మనమందరం మన సీఎం గారి బాటలో కలిసి ప్రయాణిద్దాం

 ప్రణవి, 5 వ తరగతి విద్యార్ధిని, ఎంపీపీ స్కూల్, మొగలికుదురు 

తూర్పు గోదావ‌రి : మల్లె వంటి మనసుతో ఇక్కడికి విచ్చేసిన మన జగన్‌ మామయ్యకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్నగారు హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రతీ రోజూ మా నాన్నగారితోనే నేను పాఠశాలకు వెళుతున్నాను. మన చదువుల కోసం మన జగన్‌ మామయ్య చేసిన సేవలను మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి ఏడాదికి రూ. 15 వేలు అమ్మ ఒడి ద్వారా అందిస్తున్నారు. గతంలో నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అమ్మ రోజూ లంచ్‌ బాక్స్‌ పెట్టేది కానీ ఇప్పుడు మాత్రం రోజూ జగన్‌ మామయ్య సీఎం అయిన తర్వాత మా అందరికీ రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజుకొక వైరైటీ ఫుడ్‌ ఇస్తున్నారు, సోమవారం కోడిగుడ్డు కూర, మంగళవారం పులిహోర, పప్పు, టమాట కూర, బుధవారం వెజిటెబుల్‌ ఫ్రైడ్‌ రైస్, గురువారం కిచిడీ, శుక్రువారం పప్పు, ఆకుకూర, శనివారం సాంబార్, చక్కెర పొంగలి, వీటితో పాటు వారానికి 5 కోడిగుడ్లు, చిక్కీలు తింటున్నాం. మాకు ఇలాంటి రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు జగన్‌ మామయ్యకు చాలా చాలా ధ్యాంక్స్‌. గతంలో బాత్‌రూమ్‌కు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు రన్నింగ్‌ వాటర్‌తో పరిశుభ్రంగా ఉన్నాయి. నేను పెద్దయ్యాక మ్యాథ్స్ టీచర్‌ అవ్వాలనుకుంటున్నాను. వన్‌ చైల్డ్, వన్‌ టీచర్, వన్‌ బుక్, వన్‌ పెన్‌ కెన్‌ చేంజ్‌ ద వరల్డ్‌ అని నమ్మిన మన సీఎం మామయ్య మన కలలను నెరవేరుస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది. పేదల కోసం, విద్యార్ధుల కోసం, మనందరి కోసం మన సీఎం మామయ్య చేస్తున్న అభివృద్ది పనులు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి నా వయసు చాలదు. రాష్ట్ర అభివృద్దిలో మనమందరం మన సీఎంగారి బాటలో కలిసి ప్రయాణిద్దాం. అందరికీ ధన్యవాదాలు

ధ్యాంక్యూ జగన్‌ మామయ్యా...:  కే. సాయి శరణ్య, 10 వ తరగతి, జెడ్పీపీ హైస్కూల్, పి.గన్నవరం 

నేను ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. నా తండ్రి టైలర్, మా అమ్మ గృహిణి. నేను 8 వ తరగతి నుంచి ఈ స్కూల్‌లో చదువుతున్నాను. మీరు విద్యారంగం అభివృద్దికి చేస్తున్న కృషికి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్‌ మామయ్య మీరు విద్యారంగంలో మాకోసం చేస్తున్న అభివృద్ది కారణంగా నూతన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, అనేక అవకాశాలు కూడా వస్తున్నాయి. మాలాంటి పేద విద్యార్ధులు మీ వల్ల ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. మా జీవితంలో మేం సాధించలేని గోల్స్‌ను కూడా మీ కారణంగా సాధించగలుగుతున్నాం. ప్రతీ విద్యార్ధి కూడా నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారు. జగనన్న విద్యా కానుక కిట్‌ చాలా బావుంది. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి అనేక పథకాలు గతంలో ఎన్నడూ చూడలేదు. బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్లు విద్య ఒక్కటే పేదరికాన్ని దూరం చేసి, సామాజిక గౌరవాన్ని పెంచుతుందన్న మాటను మీరు నిజం చేస్తున్నారు. జగన్‌ మామ విలువైన సమయాన్ని విద్యారంగం అభివృద్దికి వెచ్చిస్తున్నారు. మన బడి నాడు నేడు పథకం విద్యార్ధులకు కోహినూర్‌ వజ్రం లాంటింది. ఇందులో సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలన్నీ మారిపోయాయి. జగన్‌ మామా మాకు మంచి బలవర్ధకమైన భోజనం ఇస్తున్నారు, అంతేకాదు మా కుటుంబం కూడా చాలా లబ్దిపొందుతుంది. మా నాన్నకు వికలాంగుల ఫించన్‌ వస్తుంది, మా అమ్మకు అమ్మ ఒడి రెండు సార్లు వచ్చింది, దీంతో మేం నా ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం మొబైల్‌ ఫోన్‌ కూడా తీసుకున్నాం. జగన్‌ మామ కూడా తన తండ్రిగారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారిలా ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోతారు, ధ్యాంక్యూ జగన్‌ మామయ్యా...

విద్యా రంగంలో దేశంలోనే ఏపీ అగ్ర‌గామి: ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి 

ఏపీని విద్యారంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపి, అక్షర సేద్యం చేస్తూ నాడు నేడు పేరుతో చేపట్టిన ఈ మహాయజ్ఞంలో తొలిఘట్టం పూర్తిచేసుకుని  రెండో విడత ప్రారంభించేందుకు ముందడుగు వేస్తున్న థీరుడు శ్రీ వైఎస్‌ జగన్‌. విద్య ఆవశ్యకత, విద్య ద్వారా ఏ విధంగా సమాజాభివృద్ది జరుగుతుందో మహనీయులు చెప్పారు. బీఆర్‌ అంబేద్కర్, నెల్సన్‌ మండేలా, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వంటి మహనీయులు విద్య ఆవశ్యకతను చెప్పారు. వీరి బాటలో వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకుని ముందుకు సాగుతున్న వారు శ్రీ వైఎస్‌ జగన్‌. జగనన్న చెప్పారంటే చెస్తాడంతే అన్న నమ్మకం ప్రజలకు వచ్చింది. గత పాలకులు ప్రైవేట్‌ విద్యను ప్రోత్సహించిన సమయంలో మన జగనన్న మాత్రం పాఠశాలల రూపురేఖలు మార్చుతానని ఇచ్చిన మాట మేరకు నాడు నేడు ద్వారా స్కూళ్ళ స్ధితిగతులు మార్చిన ధీరుడు. ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాయి, మీరు చేసిన అభివృద్దిని చూడండి. రాష్ట్రంలో ఉన్న ఏ స్కూల్‌ అయినా చూడండి. కరోనా కష్టాలు ఉన్నా కూడా మొదటి విడత పూర్తిచేసి రెండో విడత పనులకు శ్రీకారం చుడుతున్నారు. మా జన్మ ఉన్నంతవరకూ మేం జననన్న వెంటే ఉంటాం. ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఒక తమ్ముడిగా, అన్నగా, పిల్లల బాగోగులు చూసే మేనమామగా వారి బాగోగులు చూస్తున్నారు. సీఎంగారు స్వయంగా పర్యవేక్షించి నాడు నేడు రూపకల్పన చేశారు. దళితులు, అణగారిన వర్గాలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. పిల్లలంతా జగనన్నా మా మేనమామ నువ్వే అంటూ సంతోషంగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. విద్యారంగానికి మీరు చేస్తున్న కృషిని ఎన్నటికీ మరువలేం, ధన్యవాదాలు...
 

Back to Top