స్పీకర్ : గట్టు రామచంద్రరావు- మే4,2012

చంద్రబాబునాయుడు గారుకి చిదంబరంకు ఉన్న సంబంధం ఏంటి వీళ్ళ ఇద్దరి బంధం ఈనాటిది కాదు 2దశాబ్దాలనాటి బంధం ఆ బంధం అప్పటినుండి ఇప్పటిదాకా ఫలితాలు ఇచ్చింది. లోక్సభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎం.పీ. తో చంద్రబాబునాయుడు నన్ను కలిసాడు అని చెప్పి తర్వాత కూడా ఇంకా బుకాయించడం అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబునాయుడు గారు ఢిల్లీ స్థాయిలోనే ఓ రహస్య ఒప్పందం చేసుకున్నాడు. వారు నిరంతరం చాటుమాటుగా కలుసుకుంటున్నారు. కొంత మంది ముక్యుల సలహాలు తీసుకొని సందేహాలు పంపించుకుంటున్నారు. చంద్రబాబుని వయా డిబ్లుగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబునాయుడు అంటే ఓ అబద్దం, ఓ అవినీతి, ఓ కుట్ర, ఓ కుళ్ళు, అని ప్రజలు నమ్ముతున్నారు. మీ ఒప్పందం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం అవమానాలకు గురిఅవుతుంది. మీ ఒప్పందం ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మీ ఒప్పందం ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మీ ఒప్పందం ఫలితంగా చంద్రబాబునాయుడు మీద ఉన్న కేసులన్నీ విచారణ దాక రాకుండా పోయాయి. మీ రహస్య ఎజెండా ప్రజల ముందు పెట్టు. చిదంబరాన్ని కలిసావ్ అని వార్తలోస్తే లేదు నేను కలవలేదు అన్నావ్. ఇప్పుడు చిదంబరమే చంద్రబాబు నన్ను కలిసాడు ఆధారాలు ఉన్నాయ్ అంటున్నాడు. ఇప్పుడు ఎం సమాధానం చెబుతావు. చిదంబరం కొడుకు తో మీ ఎం.పీ.కి ఉన్న వ్యాపార సంబంధాలు చంద్రబాబుకి చిదంబరానికి రాజకీయ సంబంధాలు కాదా అని నేను అడుగుతున్నా . తెలుగుదేశంలో అంతమంది సీనియర్లు ఉండగా సీయమ్ రమేష్ ని,సుజనా చౌదరిని, నామ నాగేశ్వరరావుని మాత్రమే ఎందుకు రాజ్యసభకి పంపుతున్నావ్. వీళ్ళు ముగ్గురు కూడా వ్యాపారంలో బినామీలు ,రాజకీయంలో బినామీలు అందుకే వీళ్ళకు ప్రిపరేషన్ ఇస్తున్నావు. చిదంబరాన్ని చంద్రబాబుని కలిపింది సుజనా చౌదరి కాదా .... ఆ రోజు చిదంబరాన్ని కలవడానికి సాగుసంక్షేమమని, లోక్ పాల్ బిల్లు అని పేరుతో ఢిల్లీకి వెళ్లి రాత్రి 8 నుండి 9, టైం లో ప్రాంతంలో నువ్వు మాయమైంది చిదంబరం దగ్గరికి కాదా ... ఆ గంట ఎక్కడ గడిపావు.. అప్పుడు మీ ఇద్దరి మద్య జరిగిన రహస్య ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ విలీనం కాకముందు అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందని తెలిసి నువ్వు ఢిల్లీ వెళ్లి అహ్మద్ పటేల్ ని కలవలేదా ... అహ్మద్ పటేల్ ని కలిసిన తర్వాత ప్రజారాజ్యం విలీనం ఐతే కాంగ్రెస్ కు సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారని అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టావు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం నిజం కాదు. అలాగే కర్ణాటక గవర్నర్ భరద్వాజ గారిని కర్నాటకలో కలవలేదా...  చంద్రబాబుగారికి 2014 ఎన్నికలు తప్పా 2019 లేదు గెలుపు ఒటములు ఏదైనా 2014 లోనే 2019 తర్వాత రాజకీయ నాయకుడ్ని చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ స్వీకరించదు. కనుక కాంగ్రెస్ తో నువ్వు కలిసిపో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ లో కలపకపోతే నందమూరి వారి పార్టీని వారికి ఇచ్చి నువ్వు కాంగ్రెస్ కి కలిసిపో స్వంతగూటికి వచ్చాడు అని కాంగ్రెస్ వాళ్ళు సంబరమైన పడతారు. రాజశేఖర్ రెడ్డి గారిని సీయల్ప్ సాక్షిగా విమర్శిస్తుంటే సంతోషపడింది సీయం కాదా ... డీయల్ రవీంద్రారెడ్డి గారికి,శంకరరావు గారికి రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శించమని అధిష్టానం ఆదేశించింది అని శంకరరావు గారే చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కటే చెప్పదలుచుకున్నం చనిపోయిన ముఖ్యమంత్రి ని తిడితే మంత్రి పదవులిస్తారు. మిమ్మల్ని తిడితే మంత్రి పదవులు తీస్తారా....

Back to Top