స్పీకర్ : బాజిరెడ్డి గోవర్ధన్ - మే1,2012

కేసులు పెడితే బయపడే నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ లో ఎవరు లేరు........... మా ప్రయాణం ముందుకు సాగుతుందే కాని వెనుకడుగు వేసే ప్రశ్నలేదు .
ఈ రోజు ఆందోళకరమైన అంశం ఏంటంటే వైయస్ఆర్ సీపీ అద్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారు తిరుపతిలో పర్యటిస్తున్న సందర్బంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పోలీసు బందోబస్తు పెట్టకుండా, సెక్యూరిటీ లేకుండా జగన్ మోహన్ రెడ్డి గారిని గాలికోదిలేసింది. తోపులాటలో జగన్ మోహన్ రెడ్డి గారిని రెండు సార్లు పడిపోయే పరీస్థితి వచ్చింది ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అర్ధం పట్టే విధం గా ఉంది. రాష్ట్రంలో అంధకారం కోల్పోయేదిశగా పయనిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలో పర్యటిస్తూ ఉంటె ప్రజలు లేకున్న సెక్యూరిటీ పెట్టి వాళ్ళకు హంగు ఆర్భాటం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు సెక్యూరిటీ తో రాష్ట్రంలో పర్యటిస్తుంటే అధికారంలో ఉంది తెలుగుదేశమా లేక కాంగ్రెస్ పార్టీనా అని అనుమానం కలుగుతుంది.
ఈ వివక్షతను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర డీజీపీ గాని హోం మంత్రి గాని అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు గాని ఇప్పటికైనా మేల్కొని జగన్ మోహన్ రెడ్డి గారికి బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన పర్యటనను దిగ్విజయంగా జరిగేటట్టు చూడాలని కోరుతున్నాం. అలా కాని తరుణంలో మా యొక్క కార్యాచరణ ఈ రోజే ప్రకటిస్తాము...
ఒక రాష్ట్ర పార్టీ అద్యక్షుడికి ఈ విధంగా సెక్యూరిటీ లేకుండా నిర్లక్ష్యం చేసి ఆయన పర్యటనను  అడ్డుకోవాలనుకుంటుందా ?
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా ... ఒక పక్క కుట్రలు కుతంత్రాలు చేస్తూ మరో పక్క సెక్యూరిటీ లేకుండా చేస్తారా....

Back to Top