స్పీకర్ : డి.ఎ.సోమయాజులు-మార్చి13,2012

వివాదాస్పద 26 జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు వాస్తవాలు తెలపాలని, వారు రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేయడం లేదని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ సలహాదారు డి.ఎ. సోమయాజులు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఆరుగురు మంత్రులకు,11మంది ఐఎయస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు,టి.డి.పి. వారి స్పందన చూస్తుంటే వారికి కేసు అర్దంకాలేదా, అర్ధమై కావాలని మాట్లాడుతున్నారా అనిపిస్తుందని ఆయన అన్నారు. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసు వేరు.. మంత్రులకిచ్చిన నోటీసుల కేసు వేరు అని సి.ఎం అన్నారంటే ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుందిఅని ఆయన అన్నారు. రెండింటికి సంబంధం ఉంది కాబట్టే తప్పుడు జీఓలు అని పేర్కొంటున్న 26 జీఓలు సక్రమమైనవా కావా అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందని ఆయన తెలిపారు. ఆ జీఓలు సరైనవేనని కోర్టుకి తెలుపవలసిన భాద్యత మంత్రులఫై వుందని అన్నారు. టి.డి.పి. నేత అశోక్ గజపతిరాజు, భైరెడ్డి రాజశేఖర్రెడ్డి ,శంకర్రావు చేసిన ఫిర్యాదులు ఒకటేనని అయన అన్నారు. కాంగ్రెస్ టి.డి.పి.లు కలసి జగన్ ను ఏదో రకంగా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కేసు వేసిన వెంటనే శంకర్రావుకు మంత్రి పదవి లభించడం క్విడ్ ప్రోకో కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన జీఓలు ఆధారంగా కేసు పెట్టారు. జగన్ ను 52వ ప్రతివాదిగా మాత్రమే చేర్చారు. అయితే ఎఫ్ఐఆర్ లో సీబీఐ జీఓలను మాత్రం ప్రస్తావించలేదన్నారు. అసలు ఆ జీఓలకు జగన్కు సంబంధం ఏమిటని సోమయాజులు ప్రశ్నించారు. రెండో అంశం సెక్రటరీలను ప్రతివాదులగా చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు మాట్లాడలేదు. నిజంగా టి.డి.పి.  సిన్సియర్ అయితే ఆరోజే దీనిపై స్పందించేది. అయితే జగన్ ను ఏదో రకంగా ఇరికిన్చాలనే ఉద్దేశంతోనే ఇదంతా కాంగ్రెస్ తో కలసి ఆడిన నాటకం అని ఆయన అన్నారు. ఇప్పుడు మంత్రులు రాజీనామా చేయాలని డ్రామా ఆడుతుందని అయన అన్నారు.

Back to Top