాధికారులు, ఇత‌ర విభాగాల అధిప‌తులు అక్క‌డ‌కే క్యూ క‌ట్టారు.

ఇంత మంది ప్ర‌భుత్వ
పెద్ద‌లు క్యూ క‌ట్ట‌డంతో రాజ‌మండ్రిలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు
రూమ్ ల‌ను బ‌ల‌వంతంగా అధికారులు
లాక్కొన్నారు. దాదాపు 80-90 శాతం వ‌స‌తులన్నీ ఈ పెద్ద‌ల‌కే స‌రిపోతున్నాయి.
పైగా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌మార్కులు
కొట్టేసేందుకు తెలుగు త‌మ్ముళ్లు చేసే
హ‌డావుడి అంతా ఇంతా కాదు.
దీంతో ఈ చోటా మోటా
నేత‌లు మిగిలిన వ‌స‌తుల్ని ఆక్ర‌మించేస్తున్నారు.

మొత్తం
మీద పుష్క‌రాల కోసం
వ‌చ్చే యాత్రికుల‌కు
మాత్రం ఏ మాత్రం వ‌స‌తి దొర‌క‌టం లేదు.
ముఖ్యంగా మ‌హిళ‌లు,
పిల్ల‌లు, వృద్ధుల‌తో
క‌లిసి వ‌చ్చే
వారికి చాలా ఇబ్బంది అవుతోంది.
అధికార యంత్రాంగం వాహ‌నాల కోసం
ఎక్క‌డిక‌క్క‌డ
రోడ్లు వ‌దులుతున్న పోలీసులు,
ఇత‌ర భ‌క్తుల‌కు మాత్రం చాలా
దూరంగా నిలిపివేస్తున్నారు. దీంతో పుష్క‌ర
స్నానం అంటే యాత్రికుల‌కు
చుక్క‌లు క‌నిపిస్తున్నాయి,
చంద్ర‌బాబు ఇక్క‌డే
ఉంటున్నారు కాబ‌ట్టి పోలీసులు
మ‌రింత అత్యుత్సాహం చూపిస్తున్నారు.
దీంతో ఇబ్బందులు మ‌రి కాస్త
ఎక్కువ అవుతున్నాయి.

Back to Top