మూడు తిట్లు.. ఆరు కట్‌లు

* వైయస్‌ జగన్‌ ప్రసంగానికి అడుగ‌డునా అడ్డంకులు
*  ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం
* ప్రశ్నలడిగితే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న మంత్రులు

రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్లకు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొత్త అసెంబ్లీలో ప్రారంభమాయ్యాయి. తాత్కాలిక అసెంబ్లీ ప్రారంభోత్సవం నుంచే టీడీపీ షరా మామూలుగానే ప్రతిపక్షంపై విషం వెళ్లగక్కింది. తాత్కాలిక అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా రచ్చకు దారితీసింది. ప్రొటోకాల్‌ పాటించకుండా.. తెలుగు వారి ఆత్మగౌవరం అని చెప్పుకుంటూనే కనీస ఆనవాయితీ పాటించలేదు. ప్రతిపక్షానికి కనీసం ఆహ్వానం పంపించకుండానే నలుగురు భజన బృందాలను పక్కనేసుకుని చంద్రబాబు హడావుడి రిబ్బన్‌ కటింగ్‌ చేసొచ్చాడు. ప్రతిపక్షాలను ఎందుకు పిలవలేదని ఆరోపణలు రావడంతో జనం ఏమనుకుంటారోనని కూడా లేకుండా మెసేజ్‌లు పంపించాం అని సిగ్గులేకుండా సమాధానమిచ్చారు తెలుగు బాస్‌లు. తీరా ఆరా తీస్తే వైయస్‌ఆర్‌సీపీకి ఎలాంటి సమాచారం అందలేదు. 

గవర్నర్‌ చేత అబద్ధాలు చెప్పించారు
ఎలాగైతేనేం.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజు గవర్నర్‌ టీడీపీ మేనిఫెస్టో చదివేసి వెళ్లిపోయారు. దానికి టీడీపీ దొరలు ఆహా.. ఓహో అని సంబర పడిపోయారు. ఆయనేమైనా కొత్తగా చెప్పారా అంటే..ప్చ్‌.. ఏమీ లేదు. ఎప్పుడూ చంద్రబాబు చెప్పే సోదే. కాకపోతే ఈసారి గవర్నర్‌ వచ్చీరాని తెలుగులో మొదలు పెట్టి ఇంగ్లిషు పాఠం చదివేసి వెళ్లిపోయారు. మూడేళ్లలో ఎక్కడా చూడని అభివృద్ధి చేశానని మొదలుపెట్టి చంద్రబాబు లేకుంటే రాష్ట్రం ఏమైపోయేదో అన్నంతగా దాదాపు ముప్పావు గంట ప్రసంగం చదివేసి వెళ్లిపోయారు. ఇదేమైనా గవర్నర్‌ రాసుకొచ్చిన ప్రసంగమైతే ఆలోచించాలి కానీ.. బాబు రాసిచ్చింది కాబట్టి అంతకన్నా గొప్పగా ఉంటుందని ఆశించలేం. పట్టిసీమను రికార్డు కాలంలో పూర్తి చేశాం.., పోలవరంకు జాతీయ హోదా కల్పించాం, విద్యుత్‌లో రాష్ట్రానికి మిగులు చూపించాం.. ముచ్చుమ్రరి, పైడిపాడు ప్రాజెక్టులను పూర్తిచేశానని పచ్చి అబద్ధాలు గవర్నర్‌తో చెప్పించి జనానికి చేస్తున్న మోసం ఆయనకీ ఇంత వాటా ఇచ్చాడు. అలా గవర్నర్‌ ప్రసంగం పూర్తయి తొలిరోజు ముగిసింది. 

ప్రతిపక్ష నేతకు అడుగడుగునా అడ్డంకులే
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు పూర్తయ్యాయి. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌కు మాట్లాడే అవకాశం లభించింది. షరా మామూలుగానే ప్రతిపక్ష నేత అభివృద్ధిపై మీరు చెప్పే లెక్కలన్నీ వాస్తవ దూరంగా ఉన్నాయి. జీఎస్‌డీపీ పెరిగితే ఆదాయం పెరగాలి కదా.. అని అడిగారు... అంతే మైక్‌ కట్‌. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించామని చెబుతున్నారు. మరి మీ ప్రభుత్వమే కదా 280 కరవు మండలాలను ప్రకటించింది అనడిగారు.. అంతే.., మళ్లీ మైక్‌ కట్‌. అయ్యా.., రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఎక్కువ శాతం ఐటీ ఇండస్ట్రీ నుంచే వస్తుంది. తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్, కర్నాటకకు బెంగళూర్‌.. ఉన్నట్టే మనకు ఐటీ డెస్టినేషన్‌ ఉండాలి కదా అని అడిగారు. అంతే పల్లె రఘునాథరెడ్డి లేచారు. నీకేం తెలుసు. నీ మీద కేసులున్నాయి. నీవు అవినీతి పరుడివి అని అంతెత్తున ఎగిరిపడ్డాడు. అంతే అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. ప్రపంచంలో ఏ ఆర్థిక నిపుణులను అడిగినా జీడీపీ పెరిగితే ఆదాయం పెరుగుతుందనే చెబుతారు.. ఏ పుస్తకం చూసినా అదే ఉంటుంది. ఇదిగో నా దగ్గర గత 20 సంవత్సరాల లెక్కలున్నాయి. మీ ప్రభుత్వంలో మినహాయించి ఏటా జీడీపీ, ఆదాయం అనులోమానుపాతంలోనే ఉన్నాయి. ఇదెక్కడి చోద్యం అని ప్రశ్నించారు. వెటకారపు రామకృష్ణుడు లేచాడు. కళ్లద్దాలు పెట్టుకుని.., పొట్ట మీద రెండు చేతులు అద్దుకుని అసలు నీకేం తెలుసు అని అదే పాత మాట. జైలుకెళ్లే వారికేం తెలుసు. మీరంతా దొంగలు. అవినీతి పరులు అని ప్రస్తావించాడు. అంతేకానీ ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు. ఇదీ ఆయన జ్ఞానం. చివరికి వైయస్‌ జగన్‌ అడిగిన ప్రశ్నకలు సమాధానాలు చెప్పకుండానే సభ 13వ తేదీకి వాయిదా పడిపోయింది. ఒక్కరోజు జరిగిన సమావేశాలే మూడు తిట్లు.. ఆరు కట్‌లు.. అన్నట్టు సాగిపోయింది. ఈసారి సభను సజావుగా సాగేలా ప్రతిపక్షాన్ని నిలువరిస్తామంటే ఏదో అనుకున్నాం. మళ్లీ అదే విధంగా మైక్‌లు కట్‌ చేస్తారని అనుకోలా. అయితే అసెంబ్లీకి సంబంధించి ఇక్కడో కొత్త విషయం ఏంటంటే. మైకులు లేకుండా మాట్లాడటం. మైక్‌ కట్‌ చేశారో.. ఆన్‌ చేశారో తెలియకుండా చేశారు. ఇది కూడా వైయస్‌ జగన్‌ను దృష్టిలో పెట్టుకునే చేసినట్టున్నారు. 
Back to Top