స్పీకర్‌: నల్లా సూర్యప్రకాష్ - మే 21, 2012

బీసీలంటే బ్రీఫ్‌కేసులని, ఎస్‌సీలు అంటే సూట్‌కేసులని వ్యాక్యానించిన లగడపాటి ఒక బపూన్‌గా, ఒక జోకర్‌గా, ఒక బ్రోకర్‌గా మాట్లాడుతున్నాట్టుగా కనబడుతుంది. ఆయన చరిత్ర ఆయనకు తెలియనటువంటి పరిస్దితి, చంద్రబాబు నాయడు ఎలాగైతే మామకు వెన్నుపోటు పోడిచి అధికారలంలో కి వచ్చాడో అలాగే లగడపాటి తన మామ అయిన ఉపేంద్రకు వెన్నుపోటు పొడిచి  పైకొచ్చి నటువంటి వ్యక్తి లగడపాటి రాజగోపాల్‌.

 అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రధానంగా బీసీలపై  ఎస్‌సీలపై ఇటువంటి వ్యాక్యలు చేసినందుకు బీసీలకు, ఎస్‌సీలకు క్షమాపణ చెప్పాలి.లగడపాటి బీసీల గురించి ఎస్‌టీల గురించి వ్యంగంగా మాట్లాడడం దురదృష్టకరం.ఆయన పార్లమెంట్‌ సభ్యుడు కాక ముందు అతని స్ధాయి గుర్తుంచుకోవాలి.
  ఒకచిన్న కాంట్రక్టర్‌ జీవితం ప్రారంబించిన వ్యక్తి ఈరోజు వేల కోట్లుకి ఎలా వచ్చాయి. ఆయన అవినీతి గా సంపాదించి పక్క వారికి నీతులు చెబుతున్నాడు. విజయవాడలో లగడపాటి గురించి చిన్న పిల్లవాడిని అడిగినా అతని నీచ చరిత్రను చెబుతారు. దమ్ము దైర్యం 
ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్‌ గుర్తుపై గెలువు అప్పు తెలుస్తుంది వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ సత్తా ఎమిటో తెలుస్తుంది. రాజశేఖరరెడ్డిగారి అడుగులకు, మడుగులు వత్తి ఇప్పుడు రాజశేఖరరెడ్డిగారిని ఆయన కొడుకు జగన్‌మోహన్‌రెడ్డిని తిడుతున్నారు. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఉంది.
  రాజస్ధాన్‌లో ఏడు సోలార్‌ ప్రాజెక్ట్‌లు ఏర్పాటుచేస్తామని చెప్పి ప్రభుత్వాన్నిన మోసంచేస్తే దాని మీద విచారణ జరుగుతుంది. ఇండియా టుడే లో ఆయన అక్రమాలగురించి పెద్ద ఎత్తునా వార్తలు వచ్చాయి.
హైదారాబాద్‌ లో ల్యాంకోహిల్స్‌ వక్స్‌ భూములు స్యాదీనం చేసుకున్నారని కోర్టులో కేసు నడుస్తుంది, ఇటువంటి వాళ్ళు నీతులు చెబుతున్నారు. 
 త్యరలో జరిగే 18 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ కూడ దక్కదు. దీపం ఆరిపోయే ముందు వెలుగు వెలిగినట్టుగా ఉంది కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి. జగన్‌మోహన్‌రెడ్డి ని ప్రజలు అదరిస్తున్నంత వరకు ఈ కాంగ్రెస్‌ పార్టీ అవాకులు చెవాకులు పేలినా వచ్చే నష్టమేమిలేదు.

బీసీలపై, ఎస్‌సీలపై మీరుచేసిన కామెంట్లు పై క్షమాపణ చెప్పకపోతే చెప్పు దెబ్బలు తింటావు అని హెచ్చరిస్తున్నాం.

తాజా వీడియోలు

Back to Top