స్పీకర్‌: శ్రీకాంత్‌ రెడ్డి, శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యే, సిజిసి సభ్యులు: జూన్ 24, 2012

రెండు రోజుల క్రితం మేము చెప్పిన విషయం జగన్‌మోహన్‌రెడ్డి గారి పై కుట్ర జరుగుతుందని ఆ కుట్రలో బాగాంగానే జేడి లక్షినారాయణగారి కాల్‌లిస్ట్‌ బయటపెట్టడం జరిగింది, ఈ అనుమానాలను నివృత్తి చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్ర మీద రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. జగన్‌మోహన్‌రెడ్డిగారి కుట్ర పై కొన్నొ ఛానల్స్‌ స్పందించిన తీరు చూస్తుంటే గుమ్మడికాయల దోంగ భుజాలు తడుముకున్నట్టుగా ఉంది. జేడి లక్ష్మినారాయణ సామాన్యమైన వ్యక్తి కాదు అతని ఫోన్‌ నుండి చంద్రబాల అనే వ్యక్తికి కోన్ని వందల సార్లు ఫోన్లు ఎందుకు పోయాయి తర్వాత చంద్రబాలఫోన్‌ నుండి రాధాకృష్ణ ఫోన్‌కు ఫోన్లు ఎందుకు పోయాయి. అసలు చంద్రబాలను బయటికితీసుకోచ్చింది ఎవరు ఆమెను ఇంటర్వూ చేసింది ఎవరు, ఆమె పరువు పోయిందిఅని అంటుందిఎవరు..... సుప్రీంకోర్టు నార్కోటెస్ట్‌ను వ్యతిరేకించినా జగన్‌మోహన్‌రెడ్డి గారి విషయంలో జేడి లక్ష్మినారాయణ నార్కోటెస్ట్‌కు అనుమతికోరడంలో అంతర్యం ఎంటి, అన్ని రోజులు కారులో తిప్పి కోర్టుకు హజరైయ్యే రోజునా బస్‌లో ఎందుకుతీసుకువెళ్ళారు, జైల్లో అసలు కరెంట్‌ ఎందుకు తీసివేస్తున్నారు....అసలు విషయం పక్కనబెట్టి క్రైం రిపోర్టులకు అన్యాయం జరిగింది అని ఆంధ్రజ్యోతి చానల్‌ ఎందుకు భుజాలు తడుముకుంటుంది. రిపోర్టర్ల్‌ మీద మాకు గౌరవంఉంది, జేడి లక్ష్మినారాయణ ఫోన్‌ నుండి మాకు వ్యతిరేకంగా ఉన్న చానల్స్‌కి మాత్రమే ఎందుకు విషయం లీకుచేస్తున్నారు, జేడి లక్ష్మినారాయణగారు కోర్టునే తప్పుదోవ పట్టించారు. జేడి లక్ష్మినారాయణ ఆధ్యర్యంలో మాకు న్యాయం జరగదు అందుకే ప్రధానమంత్రిని కలుస్తాం. మాకు కాల్‌లిస్ట్‌ పోలీసుల నుండి గాని సాక్షి ఛానల్‌ నుండి కానితీసుకోలేదు మా అభిమానులు ఇచ్చిన సమాచారం మాత్రమే....

శ్రీకాంత్‌ రెడ్డి గారు మాట్లాడుతూ.....కొన్ని ఛానల్స్‌ పత్రికలు మాపై ఎదురుదాడికి దిగుతున్నాయి అందరి వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళేది ఎవరో ప్రజలకి తెలుసు. తారాచౌదరి కాల్‌లిస్ట్‌ బయటపెట్టడం ఆమె వ్యక్తిగతం కాదా ? విజయవాడలో ఐపిఎస్‌ అధికారిమీద కాల్‌లిస్ట్‌లు బయటపెట్టలేదా?  అందరి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించింది రాధాకృష్ణే... పత్రికవిలువలు దిగజార్చింది ఆంధ్రజ్యోతే.....

Back to Top