జగన్ మోహన్ రెడ్డి గారిని,రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టడానికి కాంగ్రెస్ రోజుకొక కులాన్ని ప్రేరేపిస్తున్నారు మొన్న మాలలు నిన్న రెడ్లు ఈ రోజు రేణుకా చౌదరి ........జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళతాడని మీడియాలో చెప్తూ కాంగ్రెస్ పార్టీలో జోకర్లగా తిరుగుతూ జోష్యం చెపుకుంటున్న రేణుకా చౌదరి ఎదుటివారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. దశాబ్దాలుగా డిల్లీలో ఉంటూ నువ్వు చేస్తున్న పని ఏంటి ? నీ బిడ్డల పరిస్తితి ఏంటి ? ఎవరు ఇస్తే నీకు రాజ్యసభ టికెట్ వచ్చింది ?వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి. ముందు నీకు ఎంపి సీటు ఎలా వచ్చిందో ...... నువ్వు నీ కుటుంబ సబ్యులు డిల్లీలో ఏం చేస్తున్నారు. నీ భాగోతం డిల్లీలో ఏ జర్నలిస్ట్ ను అడిగిన చెబుతారు ..... నీ నియోజక వర్గంలో అబివృద్ది గురించి గాని, నీ గురించి గాని ఎవర్ని అడిగిన చెబుతారు. నీకు దమ్ముంటే,దైర్యం ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే కన్నా నెల్లూర్ వెళ్ళి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడా కాదా అనేది నీకే తెలుస్తుంది. అక్కడ పోటీచేసి గెలిస్తే అప్పుడు అర్దం అవుతుంది. జనంలో ఎవరు ఉన్నారో లేదో ...... 18 ఎన్నికలలో ఎక్కడైనా గెలిచి మా గురించి మాట్లాడితే బాగుంటుంది. మందకృష్ణ మాదిగ లాంటి నాయకుల వల్లనే రాష్ట్రం వల్లకాడు అయింది. జేడి శీలం గాని హర్షకుమార్ గాని మందకృష్ణ మాదిగ గాని ముందు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఈ రెండు సంవత్సరాలు ఎక్కడున్నారు? వల్లకాడుగా మారిన రాష్ట్రాన్ని సువర్ణయుగంగా మార్చిన వ్యక్తి రాజశేకర్ రెడ్డి గారు. ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్రెడ్డి గారు అదికారంలోకి వస్తే రాష్ట్రం వల్లకాడు అవుతుందని చెప్పండి, ప్రజలు రాళ్ళతోని చెప్పులతోని కొడతారు ....... రాజశేఖర్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది .......కాంగ్రెస్ వాళ్ళు వస్తే మేము రుజువులు ఇస్తాం. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక మాకు అనుమానాలున్నాయి. సోనియా గాంధీని ఓ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వెయ్యమనండి ఎందుకు తప్పించుకుంటున్నారు........ వ్యక్తిగతంగా వస్తే మేము చాలా విషయాలు తీసుకోస్తాం ....... రేణుకా చౌదరి జీవితాన్ని సిడిలో పెట్టి మరి ప్రకటిస్తాం.