స్పీకర్‌: శ్రీమతి వాసిరెడ్డిపద్మ: జూన్ 25, 2012

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రైతు సమస్యల మీద ధర్నాలు జరిగాయి. ఈ రోజు ప్రతిపక్ష నాయకులు రైతు సమస్యల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. రైతులు పంటలవేసుకోడానికి విత్తనాలు దొరక్క పండిన పంట మోలకెత్తక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండేళ్ళుగా విత్తనాల కోసం రైతులు రోడ్డుక్కెతున్నారు.ఒక్క సంవత్సరంలోనే 12 సార్లు ఈ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది. ఒక ఎడాదికి వెయ్యికోట్లు భారం రైతుల మీద పడింది. ఇన్ని రైతు సమస్యలు ఇక్కడ పెట్టుకుని తన ఉనికిని చాటుకోవడానికి విజయవాడలో రోడ్డు సమస్య మీద ధర్నాలు చేస్తున్నారు, చంద్రబాబు, లగడపాటి ధర్నాలు డ్రామ కంపెనీలను తలపించేవిగా ఉన్నాయి. ఎవరి కోసం ఈ పోలిటికల్‌ డ్రామాలు అని అడుగుతున్నాం. ఎన్నాళ్ళు ప్రజలను మోసంచేస్తారు.  

ఈ కాంగ్రెస్‌  ప్రభుత్వం గతంలో 876  కరువు మండలాలుగా ప్రకటించిన ఇంత వరకు కరువు సాయం ఇప్పటికి కూడ అందలేదు దాని మీద ప్రతిపక్షం పోరాటంచేయదు.ప్రభుత్వాన్ని నిలదీయరు. ప్రతి రైతుసమస్యమీద పోరాడింది, దీక్షలు చేసింది, అన్ని ప్రాంతాల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని ప్రధానమంత్రికి లేఖ రాసింది ఒక్క జగన్‌మోహన్‌ రెడ్డి గారు మాత్రమే.

 జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రభుత్వానికి రైతుల విషయం మీద సూచించారు మద్దతు ధర ఇవ్వలేని పరిస్ధితుల్లో 3వేల కోట్లతోటి ధరలశ్రీకరణ అనే నిధిని ఎర్పాటు చేయాలి మద్దతు ధరలు తగ్గుతు పెరుగుతు ఉన్నప్పుడు ఆఫండ్‌తో ఆదుకోవాలి అని సూచించిన ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ప్రధానంగా వ్యవసాయశాఖ మంత్రి బీటి పత్తివిత్తనాల కోసం జరుగుతున్న ఒక డిమాండ్‌ గురించి మాట్లాడితే వారు బీటి విత్తనాల గురించి కాదు మహికో విత్తనాల మాయలో ఉన్నారు అని రైతులని అవమానపరిచేవిదంగా మాట్లాడారు. రైతు వ్యవసాయానికి బ్యాంక్‌ రుణాలు ఇవ్వడం లేదు, చంద్రబాబు హయాంలో  విద్యుత్‌ బకాయిలు రాజశేఖరరెడ్డి గారు వచ్చిన తర్వాత తీర్చారు, రాజశేఖరరెడ్డి గారి హయాంలో  ఎరువల ధరలు ఒక్క సారి కూడ పెరగలేదు.

Back to Top