వైయస్‌ఆర్‌సీపీ సీఈసీలో కొత్త సభ్యులు వీరే

హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి‌ (సీఈసీ) సభ్యులుగా మరో ఐదుగురు కొత్త వారిని పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త సభ్యులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటలో తెలిపింది.

ఇటీవలే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణా‌ జిల్లాకు చెందిన ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యేలు నల్లగొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావుతో పాటు మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె పి.విజయారెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.మంగమ్మ‌ను పార్టీ సిఈసీ సభ్యులుగా నియమించినట్లు ఆ ప్రకటనలో వివరించింది.

Back to Top