జగన్ ను మళ్లీ సీఎం చేయకపోతే మనల్ని దేవుడు కూడా క్షమించడు

దమ్ముంటే అభివృద్ధి, సంక్షేమంపై టీడీపీ చర్చకు రావాలి - స్పీకర్ తమ్మినేని సవాల్

జగన్ పాలనలో ఫలానా అవినీతి జరిగిందని చంద్రబాబే ఆరోపించలేకపోయారు

కేంద్రం 23 సంస్థలు రాష్ట్రానికి ఇస్తే శ్రీకాకుళానికి ఒక్కటి కూడా బాబు ఇవ్వలేదు - మంత్రి ధర్మాన

చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించారు... అందుకే గుణపాఠం చెప్పారు

ఉద్దానం కిడ్నీ సమస్యకు అందరూ వచ్చి చూసినా జగన్ మాత్రమే పరిష్కారం చూపారు - మంత్రి సీదిరి

పలాస సామాజిక సాధికార యాత్రలో కదం తొక్కిిన ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలు.

 జై జగన్ ..జై జై జగన్......నినాదాల హోరు మధ్య  ఉద్యమాల పురిటగడ్డ శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జనహోరుతో ప్రతిధ్వనించింది. పలాసలో అడుగడున బస్సుయాత్రకు అపూర్వ స్వాగతాల మధ్య అప్రతిహాతంగా సాగింది. పలాస- కాశీబుగ్గ జంక్షన్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, బాబూ జగజ్జీవన్ రామ్, స్వర్గీయ వైఎస్సార్ విగ్రహాలకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు,  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశు సంవర్థక  శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణ దాస్,  మాజీ ఎంపీ కిల్లి కృపారాణి పూల మాలలు వేసి నివాళులు  అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు హాజరైన  అశేషజనవాహినిని ఉద్దెశించి ప్రసంగించారు. 

 

 

జగన్ ను మళ్లీ సీఎం చేయకపోతే మనల్ని దేవుడు కూడా క్షమించడు

దమ్ముంటే అభివృద్ధి, సంక్షేమంపై టీడీపీ చర్చకు రావాలి - స్పీకర్ తమ్మినేని

 

స్పీకర్ తమ్మినేని సీతారామ్  మాట్లాడుతూ,  ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో అవినీతిలేని పాలన, పేదరికం లేని కుటుంబాలను తీసుకువస్తానని సీఎం జగన్ ప్రకటించారని గుర్తు చేసారు. నాలుగున్నరేళ్లకాలంలో ప్రజల మధ్య ఇచ్చిన మాటకు, మేనిఫెస్టోలో చేసిన ప్రకటనలకు , ప్రమాణ స్వీకారం చేసిన రోజున చెప్పిన మాటలకు కట్టుబడి సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని, ఎంతో దూరదృష్టితో జగన్ పాలన సాగిస్తూ తరతరాల పేదరికాన్ని పారద్రోలడానికి కృషి చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో పేదలు సాయం కోసం చేయి చాపకుండా తలెత్తి ధైర్యంగా బ్రతకగలిగే ఆత్మస్దైర్యాన్ని జగన్ కల్పిస్తున్నారన్నారు. విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ కు ధీటుగా జగన్ తీర్చిదిద్దుతున్నారని,  విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్య శ్రీలతో ప్రతీ కుటుంబంలో  వెలుగులు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు మామలు ఉన్నారని. ఒకరు చందమామ,  మరొకరు జగన్ మామ అని స్కూలు విద్యార్థులు గొప్పగా అభివర్ణించుకుంటున్నారని గుర్తు చేసారు. ప్రతీ కుటుంబంలో సంస్కారవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఇచ్చేది చదువు మాత్రమేనని జగన్ భావిస్తుంటారని వివరించారు. పేదవాడు విజయపతాకం ఎగురవేయాలన్నదే జగన్ సంకల్పమని ఉద్ఘాటించారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేయకుండా జగన్ ను మళ్లీ సీఎం చేయాలని తమ్మినేని సీతారామ్ పిలుపునిచ్చారు. జగన్ ను మళ్లీ సీఎం చేసుకోకపోతే దేవుడు కూడా  క్షమించడు అన్న విషయాన్ని గుర్తించాలని, పెత్తందారి వర్గాలకు ధీటుగా సామాజిక సాదికారతను సీఎం జగన్ తీసుకువెళ్తున్నారన్నారు.  జిల్లా అబివృద్ధిపైనా, సంక్షేమంపైన తెలుగు దేశం పార్టీ నేతలు దమ్ముంటే చర్చకు రావాలని సీతారామ్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వైయస్సార్ సిపి శ్రేణులు సమరోత్సాహంతో ముందడుగు వేస్తున్నాయంటే జగన్ చేసిన సంక్షేమ పథకాల అమలే కారణమన్నారు. పలాస నియోజకవర్గ గెలుపును జగన్ కు బహుమతిగా మనం ప్రదానం చేయాల్సిన బాధ్యత ఉందని సీతారామ్ పిలుపునిచ్చారు.

