బినామీ సుజనా కోటలో ఈడీ పాగాఅవినీతి కూసాలు కదులుతున్నాయి. అక్రమార్కుల ఆర్థీక మూలాలు కూలుతున్నాయ్. ఎంపీ సుజనాచౌదరి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరిపింది. లుక్ అవుట్ నోటీసులూ జారీ చేసింది. టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుజనా చౌదరి కీలక అనుచరుడు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరిపై బాంకులను మోసం చేసిన కేలుసు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేత చేసాడన్ని ఆరోపణలు, పెద్ద ఎత్తున కేసులు నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచీ సుజనా చౌదరి కంపెనీల్లో ఈడీ విస్తృతంగా సోదాలు జరిపి, ఎన్నో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సుజనా ఇల్లు ఆఫీసులే కాదు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసింది ఈడీ. 
అరాచక వ్యవహారాలు
చంద్రబాబు అక్రమ సంపాదనలు, సింగపూరు సంబంధాలు, వివిధ కంపెనీలకు నిధుల మళ్లింపులు, విదేశీ టూర్లు, స్వదేశీ కాంట్రాక్టర్లతో సంబంధాలు లాంటి అన్ని ఆర్థిక వ్యవహారల్లో సుజనా పాత్ర కీలకం. సిఎం.రమేష్, నారాయణ వంటి మరికొందరు ముఖ్య నేతలూ ఉన్నా సుజనా చౌదరి లెవెల్ ఆఫ్ వ్యవహారాలే వేరు అని చెప్పుకుంటారు. తెలంగాణాలో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థులకు, కూటమికి కూడా ఫండింగ్ చేస్తూ అక్రమార్జన విస్తృత రూపాన్ని కళ్లుముందుంచుతున్నాడు. ఎపిలో సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణాలో ఎన్నికలకు ఉపయోగించడం చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే ఇలాంటి ఆర్థిక లావాదేవీలు, వాటి వెనకున్న చీకటి రాజులను బయటకు ఈడ్చే ఈడీ ప్రయత్నాన్ని తెలుగు ప్రజలు స్వాగతిస్తున్నారు. 
అక్రమార్కులకు అడ్డుకట్ట
గత కొద్ది నెలలుగా టిడిపికి చెందిన నాయకులపై సిబిఐ ఐటి ఈడీ దాడులను రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు అంటూ చంద్రబాబు చేయాలనుకున్న అసత్య, అబద్ధ ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వంపై ఏ ఒక్కరూ ఒక్క సానుభూతి మాటైనా మాట్లాడలేదు. దేశవ్యాప్తంగా తెలుదేశం నేతల అవినీతి చరిత్రలు చర్చలకు వచ్చాయి. దీంతో వ్యవస్థల మేనేజ్మెంట్ లో సిద్ధహస్తుడైన చంద్రబాబు కూడా భయపడ్డమాట వాస్తవం. అందుకే ఆ భయంతోనే సిబిఐ కు కళ్లెం వేయాలని, రాష్ట్రంలోకి అడుగుపెట్ట కూడదని ఉత్తర్వులు ఇచ్చి తన అవినీతి భూకంపాన్ని బైటపెట్టుకున్నాడు చంద్రబాబు. సిబిఐ కి అనుమతి లేకపోతే ఈడీ లేదా అంటూ ఆ వ్యవస్థ రంగంలోకి దిగింది. ఇది చంద్రబాబు ఘోర పరాజయం. ప్రజాస్వామ్య విజయం. అధికారం, చట్టంలో లొసుగులు, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడటం, న్యాయస్థానలనుండి తప్పించుకోవడం వంటి హేయమైన చర్యలకు త్వరలో అడ్డుకట్ట పడబోయే సూచనలు కనిపిస్తున్నాయి. 

 
Back to Top