స్పీకర్ :జూపూడి ప్రభాకరరావు-మార్చి16,2012

కోవూరులో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఓడిపోవడానికి సీద్దం గా ఉన్న కాంగ్రెస్ టి.డి.పి. పార్టీలు కలసి 1000 నుండి 1500 రూపాయలవరకు ప్రజలకు పంచుతున్నారు. దానికి సాక్షం తెలుగుదేశంపార్టీ కి చెందిన బీదం రవిచందర్ దగ్గర దొరికిన కోటి రూపాయలే సాక్షం. అతని దగ్గర 5కోట్ల రూపాయలు దొరికితే 1కోటి మాత్రమే దొరికిందని చూపడంలో పోలీసులకు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారిని తమవైపు తిప్పుకున్నారు. వైయస్ఆర్ అభ్యర్ది ప్రసన్న కుమార్ రెడ్డిది  రెండు నాల్కల దొరని అని అని తెలుగుదేశం నాయకులు అంటూ బూజుపట్టిన సీడీ లను అందరికి పంచుతున్నారు.చంద్రబాబుకు కోవూరు ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు.కాంగ్రెస్ తమ అధికారాన్ని ఉపయోగించి అధికారులని బయపెట్టి  పనులు చేయించుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి కోవూరులో నిల్చునే నాయకుడులేక సర్వేపల్లి నుండి ఓ క్యాండేట్ ఇంపోర్ట్చేసుకుని డబ్బుపంచి కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు కుట్ర కుతంత్రాలతో ఉన్న రాజకీయాలు నాకు తెలియవని అందుకే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ఓట్లు అడగటానికి వచ్చాను అని అన్నారు. ప్రజలను డబ్బుతో సారతో కొనాలంటే వీరు మార్కెట్లో దొరికే కూరగాయలు కాదు అని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ తరుపున కార్యకర్తలను ప్రజలని కోరుతున్నాం.

ఈ ఎన్నికల పోటీ చంద్రబాబు,సోనియా,జగన్ మోహన్ రెడ్డి  గారి మద్య జరుగుతుంది. ప్రసన్నకుమార్ని 50వేల మెజార్టీతో గెలిపించాలని కోవూరు ప్రజలు కోరుకుంటున్నారు. డబ్బుద్వార ఓటు కొనుగోలు చేసే నీచ సంస్క్రుతిని ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని,అక్కడున్న ఆనం బ్రదర్స్ పరువుపోతుందని, తమని ప్రజలు అసహ్యిన్చుకుంటారని తెలుసుకుంటున్నారు. కడప మెజార్టీ మరల కోవూరులో పునరావ్రతమవ్వాలి. తెలివైన కోవూరు ప్రజలు వైయస్ఆర్ పార్టీకి ఒటేయ్యాలి. ఎటువంటి ప్రలోభాలకు కోవూరు ప్రజలు లొంగకుండా ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాం.

తాజా వీడియోలు

Back to Top