తుపాన్ బాధితులకు మొండిచేయి


విశాఖపట్నం) హుద్ హుద్ తుపాన్ విలయ తాండవం చేసినప్పుడు, దెబ్బతిన్న చోట పూర్తిగా పునర్ నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ఊదర గొట్టారు. పడిపోయిన ప్రతీ ఇంటిని తిరిగి నిర్మిస్తామంటూ ప్రతీ మీటింగ్ లోనూ నమ్మ బలికారు. ప్రభుత్వమే దీనికి చొరవ తీసుకొంటుందని చెప్పుకొచ్చారు. ఈలోగా పునర్ నిర్మాణం కోసం విరాళాలుకావాలని వినతి చేశారు. దీంతో పెద్ద ఎత్తున జనం హుద్ హుద్ తుపాన్ సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వందల కోట్ల రూపాయిలు పోగుపడినా పునర్ నిర్మాణ పనుల విషయంలో మాత్రం గోప్యత పాటిస్తూ వచ్చారు.
ప్రభుత్వం మాటలు నమ్మిన బాధితులు ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకొన్నారు. అన్ని వివరాలు సమర్పించారు. రేపో మాపో ఇళ్లు పునర్నిర్మించుకోవటానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని ఆశగా ఎదురు చూశారు. తీరా చూస్తే తుపాన్ లో ఒక లక్షా 34వేల ఇళ్లు కూలిపోతే, కేవలం 10వేల ఇళ్లు కట్టుకొనేందుకు మాత్రమే ప్రభుత్వం నిధుల్ని విడుదల చేసింది. మిగిలిన లక్షా 24 వేల కుటుంబాలకు మొండి చేయి చూపించారు. సేవలన్నీ ఆన్ లైన్ లో అంటూ మాయచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 90 శాతం మందిని రోడ్డున వదిలేయటం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని అంతా అంటున్నారు. 
Back to Top