చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ది, జ్ఞానం ఉన్నాయంటారా..!

హైదరాబాద్) కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం
వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా మందికి ఇటువంటి అనుమానమే కలుగుతోంది. కాపుల తరపున
ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంతో వ్యవహరిస్తున్న తీరు, తర్వాత పరిణామాలు
చూస్తుంటే ప్రభుత్వం మీద ఉంటే అసహ్యం రెట్టింపవుతోంది.

ఒక్క కుటుంబం మీద వేలమంది దాడి

ముద్రగడ పద్మనాభం దీక్ష కు దిగింది ఎక్కడో
కాదు. ఆయన సొంత ఇంట్లో. అదీ చిన్న గ్రామంలో. ఆ రోజంతా ఆ గ్రామాన్ని పోలీసుల
దిగ్బంధనంలోకి తీసేసుకొన్నారు. ఆ గ్రామానికి రాకపోకలు బంద్ చేశారు. తర్వాత ముద్రగడ
ఇంట్లోకి పెద్ద ఎత్తున పోలీసుల్ని తరలించారు. ముద్రగడ ను ఈడ్చుకొంటూ పోలీసు వాహనం
ఎక్కించారు. “ఎస్సీగారూ
నా మాట వినండి “ అంటూ
ముద్రగడ ఎంత వేడుకొన్నా వినలేదు. ముద్రగడ కుమారుడ్ని అయితే కొట్టుకొంటూ పోలీసులు
తీసుకెళ్లిపోయారు. భార్యను, కోడల్ని అదుపులోకి తీసేసుకొన్నారు. ఒక్క మాటలో
చెప్పాలంటే మొత్తం కుటుంబం మీద మూకుమ్మడిగా దాడి చేసి చెల్లాచెదురు చేసేశారు.

ముద్రగడ దీక్ష భగ్నం చేసేందుకు చర్యలు

ఆసుపత్రిలో చికిత్స అందించటం వైద్యుల పని.
అయితే ఈ పనిలో వైద్యుల కన్నా పోలీసుల హడావుడి ఎక్కువై పోయింది. ముఖ్యంగా ముద్రగడ
దీక్ష భగ్నం చేశాం అనిపించేందుకు పోలీసు ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారు. ఈ
ద్రశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. ఒక సామాజిక అంశం కోసం, అందునా చంద్రబాబు
నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని అడిగినందుకు గాను అదేదో శాంతిభద్రతల
సమస్యగా మార్చేసి, ఇబ్బందులు పెడుతున్నారు.

ఆసుపత్రి దగ్గర హై డ్రామా

ప్రభుత్వాసుపత్రిని పూర్తిగా పోలీసుల అదుపులోకి
తీసేసుకొన్నారు. నిత్యం వేలమందికి ప్రాణదానం చేసే ఆసుపత్రిని పొలిసు
బలగాలతో కబ్జా చేయడం సామాన్యులకు పిల్లికి చెలగాటం
ఎలక్కి ప్రాణ సంకటం గా మారింది . కిలో మీటర్ల దూరంలో వాహనాలు పార్క్ చేయించడం
బారికేడ్లు ముళ్ళ కంపలు దాటుకుని వారివద్ద వున్న ఆధారాలు అన్ని చూపితే కాని
ఆసుపత్రిలోకి ఎంట్రి లేదు . ఇక రోగుల సహాయకులు పడే అగచాట్లు అన్ని ఇన్ని కావు .
ఇది గాక వై జంక్షన్ నుంచి లాలాచేర్వు వరకు తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలతో పది కిలోమీటర్ల
దూరం సామాన్యులు చుట్టూ తిరిగి వెళ్ళే దుస్థితి .  దీంతో
నగరంలో ఉన్నవారికే కాకుండా ఈ ప్రధాన రహదారి మీద దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన
వారందరికీ ఇబ్బంది

Back to Top