అడుగుకో గాథ... కన్నీటి వ్యధ!



- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో సమ‌స్య‌ల వెల్లువ‌
- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు గోడు వెళ్ల‌బోసుకున్న రాష్ట్ర ప్ర‌జ‌లు
-  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు  ఏడాది
అమ‌రావ‌తి:  ఆ ఒక్క అడుగు ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపుతోంది. ఆయన చెప్పే మాట వేల కుటుంబాల్లో సంతోషం పంచుతోంది. ఒక్క భరో సా వేల మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది. అందుకే  ప్రజా సంకల్ప యాత్ర అడుగడుగునా జనసంద్రాన్ని తలపిస్తోంది. అడుగుకో గాథ... కన్నీటి వ్యధ... వినిపిస్తోంది. ‘అన్నా మీరు రావా లి... రాజన్న రాజ్యం తేవాలి’ ఇదీ దగా పడిన జ నం నుంచి వస్తున్న మాట. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభించిన  ప్రజా సంకల్పయాత్ర ఏడాదికి చేరుకుంది. వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో అడుగు పెట్టునప్పటి నుంచి వేలాది సమస్యలు వినిపించారు. ఎన్నో వేదనలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పాలకుల దుర్నీతివల్ల నష్టపోయిన వైనాన్ని ఏకరువు పెడుతున్నారు. అన్నీ వింటూ ప్రజా సంక్షేమమే తమ అభిమతమని స్పష్టం చేస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, రేష‌న్‌కార్డులు ఇవ్వ‌డం లేద‌ని, ఫీజు రీయింబ‌ర్స్ అంద‌డం లేద‌ని, వైద్యం క‌రువైంద‌ని, పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని ఇలా ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు జ‌న‌నేత‌కు చెప్పుకుంటున్నారు. సామాన్య ప్ర‌జ‌లే కాదు...కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు సైతం ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ప్రతిప‌క్ష నేత‌కు వివ‌రిస్తున్నారు.  రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.

మ‌రో చ‌రిత్ర‌
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో చరిత్రను అధిగమించింది. వైయ‌స్ఆర్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయలో ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర కొత్త చరిత్రను రాస్తూ.. పలు మైలు రాళ్లను దాటిం ది. 11 జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి కాగా, ప్ర‌స్తుతం 12వ జిల్లా విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే 3211 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు.  

జనాదరణే ఆయుధంగా...
ప్రజాదరణే ఆయుధంగా వైయ‌స్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో కొనసాగుతోంది.  భారీగా తరలివస్తున్న‌ విద్యార్థులు, మహిళలు, వృద్ధులను అప్యాయంగా పలకరిస్తున్నారు.  జననేతను కలిసిన ప‌లువురు దంపతులు తమ బిడ్డ‌ల‌ను ఆశీర్వదించి పేరు పెట్టాలని కోరుతున్నారు.  గ్రామ గ్రామాన జ‌న‌నేత‌కు ఎదురెళ్లి మ‌రి స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు. దారిపొడవునా తివాచీ లు పరిచి పూల వర్షం కురిపిస్తున్నారు. మ‌హిళ‌లు బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్నారు. యువ‌తి, యువ‌కులు, విద్యార్థులు అభిమాన నేత‌తో  సెల్పీలు దిగుతున్నారు. వృద్ధులు ఆశీర్వదిస్తున్నారు. 

గ‌త నెల 25న ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నవైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరి గిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన ఆయన ఈ నెల 10వ తేదీ నుంచి పునఃప్రారంభించేందుకు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు వెళ్ల‌నున్నారు. 
Back to Top