బుధవారం బంద్‌కు వైయస్ఆర్‌సీపీ పిలుపు

న్యూఢిల్లీ, 18 ఫిబ్రవరి 2014:

రాష్ట్ర విభజనపై అధికార కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో అనుసరించిన వైఖరి రాజ్యాంగ విరుద్ధమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్‌లో కూడా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుందని తాను వినలేదన్నారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం అనుసరించిన దుర్మార్గమైన వైఖరికి నిరసనగా బుధవారం బంద్‌ పాటించాలని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు. ఈ రోజును ఆయన బ్లాక్‌ డే అని అభివర్ణించారు.

బంద్‌ సందర్భంగా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడికక్కడ నిరసనను, ఆగ్రహాన్నివ్యక్తం చేయాలని శ్రీ జగన్‌ సూచించారు. రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు వంటి విధానాల్లో తమ నిరసనను బంద్‌ సందర్భంగా వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీలను క్షమించే ప్రసక్తే లేదని శ్రీ జగన్‌ హెచ్చరించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించాలని, రేపటి బంద్‌కు ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించాలని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

Back to Top