 

 

జగన్ పాలనలో ఫలానా అవినీతి జరిగిందని చంద్రబాబే ఆరోపించలేకపోయారు

 

కేంద్రం 23 సంస్థలు రాష్ట్రానికి ఇస్తే శ్రీకాకుళానికి ఒక్కటి కూడా బాబు ఇవ్వలేదు - మంత్రి ధర్మాన

 

రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఐదున్నర సంవత్సరాల క్రితం మీ ముందుకు వచ్చి టీడీపీ దోపిడీని, అక్రమాలను వివరించామన్నారు. నాలుగున్నరేళ్లలో మా ప్రభుత్వం చేసిన ముఖ్యమైన అభివృద్ధి అంశాలను జ్జాపకం చేయడానికి ముందుకు వచ్చామన్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చేదని, అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా  పరిపాలన సాగుతోందని గుర్తు చేసారు. కిడ్నీ రోగులు ఉన్నారంటే వచ్చి చూసి వెళ్లే వారని, సమస్య పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. కానీ వైయస్సార్ సిపి మాత్రం సమస్యను గుర్తిస్తే వెంటనే పరిష్కారం చూపించింది. కిడ్నీ రోగులకు కారణమైన నీరు కలుషితమైన కారణంగా స్వచ్ఛమైన నీరును అందించే ప్రాజెక్టును సీఎం జగన్ చేపట్టారని, 23న పలాస ప్రాంతానికి వచ్చి  పునాది రాయి వేసిన ఆసుపత్రిని ప్రారంభించడానికి వస్తున్నారని ప్రకటించారు.  పథకాల అమలుకు రెండు లక్షల ముఫ్పై వేల కోట్ల రూపాయలను  ప్రజలకు అందించడానికి మధ్యవర్తులు కానీ ఎవరూ లేరని స్పష్టం చేసారు. ప్రతిపక్షం కూడా అవినీతి చేసారని దైర్యం చేసి చెప్పలేని స్థితిలో పాలన సాగుతోందని ఉద్ఘాటించారు.  నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఆరోపణ చేయలేకపోయారంటే పాలన ఎంత పారదర్శకంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పరిపాలనలో  చాలా మార్పులను జగన్ తీసుకువచ్చారని వివరించారు. రాజమండ్రి సభలో చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బు సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని చెప్పాడంటే, ఆయన లోతుగా ప్రజల కోసం ఏనాడూ ఆలోచన చేయలేదనడానికి నిదర్శనమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవిధంగా చంద్రబాబు ఏ రోజునా ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ఓట్ల కోసమో, ప్రజల కోసమో కాదు పేద ప్రజల జీవితాలను మార్చడానికే సీఎం జగన్ పలు విప్లవాత్మక  నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారన్నారు. జగన్ పాలనలో  లెఫ్ట్ పార్టీలు పోరాటాలు కూడా లేవంటే ఏ స్థాయిలో సంక్షేమ పాలన సాగుతుందో చెప్పవచ్చునని వివరించారు.  దేశంలోనే ఇదో చారిత్రాత్మక పాలనగా అభివర్ణించారు. ఎక్కడో 25 అంతస్తుల బిల్డింగ్ కట్టి అది చూసుకుంటూ ప్రజలంతా సుఖంగా బ్రతకాలంటే ఎలాగో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు. 23 సంస్థలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో కేటాయిస్తే చంద్రబాబు వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటి కూడా పెట్టలేదంటే  ఆయన కుటిల ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు ఒక్క ప్రాజెక్టునైనా చంద్రబాబు తీసుకువచ్చానని చెప్పుకోగలడా అని ప్రశ్నించారు, శ్రీకాకుళం టీడీపీ నేతలు ఎవరైనా  చెప్పగలరా అని ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. పేదల పట్ల ఆలోచన కలిగిన స్థిరమైన ప్రభుత్వం జగన్ తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగుుతాయని వివరించారు, 

