అడ్డంగా బుక్కౌతున్న చంద్ర‌బాబు


ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన స్టేమెంట్లు చేయ‌డంలో చంద్ర‌బాబుది క‌ప్ప‌గెంతుల వ్య‌వ‌హారం. నిమిషాల్లో మాట‌ను మార్చ‌గ‌ల‌రు. నిన్న అవున‌న్న‌ది నేడు కాద‌ని, నేడు నిజ‌మ‌న్న‌ది రేపు అబ‌ద్ధ‌మ‌ని చెప్పేయ‌గ‌ల‌రు. ఇలా చేస్తే ప్ర‌జ‌లు న‌వ్వుతారా, ఆగ్ర‌హిస్తారా, ప్ర‌శ్నిస్తారా ఇవ‌న్నీ ఆయ‌న‌కు అన‌వ‌స‌రం. ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి తన అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ఏం మాట్లాడినా చెల్లిపోతుంద‌నే భ్ర‌మ‌లో బ‌తికేస్తున్నారాయ‌న‌. 

ఇసుక అక్ర‌మ ర‌వాణా గురించి : 

 రాష్ట్రాన్నిత‌వ్వి పోసుకోమ‌ని అక్ర‌మార్కుల‌కు వ‌దిలేసారు చంద్ర‌బాబు. అందులో ఆయ‌న వాటాల సంగ‌తి ప‌క్క‌న పెడితే, చెరువులు, కుంట‌లు, న‌దీ తీరాలు, చివ‌ర‌కి న‌దుల్లోకి చొచ్చుకుపోయి మ‌రీ మ‌ట్టిని తోడుకుపోతున్నారు. ఉచితంగా ప్ర‌జ‌ల‌కు ఇసుక అంద‌క పోగా మునుప‌టి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పెట్టినా దొర‌క‌ని దౌర్భాగ్యం దాపురించింది. ఈ ఇసుక దందా చేస్తున్న‌వారంతా టిడిపి అస్మ‌దీయులు, చంద్ర‌బాబు అనుయాయులే. స్వ‌యంగా ఎమ్మెల్యేలు, మంత్రులే ఈ వ్య‌వహారంలో నేరుగా జోక్యం చేసుకుంటున్నా ఇదేంట‌ని అడిగే దిక్కు లేకుండా ఉంది. ప్ర‌జ‌లు మొత్తుకుంటున్నా, ప్ర‌తి ప‌క్షాలు, ప‌త్రిక‌లు విమ‌ర్శిస్తున్నా కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ప‌బ్లిక్ గా ఎవ‌రైనా ఇసుక అక్ర‌మ ర‌వాణా గురించి ప్ర‌శ్నిస్తే వారిపై విరుచుకుప‌డిపోయారు చంద్ర‌బాబు. బాబు నివాసానికి చేరువ‌లోనే ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పినా, అక్ర‌మంగా రాష్ట్రాలు దాటిపోతోంద‌ని అన్నా అబ్బే అస‌ల‌లాంటి పాడు ప‌నులు నా రాష్ట్రంలో జ‌ర‌గ‌వు అన్నారు బాబు. ఒక‌వేళ అలా జ‌రిగితే వారిపై  పిడి చ‌ట్టం ప్ర‌యోగిస్తామ‌ని, సొంత పార్టీ వారినైనా ఉపేక్షించ‌న‌ని పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చారు. అయినా స‌రే ఆయ‌న ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వ అధికారుల‌ను సైతం బెదిరిస్తూ త‌మ వ్యాపారాల‌ను య‌ధేచ్ఛ‌గా కొన‌సాగిస్తున్నారు. నిన్న‌టికి నిన్న మంత్రి ఆదినారాయ‌ణ అనుచ‌రులు సైతం ఇసుక లారీలు ఎక్క‌డికి వెళుతున్నాయో చెప్పమ‌ని అడిగిన విఆర్వోను బెదిరించిన ఘ‌ట‌న వెలుగు చూసింది. అస‌లు ఇసుక అక్ర‌మంగా త‌రలిపోవ‌డానికి కార‌ణం ర‌వాణా శాఖ నిర్ల‌క్ష్య‌మే న‌ని, వారు స‌క్ర‌మంగా ఉంటే ఇసుక మాఫియా త‌యార‌య్యేది కాద‌ని బాబు ఇప్పుడు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే నిన్న‌టిదాకా చెప్పిన శ్రీ‌రంగ నీతుల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాల‌న్న‌మాట‌. ఇసుక మాఫియా నిజం, దాని వెన‌క ఉన్న‌వాళ్లంతా బాబుగారి ప‌చ్చ‌చొక్క గుండీలన్న‌దీ నిజం. ఇప్ప‌టిదాకా అలాంటిదేం లేద‌ని ఇప్పుడు ఇసుక మాఫియా అరిక‌ట్ట లేక‌పోతున్నారని ర‌వాణా శాఖను వేలెత్తి చూపుతున్నారంటే చంద్ర‌బాబు రాష్ట్రంలో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు, త‌ర‌లింపులు జ‌రుగుతున్నాయ‌ని ఒప్పుకున్న‌ట్టే క‌దా...???

బెల్టు షాపుల అడ్ర‌స్ చెప్ప‌మ‌న్న చిన‌బాబు :

ఎంతోమంది మ‌హిళ‌ల ఉసురు పోసుకుంటున్న మ‌ద్యం మ‌హ‌మ్మారిని పెంచి పోషిస్తోంది చంద్ర‌బాబు స‌ర్కార్. ఇళ్ల‌మ‌ద్య పెరుగుతున్న మ‌ద్యం దుకాణాలు, ఇంటికే స‌ర‌ఫ‌రా అవుతున్న లిక్క‌ర్ కుటుంబాల‌ను నాశ‌నం చేస్తున్నాయి. ఊళ్ల‌లో బెల్టు షాపుల జోరు ఎక్కువౌతోంద‌ని వాటిని నివారించ‌డానికి ఏం చర్య‌లు తీసుకుంటార‌ని గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి లోకేష్ ను ప్ర‌శ్నిస్తే ఆయ‌న తండ్రి త‌ర‌హాలోనే విలేఖ‌రులపై సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్క‌డా బెల్టు షాపులే లేవ‌ని, ఉంటే మీరే చూపించాల‌ని కోరారు. ర‌హ‌స్యంగా ఇన్వెస్టిగేట్ చేసి ప్ర‌భుత్వానికి వివ‌రాలు అందిస్తే, నిజాల‌ను తేల్చి బెల్టు షాపుల‌ను మూయించాల్సింది పోయి, ప్రూఫ్ లు ప‌ చిన‌ట్రా అన్నారు చిన‌బాబు గారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి గారు బెల్టు షాపుల‌ను తొల‌గిస్తామ‌ని, అందుకోసం మొబైల్ రైడింగ్ పార్టీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని శెల‌విస్తున్నారు. మ‌రి లేని బెల్టు షాపుల‌ను ఈ మొబైల్ రైడింగ్ పార్టీలు ఎలా కంట్రోల్ చేస్తాయో తండ్రీ కొడుకులే చెప్పాలి. 
Back to Top