<img src="/filemanager/php/../files/News/YSvijayamma.jpg" style="width:180px;height:166px;margin:5px;float:right">హైదరాబాద్, 4 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ (79) మరణం పట్ల పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సావిత్రమ్మ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సావిత్రమ్మ మరణించిన వార్త తెలిసిన వెంటనే విజయమ్మ కృష్ణదాసుకు ఫోన్ చేసి పరామర్శించారు. ధర్మాన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సావిత్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని విజయమ్మ ఆకాంక్షించారు.