 

చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించారు... అందుకే గుణపాఠం చెప్పారు

 

 ఉద్దానం కిడ్నీ సమస్యకు అందరూ వచ్చి చూసినా జగన్ మాత్రమే పరిష్కారం చూపారు - మంత్రి సీదిరి

 

       పంశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ,    రాష్ట్రం అవతరించి 65 సంవత్సరాలుగా , స్వాతంత్రం వచ్చి 75  ఏళ్లు గడుస్తున్నా అనేక వెనుకబడి వర్గాలు సాామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని, అన్ని వర్గాలకు రాజకీయ, సామాజీక, ఆర్థిక సాధికారత కావాలని సీఎం జగన్ సంకల్పించారన్నారు.  జగన్ సీఎం అయ్యాక ఏ కుటంబమైనా సరే పిల్లల చదవుల కోసం ఒక్క రూాపాయైనా సరే అప్పులు చేసారా అని  ప్రశ్నించారు. తల్లితండ్రులపై పిల్లల చదవుల భారం పడకుండా  అమ్మఒడితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీషు మీడియం  బోధన చేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు  జగన్ తీసుకువచ్చారు చంద్రబాబు ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా చేసినా సరే పాఠశాలల్లో కనీస వసతులు కల్పిచాలన్న ఆలోచన ఏనాడూ చేయలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లంటే చంద్రబాబుకు చాలా చులకన అని, వివిధ సందర్భాల్లో ఆయా వర్గాలను అవమానించారన్నారు. మత్స్యకారులను ఓ సందర్భంలో అవమానిస్తే చంద్రబాబుకు తమ దెబ్బ అంటే ఏంటో మత్స్యకారులు ఇచ్చాపురం నుంచి గుంటూరు వరకు చూపించి 23 స్థానాలకు పరిమితం చేసారని గుర్తు చేసారు.  తమ సామాజిక వర్గం మాత్రమే ఎదగాలనుకునే చంద్రబాబుకు మరో  అవకాశం ఇస్తామా అని ప్రశ్నించారు.  ముస్లీం, మైనార్టీలను కేబినెట్ లోకీ తీసుకోకుండా  చంద్రబాబు అవమానించాడని మండిపడ్డారు.    రూ. 700 కోట్ల రూపాయల వ్యయంతో కిడ్నీ వ్యాధులతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని బాధితుల కోసం 200 పడకల ఆసుపత్రి జగన్  కట్టిస్తున్నారన్నారన్నారు. ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించేందుకు జగన్ సంకల్పించారని కొనియాడారు. తెలుగుదేశంపార్టీ నాయకులు పేస్ ప్యాక్ లు వేసుకోవడం కాదు జిల్లాకు ఏం చేసారో చెప్పే దమ్ము ఉందా అని సవాల్ చేసారు. 30 వేల ఎకరాలల ఆయకట్టుకు సాగు నీరు అందక  రైతులు ఆందోళతో ఉన్నారని అన్నారు  రైతులకు పంట ఇన్సురెన్స్ ఇస్తామనీ హామీ ఇచ్చారని గుర్తు చేసారు.

Back to Top