నీరుగారిన సుజల స్రవంతి!

పతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఆచరణలో నీరుగారుతూ నిట్టూర్చుతోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 569 ప్లాంట్లు ఏర్పాటవగా అందులో 100 మాత్రమే అరకొరగా ఉపయోగపడుతున్నాయి. ఆర్భాటంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా దాతలకే వదిలేసింది. దానివల్ల మంచినీటి అవసరం అంతగా లేని గ్రామాల్లో ఈ పథకం కింద ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. వ్యాపారం సరిగా సాగక కొన్నాళ్లకే కొన్ని ప్లాంట్లు మూతపడుతున్నాయి. దీంతో మంచినీటు అవసరం ఉన్న అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతగా ఆసక్తి చూపించడం లేదనే విమర్శలున్నాయి. రాష్ర్టంలో మొత్తం 13,083 గ్రామాలుండగా అందులో 495 గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం గణాంకాలే చెబుతున్నాయి. ఈ గ్రామాల్లో ఏ ఒక్కచోటా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు కాలేదు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 5,200 చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కేవలం 569 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అవసరం లేకపోయినా దాతలు ముందుకొచ్చిన ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వాటి నిర్వహణ బాధ్యతలను స్థానికులకే అప్పగించారు. నీటి అమ్మకాల ద్వారా వచ్చే రాబడితో నిర్వహించుకోవాలని సూచించారు. రోజుకు కనీసం 200 నీటి క్యాన్లు అమ్మకాలు జరిపితేనే ప్లాంట్ నిర్వహణ గిట్టుబాటు అవుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిలో కేవలం 82 ప్లాంట్లలో మాత్రమే 200 క్యాన్ల నీరు విక్రయమవుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తప్ప ఎక్కడా ప్లాంట్లు గిట్టుబాటు కావడం లేదని అధికారులు గుర్తించారు. 

ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లు- నీటిక్యాన్ల అమ్లకాలు
జిల్లా                    ప్లాంట్లు    
క్యాన్ల

అమ్మకాలు 
శ్రీకాకుళం             13      120
విజయనగరం          10     55
విశాఖపట్నం          19      90
తూర్పుగోదావరి       13      385
పశ్చిమగోదావరి       15      295
కృష్ణా                      28      121
గుంటూరు             27      131
ప్రకాశం                41      200
నెల్లూరు               14      195
చిత్తూరు               16      342
వైఎస్సార్              58      111
కర్నూలు              21      166
అనంతపురం          37      125

తాజా వీడియోలు

Back to Top