బాబుగారికో ఇల్లు కావాలి.. క‌ట్ట‌డానికో వాస్తు శిల్పి రావాలి

బాబుగారికో ఇల్లు కావాలి.. క‌ట్ట‌డానికో వాస్తు శిల్పి రావాలి

అదేంటి ప‌దేళ్లు హ‌క్కు ఉన్నా, హైద‌రాబాద్‌ను వ‌దిలేసి అమ‌రావ‌తంటూ వెళ్లారు.  ఇప్పుడు అక్క‌డి నుంచి మ‌రెక్క‌డికైనా వెళ్తాన్నారా అనే డౌట్ వ‌స్తోందా? అలా ఏమీలేదు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో బాబు సొంతిల్లు, బాడుగ ఇల్లు, ఓ ఫాంహౌస్ ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు పార్క్ హ‌యాత్ హోట‌ల్లోనూ ఓ ఫ్యామిలీ సూటు ఉన్నాయి. 
మ‌రిక్క‌డ అమ‌రావ‌తినైతే లింగ‌మ‌నేని గారి హౌసుంది. అందులో బాబున్నారు. అది చాల‌ద‌న్న‌ట్లు మ‌రో రెంటెండ్ బంగ్లా ఉంది. అమ్మో.. ఇన్ని నివాసాలా?  బోలెడు ఖ‌ర్చ‌నుకోకండి. అధికార ప‌క్ష‌మాయ అందులో అధినేత ఆయె. అంతా ప్ర‌భుత్వం ఖ‌ర్చే అన‌గా ప్ర‌జ‌ల‌మీద భార‌మే. స‌రే ప్ర‌జానాయ‌కుల‌కు ప్ర‌జలామాత్రం ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే ఎలా? ఇదంతా స‌రే బాబుగారికి.. అఫిషియ‌ల్‌గా ఓ ముఖ్య‌మంత్రి బంగ్లా కావాలిప్పుడు. ఇదైనా ప‌ర్మ‌నెంటా?  తాత్కాలిక‌మా? అని అడ‌గ్గూడ‌దు. స‌రే క‌ట్టేస్తున్నారా? అలా ఎలా.. ఓ వాస్తు శిల్పి కావాలంటూ సీఆర్‌డీఏ టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది . ఆర్కిటెక్ట్ సేవ‌ల‌కు బిల్లెంతో చెప్పాల‌న్న‌మాట‌. 
కొత్త రాజ‌ధానిలో కొత్త సీఎం రెసిడెన్సీ లేటుగా, లేటెస్టుగా బాబుగారికొచ్చిన ఆలోచ‌న‌న్న‌మాట‌. ఏది ఏమైనా ఇంత‌గా ప్ర‌జా సొమ్ము ఖ‌ర్చు పెట్టుకుంటూ, ప్లాన్లు ప్ర‌ణాళిక‌లంటూ వ‌ట్టి మాట‌ల‌తో ముందుకు పోతుంటే.. అస‌లు పాల‌నెప్పుడు?  సామాన్యుడి సంక్షేమం ఆలోచ‌న‌లెప్పుడు చేస్తారు బాబు?! కొత్తింటి వాస్త‌యినా కుదిరి బాబు కుదురుగా ఆలోచిస్తారా? ఈ లోప‌ల పుణ్య‌కాలం గ‌డిచిపోతుందా? అన్న‌ట్లు ఇప్ప‌టిదాకా సీఎంగారి నివాస స‌ముదాయాలెన్నో మీరే లెక్కేసుకోండి. అక్క‌డ అధికార లాంఛ‌నాలు, కాప‌లాల ఖ‌ర్చెంతో మీరే లెక్కేసుకోండి. లిస్టోసారి చూడండి. ప్ర‌జా సొమ్ము దుర్వినియోగం అంటూ ప్ర‌శ్నించాల‌నుకుంటే మీ ఇష్టం. 
1) హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం సొంతిల్లు
2) అదే జూబ్లీహిల్స్‌లో సీఎం రెంటెండ్ హౌస్‌
3) శేరిలింగంప‌ల్లిలో బాబు ఫాం హౌస్‌
4) విజ‌య‌వాడ‌లో ఓ గెస్ట్‌హౌస్‌
5) గుంటూరులో లింగ‌మ‌నేని రెసిడెన్స్‌
6) పార్క్ హ‌యాత్‌లో ఓ ఫ్యామిలీ సూట్‌
7) అమ‌రావ‌తిలో ముఖ్య‌మంత్రి బంగ్లా

కొస‌మెరుపు:- రాజ‌ధాని డిజైన్ల‌కు బాహుబ‌లి రాజ‌మౌళిని పిలిచారు. మ‌రి ఈ సీఎం కొత్త రెసిడెన్సీ కోస‌మంటూ వ‌దిలిన ఈ టెండ‌ర్‌కు ఏ `మ‌య‌స‌భ‌` డైరెక్ట‌ర్ను  పిలుస్తారో?
Back to Top