వాళ్లకు పెళ్లీ, ఢిల్లీలపైనే శ్రద్ధ!

హైదరాబాద్ 6 నవంబర్ 2012 : తుఫాను బాధిత ప్రాంతాలలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలనీ, ప్రకృతి వైపరీత్యాల నిధి నుండి నిధులు వచ్చేలా ప్రభుత్వం పూనుకోవాలనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇంత ప్రాణనష్టానికీ, పంట నష్టానికీ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడమేనని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైపల్యమనీ, తుఫాను ప్రభావాన్ని సరిగా అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందనీ వైయస్ఆర్ సీపీ శాసనసభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పంట నష్టం జరిగినవారికి వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నీలం తుఫాను ముప్పు తప్పినట్లేనని మంత్రి రఘువీరారెడ్డి ఎలా చెప్పారో వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. ఇప్పటికే అప్పులతో, కరువులతో తల్లడి రైతులకు నీలం తుఫాను పెనునష్టాన్ని మిగిల్చించిందన్నారు.
కేంద్రానికి విజ్ఞప్తి చేద్దామంటున్నారనీ, జాతీయ విపత్తుగా గుర్తిస్తేనే కేంద్రం నిధులు ఇస్తుందనీ, అయితే ఆ లోపు అందాల్సిన తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నాయకులకు పెళ్లి పై ఉన్న శ్రద్ధ, ఢిల్లీ ర్యాలీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై లేకపోవడం దారుణమని, దీనిని తాము నిరసిస్తున్నామనీ ఆయన అన్నారు. జల్ తుఫానుకు సంబంధించిన సహాయం కూడా ఇంతదాకా రైతులకు అందకపోవడం విచారకరమని ఆయన ఆక్షేపించారు.
బాబు రాజకీయం!
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రతి దాన్నీ రాజకీయం చేసినట్లే వరదలనూ రాజకీయం చేస్తున్నారని, తనకు ఓటు వేయాలన్నట్లుగా మాట్లాడుతున్నారనీ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తన హయాంలో చంద్రబాబు రైతాంగాన్ని గురించి ఏనాడూ శ్రద్ధ చూపలేదన్నారు. రుణాల మాఫీ అలా ఉంచి కనీసం వాటిని రీ షెడ్యూలు కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు. బాబు పాలనలో ప్రజలు వలసలు పోయిన సంగతి ఆయన గుర్తు చేశారు. 
Back to Top