ఆర్థిక ఉగ్రవాదులు టీడీపీ పెద్ద మనుషులే

– బ్యాంకులకు టోకరాలో మొనగాళ్లు తెలుగు తమ్ముళ్లు 
– అయినా సుజనా చౌదరిని కేంద్రంలో మంత్రిగా కొనసాగించారు
– సీఎం రమేశ్‌పై అనుకూల మీడియాలోనే కథనాలు
– పార్టీ నుంచి సస్పెండ్‌ చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు 
– వాకాటి నారాయణరెడ్డి, దీపక్‌రెడ్డిల నేర చరిత్ర తెలుగు ప్రజలకు తెలుసు
– నోట్ల రద్దు జరిగితే శేఖర్‌రెడ్డికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. 

చంద్రబాబు నాయుడు అన్నంత పని చేస్తున్నాడు. దేశాన్ని కాపాడటానికే కాంగ్రెస్‌తో  కలుస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి ‘ఆ’ పనిలోనే ఉన్నాడు. అయితే దేశం అంటే ఇక్కడ భారతదేశం కాదు... తెలుగుదేశం అని చంద్రబాబు మాటల్లో అర్థం.. మొన్ననే దేశ పరిరక్షణ కోసమని దేశమంతా తిరిగి ఖాళీగా ఉన్నోళ్లందరి కాళ్లు మొక్కి వచ్చిన చంద్రబాబు.. చివరిగా ఢిల్లీలో ప్రెస్‌ మీట్‌ పెట్టి దేశం కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసినట్టుగా కలరింగ్‌ ఇచ్చేసి వచ్చాడు. మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం పోరాడే యోధుడిలా.. దేశం కోసం దశాబ్దాల జైలు జీవితం గడిపిన స్వాతంత్య్ర సమరయోధుడిలా కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్‌ మీడియా ముందు ప్రశ్నించేశాడు. నాలుగేళ్లు అంటకాగిన బీజేపీని ఏకి పారేశాడు. ముందూ వెనకా చూసుకోకుండా నోట్ల రద్దు గురించి కూడా మోడీని ప్రశ్నించేశాడు. అయితే నోట్ల రద్దు కోసం తానే లేఖ రాశానని చెప్పిందీ.. నోట్ల రద్దు చేసిన రోజున నేనే ఐడియా ఇచ్చానని చెప్పిన విషయం మర్చిపోయాడో.. లేదా నేషనల్‌ మీడియాకి ఏం తెలుసులే అనుకున్నాడో తెలియదు. చంద్రబాబు డిజిటల్‌ లావాదీవీల కమిటీకి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నాడు. అందుకేనేమో జర్నలిస్టులు ప్రశ్నలడుగుతారని ప్రెస్‌ మీట్‌ ముగియగానే లేచి వెళ్లిపోయాడు. ఇదంతా చూసిన జనం ‘నిప్పంటించినోడే నీతులు చెప్పినట్టు’ ఫీలయ్యారు. 

అదే ప్రెస్‌ మీట్‌లో చంద్రబాబు మరిన్ని కీలక ఆరోపణలు చేశాడు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందని గగ్గోలు పెట్టాడు. నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా, వంటి ఆర్థిక ఉగ్రవాదులను మోడీ దేశం దాటించారని అంతెత్తున్న విరుచుకుపడ్డాడు. అయితే చంద్రబాబు మాత్రం గిరిగింజలాగా తన పాలన సంగతి మరిచి మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ ఎంపీలుగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలపై నమోదైన కేసులను మరిచిపోయినట్టున్నాడు. టీడీపీ అనుకూల మీడియాలోనే ఆ ఇద్దరు ఎంపీలపై పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురితం అయ్యాయి. పొలవరం వంటి సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకుని భారీగా లూఠీ చేస్తున్నాడని సీఎం రమేశ్‌పై ఆయా మీడియా ఛానెళ్లు వారాల తరబడి కథనాలు వెలురవరించినా బాబులో చలనం లేదు. బ్యాంకులను మోసం చేశాడన్న ఆరోపణలున్న సుజనా చౌదరిని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ప్రయత్నించలేదు. బీజేపీతో కొనసాగినంత కాలం ఆయన మోడీ కేబినెట్‌లో మంత్రిగానే వ్యవహరించారు. ఇదే చంద్రబాబు టీడీపీ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. ఎన్నో బ్యాంకులను ముంచేసి అడ్డదారిన నిధులు తెచ్చుకున్న విషయాన్ని బాహాటంగానే పత్రికలు అచ్చు వేశాయి. ఆంధ్రాలో చూస్తే దీపక్‌రెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలు బ్యాంకులను ముంచేసినవారే. ఇంతమంది ఆర్థిక ఉగ్రవాదులను చుట్టూ ఉంచుకున్న చంద్రబాబును చూస్తే నిప్పటించినోడే నీతులు చెప్పినట్టుగా ఉంది..
Back to Top