స్పీకర్ : నల్లా సూర్యప్రకాశ్ -మార్చి28,2012

దళిత గిరిజన సంక్షేమానికి విగాథం కల్ప్పిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రబుత్వం యొక్క కుట్రను ఓడించండి

రాస్త్రంలో ఎస్‌సి, ఎస్‌టి  వర్గాలకు చెందిన నిదులు దారిమళ్ళించబడినందుకు ఎస్‌సి,ఎస్‌టి ఉప ప్రణాళికకు చట్ట బద్ధత కల్పించి నిదులను దారిమళ్లించే 
అదికారులను, మంత్రులను శిక్షించే చట్టం రావాలని 72 గంటల పాటు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రజా సంగాల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి 26 వ 
తేదీ నాడు ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడంతో బెంబేలెత్తిన కిరణ్ కుమార్ ప్రబుత్వం ఈ ఉద్యమాన్ని నీరు కార్చడానికి ఎస్‌సి,ఎస్‌టి ప్రజలను మబ్య 
పెట్టడానికి మంత్రివర్గ ఉపసంగాన్ని నియామకమనే నాటకానికి తెర తీసింది. ప్రబుత్వానికి ఏ మాత్రం చిద్దశుద్ది ఉన్న, అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా 
తీర్మానాన్ని అంగీకరించవలెను. అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తునట్టుగా ఒక ప్రకటన చేయడంతోనే దళిత వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న ఎస్‌సి, ఎస్‌టి వర్గానికి చెందిన మంత్రులు కిరణ్ కుమార్ ని దళిత గిరిజన సంక్షేమ ప్రదాతగా కొనియాడడం సిగ్గు చేటు. తమలో తామే సంకలు గుద్దుకోవడం, జబ్బలు చరచు కోవడం అవివేకం. ఇదేదో పెద్ద సాహసోపేత నిర్ణయంగా ప్రకటించడం మంత్రులయొక్క మూర్కత్వానికి నిదర్శనం.

దేశంలోనే మొదటిసారిగా దళిత గిరిజన ఉప ప్రణాళికను ప్రవేశపెట్టిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధికి చెందుతుందన్నా ఈ మంత్రులు 1980లో ఈ ప్రకటన వస్తే 
అటు కేంద్రంలో కానీ,ఇటు రాష్ట్రాలలో కానీ ఇది ఎందుకు అమలు జరగలేధో ఆత్మ పరిశీలన చేసుకోలేని పరిస్తితి. 33సంవత్సరాల తర్వాత ఇందిరా గాంధీ ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని అడుగుతున్నమంటే దీనికి కారణం కేంద్ర ప్రబుత్వం యొక్క వైపల్యమే. శ్రీమతి సోనియా గాంధీ నేషనల్ అడ్వైసరీ కౌన్సిల్ అద్యక్షురాలి హోదాలో ప్రత్యేకంగా ప్రదానికీ లేక రాసినట్టు గొప్పలు చెప్పుకుంటున్న ఈ మంత్రులు అదికారంలో ఉన్నటువంటి పార్టీ అమలు చేయాల్సింది పోయి 
ఉత్తరాలు రాయాల్సిన అవసరం ఏమిటి. అదికారంలో ఉన్న మీరు విధి విధానాలను అమలు చేయాల్సింది పోయి ఉత్తరాలు రాయడం ప్రజలను వంచించడమే .ఈ 
63 ఏళ్ల కాలంలో ఎస్‌సి, ఎస్‌టి ఎడకపోవడానికి కేంద్రప్రబుత్వ వైపల్యమే కారణం.

        ఒక్క వైఎస్ఆర్ గారి హయాంలోనే దళితులకు చెందాల్సిన నిదులు దారిమళ్ళించకుండా ఉండడానికి ఒక్ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడమే కాక, ప్రతి 3 
నెలలకు ఒక సారి సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించేవారు. ఆయన ఆహారం,ఆటోగ్యం, గృహాలు, విద్యా, బద్రతలు కల్పించిన ఏకైక ముక్యమంత్రి రాజశేకర్ రెడ్డి గారు. 104,108 అంబులన్సులు, ఆరోగ్యశ్రీ, 2 రూ "ల కిలో బియ్యం, పావలవడ్డి రుణాలు, ఫీజు రీ ఎంబర్స్మెంట్ , పింఛన్లు,47 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, లెక్కలేనన్ని 
సంక్షేమ పదకాలు ప్రవేశపెట్టి దళితులకు చెందిన నిదులను సక్రమంగా అమలు చేసిన వ్యక్తి శ్రీ రాజశేకర్ రెడ్డి గారు మాత్రమే.

 శ్రీ రాజశేకర్ రెడ్డి గారి అడుగు జాడలలో నడుస్తున్న ఆయన కుమారుడు దళిత వర్గాలకు చెందిన నిదులు దారి మళ్లించకుండా ఉండాలంటే ప్రత్యేక బడ్జెట్ ద్వారానే 
సాద్యమని, ప్రబుత్వం ఏర్పడిన వెంటనే సాదారణ బడ్జెట్ తో పాటు దళితులకు ప్రత్యేక బడ్జెట్ ప్ప్రవేశపెడతామని హామీ ఇవ్వడం జరిగింది. దలొట వర్గాల ప్రయోజనలు నెరవేర్చడానికి స్తిరమైన అబిప్రాయాలు కలిగిన ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు.

కాంగ్రెస్ పార్టీ తక్షణమే మంత్రివర్గ ఉప కమిటీ నిర్ణయాన్ని ఉపహరించుకొని అవసరమైతే సమావేశాలను 2 రోజులు పొడగించైనా ఎస్‌సి ,ఎస్‌టి ఉప ప్రణాళిక మీద ప్రత్యేకంగా చర్చించి జరిగిన నస్టాన్ని ఏ విదంగా పూరించాలనే దాని మీద సభ సంఘం వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విబాగం డిమాండ్ చేస్తుంది 
అసెంబ్లీలో మంత్రి వర్గంలో చర్చించకుండా  మంత్రి వర్గ ఉపసంఘం వేసి ప్రబుత్వం చేతులు దులుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విబాగం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది.

తాజా వీడియోలు

Back to Top