స్పీకర్: గట్టు రామచంద్ర రావు - ఏప్రిల్23,2012

తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స ఇద్దరూ కలసి డ్రామాలు ఆడుతున్నారు. ఈ దార్నాలు ఎండాకాలంలో 26 వేల 
గ్రామాలకి నీటి కరువు వచ్చింది ఈ సమస్యని పరిస్కరించండి అని కాదు లేదు పండిన పంటకు దర రావడం లేదు అని కూడా కాదు. మద్యం కుంబకోణంలో బినామీల 
లైసన్స్లు లు రద్దు చేయాలని ఈ దార్నాలు చేస్తున్నారు. ఏసిబి ఎంక్వైరీ లో 40, 50 మండి ఎం‌ఎల్‌ఏలు ఉన్నారని నివేదిక వస్తే మంత్రులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయరు. ఓ మంత్రికి డబ్బులు ఇచ్చిన కేసులో నున్నా రమణ అనే వ్యక్యి తెలుగుదేశం పార్టీకి చెందినా కాంగ్రెస్ వారు మాట్లాడరు.ఒకరికి 136 షాపులు నీకు ఉన్నాయని 
కాదు మాకు 10 తక్కువ ఉన్నాయని అంటున్నారు. కానీ ఇద్దరూ కలిసే పని చేసుకుంటున్నారు. ఇద్దరికీ మద్యంతో సంబంధం ఉంది. చంద్రబాబునాయుడు బొత్స సత్యనారాయణని తులసి వనంలో గంజాయి మొక్క అని అంటున్నారు. అసలు ఆ రెండు పార్టీలు గంజాయి వనాలు. ఆ రెండు పార్టీలూ గంజాయి మత్తులో ఉన్నాయి. కచ్చితంగా ఏ సి బి ఎంక్వైరీ జరిపితే 20 మంత్రులు, ఎం‌ఎల్‌ఏలను బినామీలుగా తీయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడుకి సి‌పి‌ఐ నారాయణకు ఉన్న ఏజండా ఏమిటి,ఈ ఎజెండాలతో నారాయణ కమ్యూనిస్ట్ పార్టీలను మోసం చేస్తున్నాడు ............ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు ఉన్న సంబందంలో నారాయణ మూడో స్తంబంగా ఉన్నాడు. ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ విజయనగరంలో మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంది,ప్రతిపక్షానికి ప్రజా సమస్యలపైనా దార్నా చేసే బాద్యత ఉంటుంది. కానీ ఆ దర్ణాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న చర్యలు ఖండించ దగ్గవి. ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నపుడు ప్రదాన ప్రతిపక్షనికి బాద్యత లేదా అని అడుగుతున్నాం. అధికార 
పార్టీ ప్రభుత్వ సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకొని ఇష్టం లేని వారిని వేదిస్తున్నపుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిచుకోవడంలో ప్రతిపక్షానికి బాద్యత ఉంటుంది. అటువంటిది జగన్ మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో అదికారులు బాగా చేస్తున్నారు సి‌బి‌ఐ బాగా పని చేస్తుందని అంటున్నావ్ నీ దగ్గరికి వచ్చే సరికి బొత్స కి అదికారులు 
లొంగిపోయారు అంటున్నావు. సి‌బి‌ఐ అదికారులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా పని చేస్తున్నారు. కేసులో 73 మండి పేర్లు పెడితే వారందరినీ పక్కన బెట్టి 53వ పేరుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని 1 వ ముద్దాయిగా చూపుతున్నారు. అసలు విజయసాయి రెడ్డి గారి బేలు రద్దు చేయడం కోసం అప్పీలుకు వెళ్ళిన తీరు సి‌బి‌ఐ ఒక పక్ష పాత ధోరణిని ప్రదర్శిచింది, అదే చంద్రబాబు గారి మీద ఎంక్వైరీ జరగాలనుకునప్పుడు సి‌బి‌ఐ తాత్సారం చేసి కోర్టుకు వెళ్లడానికి అవకాశాలు కల్పించిన తీరు గాని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే చేస్తున్న దుందుడుకు చర్యలు గాని ఇటువంటివి అన్నీ అనుభంద చార్జిషీట్ లు తప్పుడు సంకేతాలకు సి‌బి‌ఐ తెరలేపుతుంది.

తాజా వీడియోలు

Back to Top